• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఏపీ సీఎం జగన్‌కు షాక్: బెయిల్ రద్దు పిటిషన్‌పై 22న విచారణ -తొలి విజయమన్న ఎంపీ రఘురామ

|

సొంత పార్టీపై, అధినేత వైఎస్ జగన్ పై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తోన్న నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరో సంచలన విషయాన్ని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ ను సీబీఐ కోర్టు విచారణకు తీసుకున్నట్లు ఎంపీ తెలిపారు. అంతేకాదు, సీబీఐ అధికారులతో వైసీపీ నేతలు కుమ్మక్కై, ఫ్లాట్లు, కార్లను తాయిలాలుగా ఇస్తున్నారని బాంబు పేల్చారు. ఐఏఎస్ అధికారులకు సీఎం జగన్ సర్టిఫికేషన్ పై ప్రధాని మోదీకి తాజాగా మరో లేఖ రాశానన్నారు. ఢిల్లీలోని తన నివాసంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలను చెప్పుకొచ్చారు. ఎంపీ ఏమన్నారో ఆయన మాట్లోనే...

శభాష్ అచ్చెన్న! -17న వైసీపీలో చేరికా? -విజయసాయిరెడ్డి అనూహ్య వ్యాఖ్యలు-జగన్ పెట్టుబడి రహస్యం ఇదేశభాష్ అచ్చెన్న! -17న వైసీపీలో చేరికా? -విజయసాయిరెడ్డి అనూహ్య వ్యాఖ్యలు-జగన్ పెట్టుబడి రహస్యం ఇదే

 జగన్‌పై పోరు.. తొలి విజయం

జగన్‌పై పోరు.. తొలి విజయం

‘‘రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ, చట్టవ్యతిరేక పాలన సాగిస్తోన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై న్యాయపోరాటం ముగిసేదాకా ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టబోనని నేను ఇదివరకే మాటిచ్చాను. ఆదిశగా ఇవాళ తొలి విజయం సాధించాం. ఏపీ సీఎం జగన్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌ను సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించింది..

ఈనెల 22న విచారణ..

ఈనెల 22న విచారణ..

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జగన్‌పై 11 చార్జ్‌షీట్లను సీబీఐ నమోదు చేయగా, ముఖ్యమంత్రి పదవిని అడ్డంపెట్టుకుని ఆయన విచారణ నుంచి మినహాయింపు పొందారు. అంతటితో ఆగకుండా, తన బలంతో కేసును తీవ్రంగా ప్రభావితం చేయడానికి ఆయన ప్రయత్నించారు. సహనిందితులు పదవులు, సహనిందితులైన అధికారులకు అడ్డదారుల్లో ప్రమోషన్లు, ఏకంగా సీబీఐ అధికారులతోనే మతనాలు, లోపాయికారీ వ్యవహారాలు సాగిస్తూ నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా బెయిల్ రద్దు చేయాలని నేను పిటిషన్ వేశాను. సీబీఐ కోర్టులో జగన్ బెయిల్ రద్దు పిటిషన్ ఈనెల 22న విచారణకు వచ్చే అవకాశం ఉంది. పూర్తి స్థాయి విచారణకు అనుమతి లభిస్తే గనుక నేను చేసిన అభ్యంతరాలపై అన్ని ఆధారాలను కోర్టుకు సమర్పిస్తాను..

 సీబీఐ అధికారులకు గిఫ్టులు..

సీబీఐ అధికారులకు గిఫ్టులు..

