వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు సస్పెన్షన్: కృష్ణకిశోర్‌ అంశంపై క్యాట్ మధ్యంతర ఉత్తర్వులు: కక్షపూరిత చర్యగా.

|
Google Oneindia TeluguNews

ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసిన ఐఆర్ఎస్ అధికారి కృష్ణకిశోర్‌ సస్పెన్షన్‌ను నిలిపివేస్తూ సోమవారం కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ (క్యాట్‌) మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణకిశోర్‌ను సస్పెండ్‌ చేయడంతోపాటు ఆయనపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేయాలంటూ ఏసీబీ, సీఐడీలను ఆదేశిస్తూ ఏపీ ప్రభుత్వం ఈ నెల 12న జారీ చేసిన జీవో-2814 అమలుపై స్టే మంజూరు చేసింది. ప్రభుత్వ జీవోను సవాలు చేస్తూ అత్యవసరంగా విచారించాలంటూ కృష్ణకిశోర్‌ చేసిన అభ్యర్థనపై. క్యాట్‌ సభ్యులు బి.వి.సుధాకర్‌ విచారణ చేపట్టారు. ఇప్పటికే ఈ వ్యవహారం పైర రాజకీయంగా విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. ప్రభుత్వం తనపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని కృష్ణకిశోర్‌ చెప్పటం కీలకంగా మారింది.

ఐఆర్‌ఎస్‌ అధికారి కృష్ణకిశోర్‌ సస్పెన్షన్‌: జగన్ కేసుల విచారణలో ఆయన ఇలా: చంద్రబాబు హాయంలో ఏపీకి..!ఐఆర్‌ఎస్‌ అధికారి కృష్ణకిశోర్‌ సస్పెన్షన్‌: జగన్ కేసుల విచారణలో ఆయన ఇలా: చంద్రబాబు హాయంలో ఏపీకి..!

ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు సస్పెన్షన్

ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు సస్పెన్షన్

ఏపీలో డిప్యుటేషన్ మీద పని చేస్తున్న ఐఆర్ఎస్ అధికారి పైన ఏపీ ప్రభుత్వ విధించిన సస్పెన్షన్ ను నిలిపివేస్తూ క్యాట్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం కృష్ణకిశోర్‌ను సస్పెండ్‌ చేయడం తోపాటు ఆయనపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేయాలంటూ ఏసీబీ, సీఐడీలను ఆదేశిస్తూ ఏపీ ప్రభుత్వం ఈ నెల 12న జారీ చేసిన జీవో-2814 అమలుపై స్టే మంజూరు చేసింది. తాజాగా ప్రభుత్వ ఆదేశాల మేరకు..వచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడి కేసు నమోదు చేసింది. అయితే, ప్రభుత్వ జీవోను సవాలు చేస్తూ అత్యవసరంగా విచారించాలంటూ కృష్ణకిశోర్‌ చేసిన అభ్యర్థనపై. క్యాట్‌ సభ్యులు బి.వి.సుధాకర్‌ విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫున సుప్రీంకోర్టు న్యాయవాదులు నీరజ్‌ మల్హోత్ర, పరమాత్మ సింగ్‌లు వాదనలు వినిపించారు.

 ప్రభుత్వం అభ్యర్ధనతోనే ఏపీకి..

ప్రభుత్వం అభ్యర్ధనతోనే ఏపీకి..

రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానిస్తేనే కృష్ణకిశోర్‌ ఇక్కడ సర్వీసులో చేరారని, ప్రస్తుత ప్రభుత్వం ఆయన సేవలపై ఆసక్తిగా లేనందున సొంత శాఖకు వెళతానని ఆయన విజ్ఞప్తి చేశారని న్యాయవాదులు విన్నవించారు. ఈ పరిస్థితుల్లో కృష్ణకిశోర్‌ను విధుల నుంచి రిలీవ్‌ చేయకుండా సస్పెండ్‌ చేస్తూ క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలనడం చట్టవిరుద్ధమన్నారు. ఆయన కేంద్ర సర్వీసు నుంచి వచ్చారని, ఆయనపై చర్యలకు కేంద్రానికి సిఫారసు చేయాల్సి ఉందని, అంతే తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి చర్యలు తీసుకునే పరిధిలేదని చెప్పారు. దీనిపై వివరణ ఇవ్వడానికి గడువు కావాలని ఏపీ ప్రభుత్వ న్యాయవాది కోరడంతో క్యాట్‌ సభ్యులు అనుమతిస్తూ... అప్పటివరకు జీవో అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణను ఈ నెల 24కి వాయిదా వేశారు.

కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు..

కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు..

ప్రభుత్వం తనపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని కృష్ణకిశోర్‌ ఆరోపించారు. ప్రస్తుత సీఎం జగన్‌ అక్రమాస్తులపై గతంలో సీబీఐ కేసు దర్యాప్తు చేస్తున్న సమయంలో ఆయనకు చెందిన జగతి పబ్లికేషన్స్‌ వాటా విలువను ఐటీ శాఖ కమిషనర్‌గా విచారించిన అంశాన్ని ఆయన గుర్తు చేస్తున్నారు. ఆ సందర్భంగా జగతి పబ్లికేషన్స్‌ పేర్కొన్న మేరకు దాని వాటా విలువలేదని నివేదిక ఇచ్చానని చెప్పుకొచ్చారు. ఇది వృత్తి పరంగా చేసినదేగానీ ఎలాంటి ఉద్దేశాలు లేవని స్పష్టం చేశారు. వీటిని దృష్టిలో ఉంచుకుని తనను వేధిస్తున్నారని.. 5 నెలలుగా జీతం చెల్లించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.

English summary
CAT gave stay on Ap Govt orders which gave on IRS officer J Krishna Kishore. AP Govt suspended him on irregularities in funds allocation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X