వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కులం కావాలా...నీళ్లు కావాలా : ఒక్క కులం వారికే ఇచ్చానా : ఏపి ఎన్నిక‌ల్లో కుల పాట్లు...!

|
Google Oneindia TeluguNews

ఏపి లో రాజ‌కీయ పార్టీలు కుల పాట్లు ప‌డుతున్నాయి. ఏపిలో ఎన్నిక‌ల‌ను ప్ర‌భావితం చేసేది సామాజిక స‌మీక‌ర‌ణాలే. ఈ సారి అవి మ‌రింత తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. మూడు పార్టీల అధినేత‌లను మూడు ప్ర‌ధాన సామాజిక వ‌ర్గాల వా రు ఓన్ చేసుకుంటున్నారు. ఇక‌, అధికార పార్టీ ఒక్క కులానికే ప్రాధాన్య‌త ఇస్తుంద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. దీంతో.. అ ధికారిక టిడిపి ఎన్నిక‌ల ప్ర‌చార ప్ర‌క‌ట‌న‌ల్లో సైతం దీని పై వివ‌ర‌ణ ఇచ్చుకోవాల్సి వ‌స్తోంది. ఆ ప్ర‌క‌ట‌న‌లో తాము ఒకే కులానికి ప్రాధాన్య‌త ఇచ్చామా అంటూ ప‌రోక్షంగా త‌మ పై ఉన్న అరోప‌ణ‌ల‌కు స‌మాధానం ఇచ్చే ప్ర‌య‌త్నం చేస్తోంది..

<strong>జ‌గ‌న్ ఓపెన్ ఎటాక్ : బాబు - రాధాకృష్ణ మొహంలో ఓట‌మి భ‌యం : నాడు వైయ‌స్ త‌ర‌హాలోనే..!</strong>జ‌గ‌న్ ఓపెన్ ఎటాక్ : బాబు - రాధాకృష్ణ మొహంలో ఓట‌మి భ‌యం : నాడు వైయ‌స్ త‌ర‌హాలోనే..!

 నంది అవార్డుల నుండి మొద‌లు..

నంది అవార్డుల నుండి మొద‌లు..

రాష్ట్ర విభ‌జ‌న తరువాత ఏపి లో టిడిపి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌రువాత నంది అవార్డుల‌ను ప్ర‌క‌టించారు. అందులో ఒకే సామాజిక వ‌ర్గానికి ప్రాధాన్య‌త ఇచ్చారంటూ ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. పోసాని కృష్ణ ముర‌ళీ వంటి వారు ఈ ఆరోప‌ణ‌ల ను ఓపెన్ గానే చేసారు. ఇక‌, ప్ర‌భుత్వంలో కీల‌క ప‌దవులు.. సీయంఓ లో అధికారులు..చంద్ర‌బాబు కోట‌రీ...ముఖ్య విభా గాల్లోనూ ఒకే సామాజిక వ‌ర్గం వారు పెత్త‌నం చేస్తున్నారంటూ తాజాగా టిడిపి నుండి వైసిపి లో చేరిన చీరాల ఎమ్మెల్యే గా ప‌ని చేసిన ఆమంచి కృష్ణ మోహ‌న్ ఆరోపించారు. అదే స‌మ‌యంలో టిడిపి లో ఎమ్మెల్యే ఉంటూ ఈ మ‌ధ్య కాలంలో వైసిపి లో చేరి గుంటూరు ఎంపీగా పోటీ చేస్తున్న మోదుగుల వేణుగోపాల రెడ్డి టిడిపి లో ఉండ‌గానే..త‌న సామాజిక వ ర్గం వారితో క‌లిసి ప‌ని చేస్తాన‌ని వ్యాఖ్యానించారు. ఇక‌, ఏపి ప్ర‌భుత్వంలో కుల జాడ్యం పెరిగిపోయింద‌నే ఆరోప‌ణ‌లు వెల్లు వెత్తాయి. స‌రిగ్గా ఎన్నిక‌ల షెడ్యూల్ కు ముందు వైసిపి ఇదే వ్య‌వ‌హారాన్ని అస్త్రంగా మ‌ల‌చుకొని టిడిపి నిల‌క్ష్యం గా చేసుకొని ఢిల్లీ వేదిక‌గా ఆరోప‌ణ‌లు చేసారు.

నేరుగా టార్గెట్ చేసిన వైసిపి..

నేరుగా టార్గెట్ చేసిన వైసిపి..

