వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విజయవాడ కేసులో సిబిఐ కస్టడీకి భాను కిరణ్

By Pratap
|
Google Oneindia TeluguNews

CBI custody to Bhanu Kiran
విజయవాడ: హైదరాబాద్‌లోని చర్లపల్లి జైలులో ఉన్న భాను కిరణ్‌ను రెండురోజుల పాటు సిఐడి కస్టడీకి అనుమతిస్తూ విజయవాడ కోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎనికేపాడులోని శ్రీ సాయి అన్నపూర్ణ ప్యాకేజీ ఇండస్ట్రీస్‌కు సంబంధించిన కేసులో కోర్టు అతన్ని సిబిఐ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి శ్యాంప్రసాద్, అతని సోదరుడు రామకృష్ణప్రసాద్ మధ్య నెలకొన్న ఆస్తుల వివాదం కేసులో జోక్యం చేసుకుని బెదిరింపులు, కంపెనీలోకి అక్రమ ప్రవేశం, ఫోర్జరీ సంతకాలు వంటి నేరాలకు పాల్పడినట్లు శ్యాంప్రసాద్ ఫిర్యాదు మేరకు 2010లో పటమట పోలీసులు భానుపై కేసు నమోదు చేశారు.

సిఐడి గత నెల 23న భానుకిరణ్‌ను చర్లపల్లి జైలు నుంచి పీటీ వారెంట్‌పై అరెస్టు చేసి విజయవాడ మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చింది. భాను కిరణ్‌ను తమ కస్టడీకి విచారణ కోసం ఆరు రోజులు అప్పగించాలని కోరుతూ సిఐడి దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు ముగిసిన అనంతరం సోమవారం న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు.

భాను కిరణ్ మద్దెలచెర్వు సూరి అలియాస్ మద్దెలచెర్వు సూర్యనారాయణ రెడ్డి హత్య కేసులో నిందితుడు. మద్దెలచెర్వు సూరి హత్య అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది.

English summary
Bhanu Kiran has been ordered for two days CBI custody by Court. Bhanu Kiran is accused in Maddelachervu Suri murder case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X