వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసీపీకి షాక్: ఎమ్మెల్యే సురేష్, ఆయన భార్య విజయలక్ష్మిపై సిబిఐ కేసు

By Narsimha
|
Google Oneindia TeluguNews

ఒంగోలు: వైసీపీకి ఎమ్మెల్యే ఆదిమూలం సురేష్‌, ఆయన సతీమణి విజయలక్ష్మిపై సిబిఐ గురువారం నాడు కేసు నమోదు చేసింది.ఆదాయానికి మించి ఆస్తులు కల్గి ఉన్నారంటూ వారిపై సీబీఐ కేసు నమోదు చేసింది.

ఆదాయానికి మించి రూ.కోటికి పైగా ఆస్తులు కల్గి ఉన్నారని వైసీపీ ఎమ్మెల్యే సురేష్, ఆయన సతీమణి విజయలక్ష్మిపై సిబిఐ కేసును నమోదు చేయడం సంచలనంగా మారింది. విజయలక్ష్మీ ఐఆర్‌ఎస్‌ అధికారిణిగా పనిచేస్తున్నారు. సురేశ్‌ ప్రకాశం జిల్లా సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైకాపా తరఫున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

CBI DA case against YSR Congress MLA and wife

ఈ కేసుతో వైసీపీ ఎమ్మెల్యే సురేష్ చిక్కుల్లో పడ్డారు. ఈ కేసులో ఏ-1గా విజయలక్ష్మి, ఏ-2గా సురేష్ కేసు నమోదు చేసింది. ఆదాయానికి మించి రూ. కోటి ఉన్నట్లు గుర్తించింది. ఆదాయానికి మించిన ఆస్తులను సీబీఐ స్వాధీనం చేసుకుంది.

ఈ మేరకు గురువారం సీబీఐ ప్రకటన విడుదల చేసింది. 2010 ఏప్రిల్ 1వ తేదీ నుంచి, 2016 ఫ్రిబ్రవరి 29వ తేదీ వరకు వీరిద్దరు అక్రమ ఆస్తులు కలిగివున్నారని సీబీఐ పేర్కొంది. 1994 బ్యాచ్‌కు చెందిన విజయలక్ష్మి ఇండియన్ రైల్వే సర్వీస్‌లో చేరారు. ఆమె ఇన్‌కమ్ టాక్స్ అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేశారు.

English summary
The Central Bureau of Investigation has registered a disproportionate assets case against a YSR Congress MLA from Andhra Pradesh - Dr Audimulapu Suresh and his wife - T H Vijaya Lakshmi, a 1994 batch IRS officer, for allegedly amassing illegal wealth worth more than Rs one crore between 2010 and 2016.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X