సీఎం జగన్ కేసులు మళ్లీ మొదటికి..!! తాజా నిర్ణయంతో - డిశ్చార్జి పిటిషన్ల దశలోనే..!!
ఏపీ సీఎం జగన్ పై సీబీఐ కోర్లులొ ఉ్న కేసుల విచారణ మళ్లీ మొదటికి వస్తోందా. న్యాయ నిపుణులు అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ హైకోర్టు 55 మంది జిల్లా, సెషన్స్ జడ్జిలను బదిలీ చేస్తూ హైకోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో సీబీఐ కేసుల ప్రత్యేక కోర్టు పిన్సిపల్ స్పెషల్ జడ్జి బి.ఆర్. మధుసూదన్‌రావు ఉన్నారు. కామారెడ్డి 9వ అదనపు జిల్లా జడ్జీగా ఉన్న సీహెచ్ రమేష్ బాబు సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తిగా నియామకమయ్యారు. అయితే, మూడేళ్లకు పైనా సీబీఐ కోర్టు జడ్జిగా మధుసూధనరావు సీఎం జగన్ కేసుల విచారణ కొనసాగిస్తున్నారు.
జగన్ కేసులు అన్నీ ప్రస్తుతం డిశ్చార్జ్ పిటీషన్ల దశలోనే ఉణ్నాయి. ఇప్పటికే పలువురు నిందితుల డిశ్చార్జి పిటిషన్లపై వాదనలు ముగిశాయి. సీబీఐ తన వాదనలను వినిపించాల్సి ఉంది. ఇక, ఇప్పుడు న్యాయమూర్తి బదిలీతో సీఎం జగన్ కేసులను మళ్లీ మొదటి నుంచి వినాల్సిన పరిస్థితి వచ్చేలా కనిపిస్తోంది. న్యాయ నిపుణులు సైతం ఇదే విషయాన్ని చెబుతున్నారు. గతంలోనూ జడ్జీలు బదిలీ అయిన సందర్బాల్లో ఇదే రకంగా డిశ్చార్జి పిటిషన్ల విచారణ ప్రక్రియ మొదటికొస్తోంది. డిశ్చార్జి పిటిషన్లపై మళ్లీ మొదటికొస్తే జగన్ కేసు విచారణ ప్రక్రియ ఆలస్యం కానుంది.

ప్రజా ప్రతినిధుల కేసుల విచారణ సత్వరం పూర్తి చేయాలనే ఉత్తర్వుల నేపథ్యంలో సీబీఐ కోర్టులో రోజువారీ విచారణ ప్రారంభమైంది. ప్రస్తుతం కోర్టులో 11 కేసుల్లో పలువురు నిందితుల డిశ్చార్జ్ పిటీషన్ల పైన వాదనలు కొనసాగుతున్నాయి. ఒక్క దానిలోనూ వాదనలు పూర్తి కాలేదు. 2012లో నమోదైన కేసులు డిశ్చార్జి పిటీషన్ లు ..అభియోగాల నమోదు ప్రక్రియలోనే ఉన్నాయి. ప్రస్తుత సీబీఐ కోర్టు న్యాయమూర్తి మధుసూధన్ రావు జగన్ కేసుల పైన ప్రతీ శుక్రవారం విచారణ చేపట్టారు.
ఈ దశలో న్యాయమూర్తి బదిలీ కావటంతో విచారణ పైన ప్రభావం చూపుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సీఎం జగన్ కేసులతో పాటుగా.. ఓబుళాపురం గనులు.. ఎమ్మార్ వివాదం పై సీబీఐతో పాటుగా ఈడీ నమోదు చేసిన వాటి పైనా విచారణ మొదటికి వస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీంతో..ఇప్పుడు ఈ వ్యవహారం రాజకీయంగానూ చర్చకు కారణమైంది.