అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తాడిపత్రి ఘర్షణలు: జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు బుక్: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ ప్రయోగం

|
Google Oneindia TeluguNews

అనంతపురం: అనంతపురం జిల్లా తాడిపత్రిలో చోటు చేసుకున్న ఘర్షణల నేపథ్యంలో.. కేసు నమోదుల పర్వం ఆరంభమైంది. ఈ ఘర్షణకు కారణమైన కొందరు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. కొందరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా- తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద ఆయనపై కేసు నమోదైంది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంంలోని సెక్షన్ 307 కింద జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు పెట్టారు.

Recommended Video

అనంతపురం: జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు - తాడిప‌త్రిలో కొన‌సాగుతున్న ఉద్రిక్త ప‌రిస్థితులు..!

వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి భార్యపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం.. ఈ ఘర్షణకు దారి తీసింది. తన భార్యకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన వారు జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులనని భావించిన కేతిరెడ్డి.. నేరుగా ఆయన ఇంటిపైకి దాడి చేశారు. తన అనుచరులతో కలిసి పెద్ద ఎత్తు జేసీ ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి గానీ, ఆయన అనుచరులు, కుటుంబీకులు గానీ ఇంట్లో లేరు. దీనితో వారు అక్కడే కాపు కాశారు. ఈ విషయం తెలుసుకున్న జేసీ అనుచరులు.. కేతిరెడ్డి వర్గంపై ప్రతిదాడులకు దిగారు. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు.

Case filed against TDP leader JC Prabhakar Reddy over fight between two groups in Tadipatri

దీనితో కొన్ని గంటల పాటు తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.. దాడులు ప్రతిదాడులతో అట్టుడికిపోయింది. ఈ ఘటన అనంతరం పోలీసులు రంగ ప్రవేశం చేశారు. 144 సెక్షన్ విధించారు. పలువురిపై కేసులు నమోదు చేశారు. కొందరిని అదుపులోకి తీసుకున్నారు. కేతిరెడ్డి అనుచరులపైనా కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. తాజాగా- శుక్రవారం జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు పెట్టారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి వర్గీయుల ఫిర్యాదు మేరకు జేసీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. తాడిపత్రి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ ఘటనలో తాడిపత్రిలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.

English summary
The police have given a rude shock to the former MLA JC Prabhakar Reddy where an atrocity case has been registered against him and others. Cases have been filed under sections 307 of the SC and ST against JC Prabhakar Reddy and others over the clashes between the TDP and YSRCP cadre.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X