జగన్ బెయిల్ రద్దు పిటిషన్ సందర్భంగా సీబీఐ కోర్టులో చాలా గమ్మత్తు విషయాలు జరిగాయి. సీబీఐ తరఫు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన ఏజెన్సీ వైపు కాకుండా జగన్ ను సమర్థించేలా వాదించడం ఆశ్చర్యం. దీనిపై నేను సీబీఐ కోర్టుకు మరో ఫిర్యాదు చేశారు. జగన్ కాన్ఫరెన్స్ ద్వారా, విజయసాయిరెడ్డి లాంటి నేతలు నేరుగా కొందరు సీబీఐ అధికారుల్ని కలిసి తాయిలాలు అందించినట్లు తెలుస్తోంది. ఫ్లాట్లు, కార్లు గిఫ్టులుగా ఇచ్చారని నాకు తెలిసింది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులోనై ఇలాంటి వ్యవహారాలే సాగుతున్నట్లు సమాచారం ఉంది. అయితే నేను ఏ ఒక్కరినీ వదిలిపెట్టదల్చుకోలేదు. అటు కోర్టుల్లో పోరాడుతూనే జగన్ అక్రమాలపై ప్రధాని నరేంద్ర మోదీకి కూడా..

దేశంలో తొలి సీఎం జగన్..

దేశంలో తొలి సీఎం జగన్..

జగన్ బెయిల్ రద్దుకు సంబంధించి ముఖ్యమైన ఆధారాల్లో ఒకటి.. ఐఏఎస్ అధికారుల ఏసిర్ రిపోర్టు వ్యవహారం. సాధారణంగా అన్ని రాష్ట్రాల్లో సీఎస్ లు ఆ పనిని చేస్తారు. కానీ ఏపీలో మాత్రం స్వయంగా ముఖ్యమంత్రి జగన్.. ఐఏఎస్ అధికారుల ఏసిర్ రిపోర్టు రాస్తానని చెప్పడం, వారిని చెప్పుచేతల్లో పెట్టుకునేందుకే. అధికారులను తన అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి తన కేసులో వారి సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం కూడా ఉంది. ఒక ముఖ్యమంత్రి ఇలా చేయడం దేశంలో తొలిసారి. ఈ అంశంపై ప్రధాని మోదీకి లేఖ రాశాను. త్వరలోనే దీనిపై స్పందన వస్తుందని ఆశిస్తున్నా. అదీగాక..

 కుక్క అని తిట్టించారు.. తిరుపతిలో సీన్ ఇది..

కుక్క అని తిట్టించారు.. తిరుపతిలో సీన్ ఇది..

రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలేవీ ఆంధ్ర రాష్ట్రంలో అమలు కావడంలేదన్నది వాస్తవం. ప్రధానంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని దారుణంగా వాడుతున్నారు. ముఖ్యమంత్రి జగ్మోహన్ రెడ్డి ఒక వ్యక్తితో నాపై కుక్క అని దూషణలు చేయించారు. నాకు సంస్కారం ఉంది కాబట్టి అవేమాటలు ముఖ్యమంత్రిని అనడంలేదు. జగన్మోహన్ రెడ్డి.. మీ తొత్తులతో తిట్టిస్తే వారి మీదకు వెళ్ళను, మీ మీదకే వస్తా. ఇంతా చేసి తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో వైసీపీకి 50 వేల మెజారిటీ కూడా వచ్చే పరిస్థితి లేదు. చెప్పిన మెజార్టీ రాకపోతే గెలిచినా ఓడినట్లే. నెలలో మూడో వారంలోకి వచ్చినా, ఉద్యోగులకు ఇంకా జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉంది. ప్రజాధనాన్ని ప్రైవేటు సైన్యాలకు పంచుతూ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఈ అక్రమాలపై పోరాటం ఆపబోను'' అని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు.

ఎంపీ రఘురామకు జగన్ మరో షాక్ -ప్రధాని అయ్యే అవకాశమింతే -అంబేద్కర్ సనాతన హిందువేనంటూఎంపీ రఘురామకు జగన్ మరో షాక్ -ప్రధాని అయ్యే అవకాశమింతే -అంబేద్కర్ సనాతన హిందువేనంటూ

English summary
narsapuram ysrcp mp raghurama krishnam raju said that the CBI court has accepted to hear the petition of AP CM Jagan bail cancelation. speaking to media on thursday, the rebel mp said his petition would come to hearing on april 22nd. Raghuram slams cm jagan and allegges cbi, ysrcp connections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X