వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం జగన్ కు బిగ్ షాక్ :హాజరు మినహాయింపు తిరస్కరించిన కోర్టు: కొత్త చిక్కుల్లో ముఖ్యమంత్రి..!

|
Google Oneindia TeluguNews

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు బిగ్ షాక్ తగిలింది. అక్రమాస్తుల కేసులో సీబీఐ కోర్టులో విచారణ ఎదుర్కొంటున్న జగన్...వ్యక్తిగతంగా తాను హాజరు కాకుండా మినహాయింపు ఇవ్వాలని కోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. ముఖ్యమంత్రిగా అధికారిక విధులు నిర్వహించాల్సి ఉన్న నేపథ్యంలో.. వారం వారం కోర్టు విచారణకు తాను వ్యక్తిగతంగా రాలేనని.. తనకు బదులుగా తన న్యాయవాది హాజరయ్యేందుకు అనుమతించాలంటూ జగన్‌ తన పిటిషన్‌లో కోరారు.

అయితే, దీనికి సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. జగన్‌పై తీవ్ర ఆర్థిక నేరాలకు సంబంధించిన అభియోగాలు ఉన్నాయని.. ఎంపీగా ఉన్నప్పుడే సాక్షులను ప్రభావితం చేశారనే అరెస్టు చేశామని, ఇప్పుడు సీఎం హోదాలో సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని.. అందుకే హాజరు మినహాయింపు ఇవ్వరాదని సీబీఐ స్పెషల్‌ పీపీ వాదనలు వినిపించారు.

<strong>జగన్ అక్రమాస్తుల్లో ఉన్న ఐఏయస్ పై మరో కేసు: హైకోర్టు ఆదేశాల మేరకు: చిక్కుల్లో ఆ ముగ్గురు..!</strong>జగన్ అక్రమాస్తుల్లో ఉన్న ఐఏయస్ పై మరో కేసు: హైకోర్టు ఆదేశాల మేరకు: చిక్కుల్లో ఆ ముగ్గురు..!

దీని పైన విచారణ నిర్వహించిన సీబీఐ కోర్టు జగన్ అభ్యర్ధనను తిరస్కరించింది. వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు సాధ్యం కాదని తేల్చింది. అయితే, ఇదే ఇప్పుడు జగన్ కు మరిన్ని సమస్యలు తెచ్చి పెట్టే అవకాశం కనిపిస్తోంది. ఇక, ఇప్పుడు జగన్ హైకోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

జగన్ కు షాక్ ఇచ్చిన కోర్టు..

జగన్ కు షాక్ ఇచ్చిన కోర్టు..

కోర్టు హాజరు మినహాయింపు విషయంలో ఏపీ సీఎం జగన్ అభ్యర్ధనను కోర్టు తిరస్కరించింది. ప్రతీ వారం కోర్టుకు హాజరు కావటానికి తనకున్న ఇబ్బందులను వివరిస్తూ కోర్టులో జగన్ పిటీషన్ దాఖలు చేసారు. దీని పైన విచారణ నిర్వహించిన కోర్టు సీబీఐ వాదనలు సైతం విన్నది. ముఖ్యమంత్రిగా అధికారిక విధులు నిర్వహించాల్సి ఉన్న నేపథ్యంలో.. వారం వారం కోర్టు విచారణకు తాను వ్యక్తిగతంగా రాలేనని.. తనకు బదులుగా తన న్యాయవాది హాజరయ్యేందుకు అనుమతించాలంటూ జగన్‌ తన పిటిషన్‌లో కోరారు.

రూ.60 లక్షలు ఖర్చవుతుందని

రూ.60 లక్షలు ఖర్చవుతుందని

సీఎం హోదాలో ఒక్కరోజు ప్రత్యేక కోర్టుకు హాజరయ్యేందుకు హైదరాబాద్‌కు వస్తే సెక్యూరిటీ, ప్రొటోకాల్‌ తదితర వాటికి రూ.60 లక్షలు ఖర్చవుతుందని.. ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేని, దీనివల్ల మరింత భారమని ఆయన తరఫు న్యాయవాది తెలిపారు. కోర్టుకు హాజరయ్యేందుకు జగన్‌కు వ్యక్తిగతంగా ఇబ్బంది లేదని, సీఎంగా విధులు నిర్వహించాల్సి ఉందని, ప్రజాప్రయోజనాల రీత్యానే హాజరు మినహాయింపు కోరుతున్నామని నివేదించారు. దీని పైన సీబీఐ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. సీబీఐ వాదనతో ఏకీభవించిన కోర్టు జగన్ అభ్యర్ధనను తోసి పుచ్చింది.

