వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్రం ఆదేశాలు పట్టవా: కృష్ణకిషోర్‌ను ఎందుకు రిలీవ్‌ చేయలేదు: ఏపీ ప్రభుత్వం పై క్యాట్ ఆగ్రహం..!

|
Google Oneindia TeluguNews

కృష్ణకిషోర్‌ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వంపై క్యాట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐఆర్‌ఎస్‌ కృష్ణకిషోర్‌ని ఎందుకు రిలీవ్‌ చేయలేదని ప్రభుత్వాన్ని క్యాట్ ప్రశ్నించింది. కేంద్రం ఆదేశాలను ఎందుకు పట్టించుకోలేదని ప్రభుత్వాన్ని క్యాట్‌ ఆగ్రహించింది. తక్షణం వివరణ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వానికి క్యాట్‌ ఆదేశాలు జారీ చేసింది. 10 రోజుల క్రితం ఏపీఈడీబీ సీఈవో కృష్ణకిషోర్‌‌ను ప్రభుత్వం సస్పెన్షన్‌ చేసింది. నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని కిషోర్‌పై సీఐడీ కేసు కూడా నమోదైంది. ఈ క్రమంలో ఆయన క్యాట్‌ను ఆశ్రయించారు. దీంతో..క్యాట్ తాజాగా ప్రభుత్వం మీద సీరియస్ అయింది.

కేంద్రం ఆదేశాలు అమలు చేయరా..

ఐఆర్ఎస్ అధికారి కృష్ణకిషోర్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసిన వ్యవహారంపై క్యాట్ సీరియస్ అయ్యింది. ఐఆర్‌ఎస్‌ కృష్ణకిషోర్‌ని ఎందుకు రిలీవ్‌ చేయలేదని ప్రభుత్వాన్ని క్యాట్ ప్రశ్నించింది. కేంద్రం ఆదేశాలను ఎందుకు పట్టించుకోలేదని ప్రభుత్వాన్ని క్యాట్‌ ఆగ్రహించింది. తక్షణం వివరణ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వానికి క్యాట్‌ ఆదేశాలు జారీ చేసింది.

కృష్ణ కిషోర్‌ సస్పెన్షన్‌లో నిబంధనలు పాటించలేదని... కృష్ణ కిషోర్‌ సస్పెన్షన్‌ అసమంజసంగా పేర్కొంది రాష్ట్ర ప్రభుత్వం తన శక్తియుక్తులను అభివృద్ధికి వినియోగించాలని వ్యాఖ్యానించింది. కృష్ణ కిషోర్‌కి పెండింగ్‌లో ఉన్న జీతం వెంటనే చెల్లించాలని ఆదేశించింది. ఒక అధికారి విషయంలో ప్రభుత్వం ఇంతగా వ్యవహరించాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించింది. సస్పెన్షన్ పైన వచ్చే నెల 31వరకు స్టే పొడిగించింది.

CAT serious on Ap govt..stay on Krishna Kishore suspension

ఏపీ ప్రభుత్వం ఏం చేయనుంది..

ఐఆర్ఎస్ అధికారి కృష్ణకిషోర్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మౌలికవసతులు, వాణిజ్య శాఖ నుంచి అందిన రిపోర్ట్ ఆధారంగా ఆయనపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని కిషోర్‌పై సీఐడీ కేసు కూడా నమోదైంది. అయితే ఈ వ్యవహారంపై ఇప్పటికే రెండు మూడు సార్లు హైకోర్టులో కృష్ణకిషోర్‌కు ఊరట లభించింది. ఇదిలా ఉంటే.. ఏపీ ప్రభుత్వంపై క్యాట్‌ సీరియస్‌ అయ్యింది. ఆయన పైన వైసీపీ ప్రభుత్వం గతంలో జగతి పబ్లికేషన్స్ షేర్ల వ్యవహారం పైన విచారణ చేసిన కారణంగా వేధింపులకు పాల్పడుతోందంటూ టీడీపీ విమర్శించింది.

చంద్రబాబు హాయంలో కేంద్రం నుండి డిప్యుటేషన్ మీద వచ్చిన కృష్ణకిషోర్‌ తిరిగి కేంద్రానికి వెళ్లాలని అభ్యర్ధించారు. ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆయనపైన సస్పెన్షన్ వేటు వేసింది. ఇప్పుడు క్యాట్ ఆదేశాల పైన రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఇప్పటికే ఈ వ్యవహారం పైన రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది.

English summary
Central Admiistrative Triunal serious on Ap govt in IRS officer Krihsna kishore issue. CAT ordered state govt to release his pending salary immediately.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X