• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జగన్ బెయిల్ రద్దు: సీఎం, సీబీఐకి భారీ షాక్ -ఎంపీ రఘురామ పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు -నోటీసులు

|

సొంత పార్టీలో తిరుగుబాటు నేతగా ఉంటూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను మళ్లీ జైలుకు పంపేదాకా ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టబోనని శపథం చేసిన నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆల్మోస్ట్ అన్నంత పని చేశారు. ఆర్థిక నేరాలు, అక్రమాస్తులకు సంబంధించిన 11 చార్జిషీట్లలో ఏ1గా ఉన్న జగన్.. ముఖ్యమంత్రి పదవిని అడ్డంపెట్టుకుని కేసులను నీరుగారుస్తూ, సీబీఐ అధికారులు, సాక్ష్యులను ప్రలోభాలకు గురిచేస్తూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న కారణంగా బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ దాఖలు చేసిన పిటిషన్ ను హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించింది.

జగన్.. ఒళ్లు జాగ్రత్త, జస్టిస్ రమణ వచ్చారు -బెయిల్ రద్దు భయంతో రాయబారాలు ఎంపీ రఘురామ తాజా బాంబుజగన్.. ఒళ్లు జాగ్రత్త, జస్టిస్ రమణ వచ్చారు -బెయిల్ రద్దు భయంతో రాయబారాలు ఎంపీ రఘురామ తాజా బాంబు

జగన్ బెయిల్ రద్దులో ట్విస్ట్

జగన్ బెయిల్ రద్దులో ట్విస్ట్

వైసీపీ అధినేత, ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్ బెయిల్ రద్దుకు సంబంధించి గడిచిన ఆరు నెలలుగా తీవ్ర చర్చ జరుగుతుండటం, తిరుపతి ఉప ఎన్నిక సందర్భంలో కేంద్రంలోని అధికార బీజేపీ పెద్దలు సైతం జగన్ మళ్లీ జైలుకెళ్లడం ఖాయమని చెప్పడం తెలిసిందే. బీజేపీ, ఇతర పార్టీల నేతలు మాటలకే పరిమితమైతే, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మాత్రం నేరుగా సీబీఐని తప్పు పడుతూ, జగన్-సీబీఐ అధికారుల మధ్య లోపాయికారి ఒప్పందాలు, తాయిలాల వ్యవహారం చోటుచేసుకుందని ఆరోపిస్తూ ఏకంగా సీబీఐ కోర్టులోనే పిటిషన్ వేశారు. తొలుత సాంకేతిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ, మంగళవారం నాటి వాదనల తర్వాత జగన్ బెయిల్ రద్దుపై పిటిషన్ ను విచారణకు స్వీకరిస్తున్నట్లు జడ్జి ప్రకటించారు.

జస్టిస్ రమణకే షాకిచ్చారు -వారిపై పోలీసులకు సీజేఐ ఫిర్యాదు -సుప్రీంకోర్టు పరిశీలనలో కీలక అంశాలు<br />జస్టిస్ రమణకే షాకిచ్చారు -వారిపై పోలీసులకు సీజేఐ ఫిర్యాదు -సుప్రీంకోర్టు పరిశీలనలో కీలక అంశాలు

సీఎం, సీబీఐకి నోటీసులు..

సీఎం, సీబీఐకి నోటీసులు..

బెయిల్ రద్దు పిటిషన్ ను సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించిన దరిమిలా ఈ వ్యవహారానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డితోపాటు ఆయనపై కేసులను దర్యాప్తు చేస్తోన్న సీబీఐకి సైతం నోటీసులు జారీ కానున్నాయి. జగన్‌ సాక్షులను ప్రభావితం చేయడమే కాకుండా, సీబీఐలోని పలువురు అధికారులతో రహస్య సంభాషణలు జరపడం, కొందరు అధికారులకు ఖరీదైన గిఫ్టులు, ఫ్లాట్లు ఇచ్చి లోబర్చుకున్నారని, కోర్టు కోరితే సంబంధిత ఆధారాలు కూడా ఇవ్వగలనని ఎంపీ రఘురామ పిటిషన్‌లో పేర్కొన్నారు. జగన్ బెయిల్‌ రద్దు చేసి వేగంగా విచారణ చేపట్టాలని కోరారు. దీనిపై..

జగన్ జైలుకెళ్లేదాకా పోరాడుతా..

జగన్ జైలుకెళ్లేదాకా పోరాడుతా..

ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ ను సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించిన తర్వాత ఈ అంశంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ ఓ వీడియో విడుదల చేశారు. ‘‘అందరికీ శుభవార్త. జగన్ బెయిల్ రద్దు పిటిషన్ ను సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించింది. సీఎంతోపాటు సీబీఐకీ నోటీసులు జారీ అవుతాయి. గతంలో కోర్టు టెక్నికల్ క్లారిఫికేషన్లు అడితే, పిటిషన్ మడిచిపెట్టుకోమని వైసీపీవాళ్లు నన్ను ఎద్దేవా చేశారు. ఇప్పుడు అందరికీ సరదా తీరుతుంది. రాజ్యాంగ పదవిలో ఉన్నవాళ్లు కోర్టులను గౌరవించాలన్న ఒకే ఒక్క కాన్సెప్ట్ తో నేనీ పోరాటం చేస్తున్నాను. యావత్ ఆంధ్రప్రదేశ్ నా పనిని సమర్థిస్తున్నది. బలంగా వినిపించిన మా లాయర్లకు ధన్యవాదాలు. జగన్ వెనకున్న కొందరు దిక్కుమాలిన వెధవలు చేస్తోన్నకామెంట్లు, వ్యవహరిస్తోన్న తీరు వల్ల సీఎంకు ఇబ్బందులు తప్పవు'' అని ఎంపీ రఘురామ అన్నారు.

English summary
the cbi court in hyderabad has accepted to hear a petition filed by ysrcp mp raghurama krishnam raju to cancel bail of andhra pradesh cm ys jagan mohan reddy. speaking to media on tuesday, the rebel mp said cm jagan and cbi will get notices regarding this issue. raghurama once again slams jagan and ysrcp.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X