మినహహాయింపును అడ్డుకున్న సీబీఐ

మినహహాయింపును అడ్డుకున్న సీబీఐ

ముఖ్యమంత్రి జగన్ తనకు వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు కోరుతూ దాఖలు చేసిన పిటీషన్ పైన విచారణ సమయంలో సీబీఐ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. సీబీఐ తరపు న్యాయవాది తాము ఎందుకు జగన్ పిటీషన్ ను వ్యతిరేకిస్తుందీ తన వాదనల్లో వివరించారు. అయితే జగన్‌పై తీవ్ర ఆర్థిక నేరాలకు సంబంధించిన అభియోగాలు ఉన్నాయని.. ఎంపీగా ఉన్నప్పుడే సాక్షులను ప్రభావితం చేశారనే అరెస్టు చేశామని, ఇప్పుడు సీఎం హోదాలో సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని.. అందుకే హాజరు మినహాయింపు ఇవ్వరాదని సీబీఐ స్పెషల్‌ పీపీ వాదనలు వినిపించారు.

సీబీఐ కోర్టు కొట్టివేసిందని

సీబీఐ కోర్టు కొట్టివేసిందని

అదీగాక.. హాజరు మినహాయింపు కోరుతూ జగన్‌ గతంలో దాఖలు చేసుకున్న పిటిషన్లను రెండు పర్యాయాలు సీబీఐ కోర్టు కొట్టివేసిందని, దీన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టును ఆశ్రయించగా.. సీబీఐ కోర్టు తీర్పును సమర్థిస్తూ జగన్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసిందని తెలిపారు. హోదాను కారణంగా చూపించి వ్యక్తిగత హాజరుకు మినహాయింపు కోరరాదని హైకోర్టు తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసిందన్నారు. గతంలో జగన్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించాలని, ఆయన పిటిషన్‌ను కొట్టివేయాలని కోరారు. ఈ వాదనతో కోర్టు ఏకీభవించింది.

రాజకీయంగానూ జగన్ కు చిక్కులే..

రాజకీయంగానూ జగన్ కు చిక్కులే..

ఇప్పటి వరకు జగన్ కేసుల పైనా..ప్రతీ వారం కోర్టుకు హాజరు పైన ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తూనే ఉన్నాయి. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలోనూ..అదే విధంగా ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా ఇదే రకమైన విమర్శలు కొనసాగిస్తున్నారు. జగన్ తనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరిన అంశం మీద రాజకీయంగా విమర్శలు కొనసాగించారు. ఇక, ఇప్పుడు కోర్టు జగన్ అభ్యర్ధనను తిరస్కరిస్తూ తీర్పు ఇవ్వటంతో ఇది రాజకీయంగానూ ముఖ్యమంత్రికి ఇబ్బందిగా మారనుంది.

శుక్రవారం కోర్టుకు

శుక్రవారం కోర్టుకు

కోర్టులో విచారణ సాగుతూనే ఉన్నా..అవసరమైన సమయంలో వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది. గతంలో ప్రతీ శుక్రవారం కోర్టుకు హాజరైన జగన్..ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా అదే విధంగా కోర్టుకు వెళ్లాల్సి వస్తే ఇబ్బందులు ఎదురవతాయని వైసీపీ నేతలు ఆందోళనతో ఉన్నారు. అయితే, ఇప్పుడు కోర్టు ఇచ్చిన తీర్పుతో వైసీపీ నేతల్లో కొత్త టెన్షన్ మొదలైంది. ఇక, దీని మీద రాజకీయంగా ఎటువంటి స్పందనలు వస్తాయనేది వేచి చూడాలి.

English summary
CBI court rejected CM Jagan absence petition. Jagan filed petition to permit his absence from appearance before court every friday. Cbi objected on jagan petition. After arguments court given orders in favour of CBI.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X