కుప్పం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు పీఏ అడ్డంగా దొరికేశాడు..టీడీపీ హయాంలో భారీ గోల్‌మాల్.. సీఎం జగన్ వదిలేనా..?

|
Google Oneindia TeluguNews

కుప్పం: ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పీఏ బ్యాంక్ స్కామ్‌కు పాల్పడ్డారంటూ ఆయనపై కుప్పం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసును వైసీపీ కార్యకర్తల ఫిర్యాదు మేరకు పోలీసులు నమోదు చేశారు. కుప్పం కోఆపరేటివ్ టౌన్ బ్యాంకు స్కామ్‌లో చంద్రబాబు నాయుడు పీఏ మనోహర్ హస్తముందని వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు.

Recommended Video

Case Filed On Chandrababu Naidu's PA By YSR Congress Party Workers
 1.92 కోట్లు స్కామ్..

1.92 కోట్లు స్కామ్..

తెలుగుదేశం హయాంలో రూ. 1.92 కోట్లు మేరా బ్యాంకులో స్కామ్ జరిగినట్లు ప్రస్తుత కుప్పం కోఆపరేటివ్ టౌన్‌బ్యాంకు ఛైర్మెన్ పీవీ ఉప్పేంద్ర కుమార్ తెలిపారు. గత నెల మార్చిలో జరిగిన ఆడిట్ మరియు ఇన్స్‌పెక్షన్ సందర్భంగా ఈ మొత్తం స్కామ్ వెలుగు చూసినట్లు ఆయన చెప్పారు. గత నెల మార్చి 9న నగలు వివరాలకు సంబంధించి జ్యువెలరీ అప్రైజల్ జరగగా రూ.46.75 లక్షలు విలువ చేసే 30 బంగారం ప్యాకెట్లు అదృశ్యమైనట్లు వెలుగులోకి వచ్చిందని ఫిర్యాదులో వైసీపీ నేతలు పేర్కొన్నారు. ఇక ఈ 30 బంగారం ప్యాకెట్లపై వడ్డీ రూ.38.44 లక్షలుగా ఉందని చెప్పారు. ఇదిలా ఉంటే లాకర్ ఇంఛార్జ్‌గా ఉన్న మేనేజర్ వీఎస్వీ నవీన్ బాబును ప్రశ్నించగా ఇది తన బాధ్యత అని మార్చి 15లోగా కనిపించకుండా పోయిన బంగారంకు సంబంధించిన మొత్తం డబ్బులు వడ్డీతో సహా తానే చెల్లిస్తానని చెప్పాడు. అయితే ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా చెల్లంచలేదని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

 2015లో రూ.20.25 లక్షలు మిస్సింగ్

2015లో రూ.20.25 లక్షలు మిస్సింగ్

ఇక 17 మార్చిన మరోసారి ఇన్స్‌పెక్షన్ జరిగింది. ఆ సమయంలో బ్యాంకులో నగదు రూ. 74.81 లక్షలు ఉండాల్సి ఉండగా అది రూ. 27.97 లక్షలు మాత్రమే ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. మొత్తం రూ.46.83 లక్షలు మేరా డబ్బులు పక్కదారి పట్టినట్లు గుర్తించారు. ఇక దీనిపై ఆరా తీయగా బ్యాంక్ మేనేజర్ వీఎస్వీ నవీన్ బాబు, క్యాషియర్ కమల్ కుమార్‌లు ఇద్దరూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారని కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ఛైర్మెన్ చెప్పారు. ఇక మరో రూ.20.25 లక్షలకు సంబంధించి వీఎస్వీ నవీన్ బాబును ప్రశ్నించగా 2015లో శ్రీనివాసులు అనే వ్యక్తి ఈ మొత్తం డబ్బును తీసుకున్నారని చెప్పారు.

 2015లో బాబు పీఏ మనోహర్ రికమెండేషన్ పై..

2015లో బాబు పీఏ మనోహర్ రికమెండేషన్ పై..

శ్రీనివాసులు అనే వ్యక్తి ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పీఏ మనోహర్‌ రికమెండేషన్ మేరకు వచ్చి శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ దేవస్థానంకు చెందిన 16 బాండ్లను పెట్టి డబ్బులు తీసుకెళ్లాడని నవీన్ బాబు కుండ బద్దలు కొట్టాడు. ఇక ఈ బ్యాంకులో చాలా అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. తనఖా రుణాల నుంచి ఇతరత్ర రుణాల వరకు పెద్ద ఎత్తున అక్రమాలు, అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. ఇదంతా టీడీపీ హయాంలోనే జరిగినట్లు అధికారులు గుర్తించారు. కుప్పం టౌన్‌బ్యాంకు ఛైర్మెన్ ఉపేంద్రకుమార్ మరియు వైసీపీ కార్యకర్తలు స్కామ్‌పై లోతైన దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. టీడీపీ నేతలు లూటీ చేసిన డబ్బును కక్కించాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు.

English summary
YSR congress party workers on tuesday lodged a complaint against former AP CM Chandrababu Naidu's personal assistnat, P. Manohar, at Kuppam police station alleging that the latter had involvement in the Kuppam Cooperative town bank scam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X