వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రి బొత్సాకు సీబీఐ కోర్టు నోటీసులు : వెంటాడుతున్న వోక్స్ వ్యాగన్‌ : 12న హాజరు కావాలంటూ..!!!

|
Google Oneindia TeluguNews

Recommended Video

మంత్రి బొత్సాకు CBI కోర్టు నోటీసులు || CBI Court Issued Summons To AP Minister Botsa Satyanarayana

ఏపీ మంత్రి బొత్సా సత్యనారాయణను వోక్స్ వ్యాగన్ కేసు వెంటాడుతూనే ఉంది. నాడు వైయస్సార్ కేబినెట్లో బొత్సా పరిశ్రమల శాఖా మంత్రిగా ఉన్న సమయంలో ఆ వివాదం వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు జగన్ కేబినెట్ లో మంత్రిగా ఉన్న సమయంలో నోటీసులు జారీ అయ్యాయి. వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ కేసుకు సంబంధించి అప్పట్లోనే వైయస్ సీబీఐ విచారణకు ఆదేశించారు. అందులో బొత్సాకు క్లీన్ చిట్ ఇచ్చారు. అయినా..నాటి నుండి టీడీపీ రాజకీయంగా బొత్సా అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఇక, ఇప్పుడు సీబీఐ కోర్టు వచ్చే నెల 12న హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. సాక్షిగా బొత్సా కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇది కూడా రాజకీయంగా విమర్శలకు కారణమయ్యే అవకాశం ఉంది.

బొత్సాకు సీబీఐ కోర్టు నోటీసులు..

బొత్సాకు సీబీఐ కోర్టు నోటీసులు..

ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణకు హైదరాబాద్ సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఫోక్స్ వ్యాగన్ కేసులో ఏపీ మంత్రి బొత్సకు నోటీసులు పంపారు. వచ్చే నెల 12న సీబీఐ కోర్టుకు హాజరుకావాలని సీబీఐ కోర్టు ఆదేశించింది. 2004లో ఎన్నికలకు ముందు చంద్రబాబు హాయంలో ఈ సంస్థ ఏపీలో ఏర్పాటుకు సంబంధించి ఒప్పందం జరిగింది. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో వైయస్సార్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన కేబినెట్ లో బొత్సా సత్యనారాయణ పరిశ్రమల శాఖా మంత్రిగా వ్యవహరించేవారు. విశాఖలో ఈ కార్ల ఫ్యాక్టరీ స్థాపన కోసం వోక్స్ వ్యాగన్‌కు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న వశిష్ట వాహన్‌కు రాష్ట్ర ప్రభుత్వం 11 కోట్ల రూపాయలు చెల్లించింది. అయితే, వశిష్ట వాహన్ సీఈవో సూష్టర్‌తో తమకు ఏ విధమైన సంబంధం లేదని వోక్స్ వ్యాగన్ ప్రకటించింది. దీంతో వోక్స్ వ్యాగన్ వ్యవహారంలో కుంభకోణం వెలుగు చూసింది. అప్పుడు మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. దీంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేసును సీబీఐకి అప్పగించారు. ఆ తర్వాత ఈ కేసులో బొత్సపై ఎలాంటి అభియోగాలు మోపకుండా సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది. అయినా ప్రతిపక్షాలు మాత్రం ఈ వ్యవహారాన్ని వదిలి పెట్టలేదు. ఇప్పటికీ దాని పైనే ఆరోపణలు చేస్తూనే ఉన్నారు.

సాక్షిగా కోర్టుకు రావాలంటూ..

సాక్షిగా కోర్టుకు రావాలంటూ..

సీబీఐ కోర్టు మంత్రి బొత్సా సత్యనారాయణకు కోర్టుకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసింది. అయితే, అప్పుడు జరిగిన వ్యవహారంలో సైతం ఆయన ఏపీ మంత్రిగా ఉన్నారు. పరిశ్రమల శాఖా మంత్రిగా
వశిష్ట వాహన్‌ తో ఒప్పందం చేసుకున్నారు. ఆ తరువాత వారి వ్యవహారం వెలుగులోకి రావటంతో బొత్సా సైతం ఆరోపణలు ఎదుర్కొన్నారు. బొత్సా అవినీతి కారణంగానే కార్ల పరిశ్రమ ఏపీకి రాకుండా వెనక్కు వెళ్లి పోయిందని టీడీపీ ఆరోపించింది. అప్పటి నుండి సీబీఐ ప్రత్యేక కోర్టులో ఈ వ్యవహారం నడుస్తూనే ఉంది. తాజాగా ఈ కేసులో చెప్పుకోదగ్గ స్థాయిలో పరిణామాలు చోటు చేసుకోలేదు. ఛార్జ్ షీట్ సైతం దాఖలు కావటంతో..ఇక విచారణకు కోర్టు నిర్ణయించింది. అందులో భాగంగానే నాటి మంత్రిగా ఉన్న బొత్సా సత్యనారాయణకు కోర్టుకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ అయ్యాయి. అయితే, నాడు ఈ వ్యవహారం జరిగిన సమయంలో వైయస్సార్ కేబినెట్లో మంత్రిగా..ఇప్పుడు సాక్షిగా నోటీసులు అందుకుంటున్న సమయంలో ఆయన తనయుడు కేబినెట్ లో బొత్సా మంత్రిగా ఉన్నారు. ఈ నోటీసుల వ్యవహారం పైన మంత్రి బొత్సా స్పందన తెలియాల్సి ఉంది.

బొత్సా ప్రమేయం లేదంటూ..

బొత్సా ప్రమేయం లేదంటూ..

ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చిన వెంటనే నాటి రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ కు విచారణ అప్పగించింది. అందులో మంత్రిగా బొత్సాకు క్లీన్ చిట్ వచ్చింది. ఆ తరువాత కూడా ఆయన మంత్రిగా కొనసాగారు. 2009లో తిరిగి వైయస్సార్ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా తిరిగి మంత్రి పదవి దక్కించుకున్నారు. వైయస్ మరణం తరువాత రోశయ్య..కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లోనూ కీలక శాఖలు నిర్వహించారు. అయితే, తిరిగి ఇప్పుడు సీబీఐ కోర్టు పాత కేసులో నోటీసులు జారీ చేయటంతో టీడీపీ నేతలు తిరిగి బొత్సా మీద విమర్శలు ఎక్కు పెట్టే అవకాశం కనిపిస్తోంది.

English summary
CBI court issued summons to AP Minister Botsa Satyanarayana for attend court on 12th of septemeber. In 2005 Botsa involved in Volkes wagon case and CBI given clean chit for him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X