క్యాస్ట్ సర్టిఫికెట్ ఇక నుండి గ్రామాల్లోనే .. మరో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గ్రామాల విషయంలో పలు కీక నిర్ణయాలు తీసుకుంటున్నారు . గ్రామాల సమగ్రాభివృద్ధి మాత్రమే కాదు గ్రామ ప్రజలు ఏ చిన్న విషయానికి ఇబ్బంది పడకుండా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలపై గ్రామాల ప్రజల నుండి హర్షం వ్యక్తం అవుతుంది.ఇక తాజాగా గ్రామాల్లోని వ్యక్తులు ఎవరైనా కుల ధృవీకరణ సర్టిఫికెట్ తీసుకోవాలంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా గ్రామ సచివాలయాల్లో తీసుకునేలా నిర్ణయం తీసుకున్నారు సీఎం జగన్.
నిన్న విలేజ్ కోర్టులు ... నేడు విలేజ్ క్లినిక్ లు .. గ్రామాలపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్

కుల ధృవీకరణ పత్రాలు గ్రామాల్లోనే అందించాలని ఏపీ ప్రభుత్వ నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామాలలో నివసించే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు గుడ్ న్యూస్ చెప్పింది. కుల ధృవీకరణ పత్రాలు గ్రామాల్లోనే అందించాలని నిర్ణయం తీసుకుంది. సాధారణంగా క్యాస్ట్ సర్టిఫికెట్ కావాలంటే ఎమ్మార్వో కార్యాలయంలో దరఖాస్తు చేసుకుని కార్యాలయం చుట్టూ తిరగాలి . సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంతో గ్రామాల ప్రజలు ఎవరూ ఇకపై ఎమ్మార్వో కార్యాలయం చుట్టూ కాస్ట్ సర్టిఫికెట్ (కుల ధృవీకరణ పత్రం) కోసం తిరగాల్సిన పనిలేదు.

గ్రామీణ ప్రజలకు శుభవార్త చెప్పిన ఏపీ సర్కార్
ఇక నుంచి ఆ సర్టిఫికెట్లను గ్రామ, వార్డు సచివాలయాల్లోనే అందించాలని జగన్ సర్కార్ ఆలోచన చేస్తుంది . దీనిపై అధికారులు ఇప్పటికే కసరత్తులు మొదలుపెట్టారు.సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో ముందుముందు కుల ధృవీకరణ పత్రాలు గ్రామ, వార్డు సచివాలయాల్లోనే జారీ కానున్నాయి. ఇది వాస్తవంగా గ్రామస్తులకు శుభవార్తే . ఎందుకంటె కుల ధృవీకరణ పత్రాల కోసం మండల కేంద్రానికి వెళ్లి ఎమ్మార్వో ఆఫీసులో దరఖాస్తు చేసుకోవాలి.

గ్రామ, వార్డు సచివాలయాలలో క్యాస్ట్ సర్టిఫికెట్లు
ఇక సర్టిఫికెట్ వచ్చే వరకు మండల కేంద్రానికి తిరగాలి .తాజా నిర్ణయంతో గ్రామంలోనే సర్టిఫికెట్ ఇస్తారు కాబట్టి గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇప్పటివరకు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించి అన్ని సర్టిఫికెట్లను డిప్యూటీ తహశీల్దార్, జిల్లా కలెక్టర్లు మంజూరు చేశారు. ఇక నుంచి ఆ సర్టిఫికెట్లను జారీ చేసే అధికారులను గ్రామ, వార్డు సచివాలయాలకు ప్రభుత్వం అప్పగించనుంది.

మార్చి నెలాఖరు నుంచి ఈ విధానం
ఇక ఇతర రాష్ట్రాల్లో, లేదా విదేశాల్లో విద్య, ఉద్యోగ అవసరాల కోసం ఇచ్చే సర్టిఫికెట్లను మాత్రం తహశీల్దార్, అంతకన్నా పైస్థాయి అధికారి మంజూరు చేస్తారు . మార్చి నెలాఖరు నుంచి గ్రామ, వార్డుల పరిధిలోనే క్యాస్ట్ సర్టిఫికెట్ ఇచ్చే ఈ విధానం అమలులోకి రానుంది. ఇది నిజంగా చాలా ఉపయోగకరమైన ఆలోచన అని గ్రామీణ ప్రాంతాల ప్రజలు అంటున్నారు. తమకు ఎమ్మార్వో ఆఫీసుల చుట్టూ తిరిగే బాధ తప్పుతుందని వారంటున్నారు.