ఇక‌, టిడిపి ప్ర‌భుత్వం ఎన్నిక‌ల కోసం ముఖ్య‌మంత్రి సామాజిక వ‌ర్గానికి చెందిన పోలీసు అధికారుల‌ను నిఘా విభాగం లో వినియోగిస్తుంద‌ని వైసిపి ఆరోపించింది. కొంత మంది అధికారుల పేర్ల‌ను ప్రస్తావిస్తూ వీరు కేవ‌లం సామాజిక వ‌ర్గం ఆధారంగా పోలీసు శాఖ‌లో ప్ర‌త్యేకంగా ప‌ని చేస్తున్నారంటూ ఎన్నిక‌ల సంఘం దృష్టికి తీసుకొచ్చారు. ఇక‌, అదే స‌మ యంలో టిడిపి ఎదురు దాడి ప్రారంభించింది. వైసిపి లో అంద‌రూ ఒకే సామాజిక వ‌ర్గం వారికి ప్రాధాన్య‌త ఇవ్వ‌టం లేదా అని ప్ర‌శ్నించారు. ముఖ్య‌మంత్రి మాత్రం త‌న పై వ‌చ్చిన ఆరోప‌ణ‌లను తిప్పి కొట్టారు. త‌న క్యాబినెట్‌లో రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన వారికి న‌లుగురికి అవ‌కాశం ఇచ్చామ‌ని చెప్పుకొచ్చారు. తాను ఏం ప‌ని చేసినా..సామాజిక స‌మ‌తుల్య‌త పాటిస్తాన‌ని..ప‌క్క‌న ఎవ‌రున్నార‌నే అంశాన్ని చూసుకున్నాకే బ‌య‌ల్దేరుతాన‌ని చెప్పుకొచ్చారు. ఇక‌, జ‌న సేన అధినేత ప‌వ‌న్ తన‌కు కులం లేద‌ని ఎన్నో సార్లు చెప్పారు. కానీ, కొంద‌రు ప్ర‌ముఖులు మాత్రం ఆయ‌న‌కు సామా జిక వ‌ర్గం అంక‌డుతూనే ఉన్నారు.

ప్ర‌క‌ట‌న‌ల ద్వారా న‌ష్ట నివార‌ణ‌..

ప్ర‌క‌ట‌న‌ల ద్వారా న‌ష్ట నివార‌ణ‌..

ఇప్పుడు ఏపి అధికార పార్టీ టిడిపి ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకొనేందుకు ప్ర‌త్యేకండా ప్ర‌క‌ట‌న‌ల‌ను విడుద‌ల చేసింది. కొద్ది రోజులుగా టివి ల్లో ఈ ప్ర‌క‌ట‌న‌లు హోరెత్తిస్తున్నాయి. ప్ర‌భుత్వ ప‌ధ‌కాల కు ప్ర‌చారం క‌ల్పించ‌టం తో పాటుగా ఈ మ‌ధ్య కొత్త ప్ర‌క‌ట‌న ప్ర‌సారం అవుతోంది. అందులో మీ కులం చూసి మీకు ల‌బ్ది చేస్తున్నామా.. కులం చూసి ఇళ్లు ఇచ్చారా..పెన్ష‌న్ ఇచ్చారా..అన్న‌దాత సుఖీభ‌వ కులం చూసి చేసారా అంటూ ప్ర‌శ్నించ‌టం..ఆ ప్ర‌క‌ట‌న‌లో క‌నిపిస్తోం ది. దీని ద్వారా త‌మ పై రాజ‌కీయంగా చేస్తున్న ఆరోప‌ణ‌ల‌కు స‌మాధానం చెప్పుకొనే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంది. ఇక‌, చంద్ర‌బాబు త‌న ఎన్నిక‌ల ప్ర‌చారం లో ఎక్క‌డా కులం పేరు ఎత్త‌కుండా...కొన్ని కీల‌క వ్యాఖ్య‌లు మాత్రం చేస్తున్నారు. కులం కావాలా..నీళ్లు కావాలా, కులం కావాలా..అభివృద్ది కావాలా అంటూ వైసిపి కి మ‌ద్ద‌తిచ్చే ఓ ప్ర‌ధాన సామాజిక‌వ‌ర్గం ఎక్కువ‌గా ఉండే నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇటువంటి నినాదాల ద్వారా వారిని త‌మ వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఏపిలో క‌నిపిస్తున్న ఈ కుల రాజ‌కీయం ఏపికి శ్రేయ‌స్క‌రం కాద‌నే అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది.

English summary
Caste politics is peak in Ap elections. Irrespective of political parties all are playing caste politics. Now, in parties campaign advertisements also in this manner.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X