వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నారా లోకేష్ పై క్రిమినల్ కేసు నమోదు.. లోకేష్ ఆ ట్వీట్ పై అనంతలో వైఎస్సార్సీపీ నేత ఫిర్యాదు

|
Google Oneindia TeluguNews

తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై అనంతపురం జిల్లా డి హిరేహాల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పై నారా లోకేష్ ట్విట్టర్లో చేసిన ఆరోపణల నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ నేత భోజరాజు నాయక్ లోకేష్ పై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.

లోకేష్ ఆ ట్వీట్ పై కేసు నమోదు

అసలేం జరిగిందంటే గత నెల 21వ తేదీన అనంతపురం జిల్లా రాయదుర్గం కు చెందిన టిడిపి కార్యకర్త మారుతి పై కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి జిల్లా రాంపురం గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు ఘటన లో మారుతి కి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న లోకేష్ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అవినీతిని ప్రశ్నించినందుకు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న అందుకే మారుతీ పై కక్ష కట్టి అతనిపై దాడి చేశారంటూ ఆరోపించారు లోకేష్ . దీనిని కౌంటర్ చేస్తూ వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

టీడీపీ కార్యకర్తపై దాడి ఘటన , ఎమ్మెల్యే పై ఆరోపణలు చేశారని ఫిర్యాదు

టీడీపీ కార్యకర్తపై దాడి ఘటన , ఎమ్మెల్యే పై ఆరోపణలు చేశారని ఫిర్యాదు


టిడిపి కార్యకర్తపై కర్ణాటకలో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని, అయితే కర్ణాటకలో టిడిపి కార్యకర్త పై జరిగిన దాడిపై ఎలాంటి సంబంధం లేనప్పటికీ రాజకీయ దురుద్దేశంతో ప్రభుత్వ విప్ మరియు రాయదుర్గం శాసనసభ్యులు కాపు రామచంద్రా రెడ్డి పై లోకేష్ నిందలు వేసినందుకు ఆయన పైన ఫిర్యాదు చేశారు వైయస్సార్ సిపి ఎస్సీసెల్ నేత భోజరాజు నాయక్.సోషల్ మీడియాలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిని నిందిస్తూ, వార్నింగ్ లు ఇస్తూ ఆయన గౌరవానికి భంగం కలిగిస్తూ, ఆయనపై ప్రజలలో వ్యతిరేక భావం కలిగేలా పోస్టులు పెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

నారా లోకేష్ పై డి హిరేహాల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు

నారా లోకేష్ పై డి హిరేహాల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు

కాపు రామచంద్రారెడ్డిని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా నష్టపరచటం కోసం కుట్ర పన్నినట్టు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో నారా లోకేష్ పై డి హిరేహాల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. క్రైమ్ నెంబర్ 111/ 2021అండర్ సెక్షన్ ఐపీసీ 153(A) ,505, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది.నిన్నటికి నిన్న టిడిపి అధినేత చంద్రబాబుపై కర్నూలులో న్యాయవాది సుబ్బయ్య ఆంధ్రప్రదేశ్ ప్రజలను కరోనా కొత్త రకం వైరస్ అంటూ చంద్రబాబు భయాందోళనకు గురి చేశారని ఫిర్యాదు చేశారు .

Recommended Video

Criminal cases against KCR for demolition of temple, mosques at Secretariat: Congress
టీడీపీ అధినేత చంద్రబాబుపైనా కేసు నమోదు

టీడీపీ అధినేత చంద్రబాబుపైనా కేసు నమోదు

కరోనా వైరస్ కు సంబంధించి చంద్రబాబునాయుడు చేస్తున్న దుష్ప్రచారం వల్లే కర్నూలులో సామాన్య జనం భయాందోళనకు గురవుతున్నారని సుబ్బయ్య తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో చంద్రబాబుపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు.ఇక ఈ కేసులో చంద్రబాబుకు నోటీసులు జారీ చేస్తామని ఎస్పీ ఫకీరప్ప తెలిపారు. చంద్రబాబు నాయుడుపై క్రైమ్ నెంబర్ 80 /2021 ప్రకారం ఐపీసీ 155 ,505 (1)బి(2) స్పెషల్ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అదే విధంగా ప్రకృతి వైపరీత్యాల చట్టం కింద కూడా చంద్రబాబు పై సెక్షన్ 4 కింద నాన్ బెయిలబుల్ సెక్షన్లు ఫైల్ చేశారు పోలీసులు.

English summary
Based on the complaint of YSRCP ST Cell leader Bhojuraju Naik, D Hirehal police in Anantapur district registered a criminal case against TDP national general secretary Nara Lokesh. The case was filed on the allegations against YSRCP MLA Kapu Ramachandra Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X