వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీ ప్రియులూ జాగ్రత్త! రైలు టాయ్‌లెట్లో టీ క్యాన్లు: ఏం జరిగింది?(వీడియో)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: భారతీయులకు టీ(ఛాయ్)తో ఉన్న అనుబంధం విడదీయరానిది. దాదాపు అన్ని సమయాలు, సందర్భాల్లోనూ టీ తాగేందుకు మొగ్గు చూపుతారు. ఇక ప్రయాణాల్లో అయితే టీ తాగకుండా ఉండలేరు కొందరు.

అయితే, ఇప్పుడు మాత్రం రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులు ఈ వీడియో చూసిన తర్వాత టీకి దూరంగా ఉండే అవకాశాలే ఎక్కువ. ఎందుకంటే.. టీ తీసుకొచ్చే క్యాన్లలో టీ అమ్మేవారు టాయ్‌లెట్లలోని నీళ్లను నింపడం గమనార్హం. ఇప్పుడు ఈ వీడియో వైరల్‌గా మారింది.

టాయ్‌లెట్లలో టీ క్యాన్లు..

టాయ్‌లెట్లలో టీ క్యాన్లు..

ఆ వీడియోను గమనించినట్లయితే.. ఓ టీ అమ్మే వ్యక్తి రైల్లోని ఓ టాయ్‌లెట్ డోర్ కొట్టి చాయ్ అనగానే అందులోంచి మరో వ్యక్తి మూడు చాయ్ క్యాన్లను అతని చేతికి అందించాడు. అందులో ఓ క్యాన్‌ని ఫ్లాట్ ఫాంపై ఉన్న మరో టీ అమ్మే వ్యక్తికి ఇచ్చాడు. మిగితా రెండు టీ క్యాన్లను వారిద్దరూ తీసుకెళ్లారు.

టాయ్‌లెట్ నీళ్లు కలిపారా? లేక..

టాయ్‌లెట్ నీళ్లు కలిపారా? లేక..

అయితే ఆ టీ క్యాన్లలో టాయ్‌లెట్‌లోని నీళ్లు కలిపారా? లేక ఖాళీ క్యాన్లను ఆ టాయ్‌లెట్లోని నీళ్లు నింపి వాటితో టీ తయారు చేస్తున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ప్రశ్నిస్తే.. తడబడుతూ జారుకున్నారు..

ప్రశ్నిస్తే.. తడబడుతూ జారుకున్నారు..

లేదంటే రైలు కంపార్ట్ మెంట్లలో స్థలం లేకపోవడంతో మూడు టీ క్యాన్లు ఈ టాయ్‌లెట్లో పెట్టారా? అని మరికొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కాగా, ఈ తతంగాన్ని వీడియో తీసిన వ్యక్తి.. రైలు టాయ్‌లెట్ నుంచి టీ క్యాన్లు తీసుకెళ్లినవారిని ప్రశ్నించగా.. వారు సమాధానం చెప్పకుండా తడబడుతూ అక్కడ్నుంచి జారుకున్నారు.

తెలుగు రాష్ట్రాల్లోనే..

అయితే, వీడియో తీసిన వ్యక్తి.. తెలుగులోనే మాట్లాడటంతో ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లోనే చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై రైళ్లలో టీ తాగే వారు జాగ్రత్తగా ఉండాలని మరికొందరు నెటిజన్లు సూచించారు. మరికొందరు.. ఈ వ్యవహారంపై రైల్వే శాఖ, సంబంధిత మంత్రి పీయూష్ గోయల్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

English summary
When traveling in train passengers usually opt for tea or coffee that is offered by a vendor. A video which is doing rounds on the internet can make you feel disgusted as it shows these vendors filling tea and coffee urns with water from the lavatory.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X