విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డాక్టర్ సుధాకర్ కేసులో సీబీఐ తొలి వేటు: స్లో పాయిజన్: డాక్టర్‌పై: వైసీపీ సానుభూతిపరుడిగా

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ కేసులు సీబీఐ కార్యాచరణలోకి దిగింది. రెండురోజుల కిందటే విశాఖపట్నానికి చేరుకున్న సీబీఐ అధికారులు డాక్టర్ సుధాకర్‌కు అందుతోన్న వైద్య సేవలపై తొలుత దృష్టి సారించారు. వైద్యం పేరుతో తన కుమారుడికి స్లో పాయిజన్ ఎక్కిస్తున్నారంటూ డాక్టర్ సుధాకర్ తల్లి కావేరీ సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఆ కోణంలో దర్యాప్తు చేపట్టారు. తనకు అందుతోన్న వైద్యంపై డాక్టర్ సుధాకర్ కూడా అసంతృప్తిని వ్యక్తం చేస్తూ హైకోర్టుకు లేఖ రాసిన రెండురోజుల్లోనే డాక్టర్‌పై వేటు పడింది.

Recommended Video

Narsipatnam Dr Sudhakar Case : CBI's First Move
 వైసీపీ సానుభూతిపరుడిగా..

వైసీపీ సానుభూతిపరుడిగా..


డాక్టర్ సుధాకర్‌కు ఇప్పటిదాకా వైద్యాన్ని అందించిన డాక్టర్ రామిరెడ్డిపై వేటు వేశారు. ఆయన స్థానంలో డాక్టర్ మాధవీలతకు బాధ్యతలను అప్పగించారు. నర్సీపట్నం డాక్టర్ ప్రస్తుతం విశాఖపట్నంలోని ప్రభుత్వ మానసిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. డాక్టర్ రామిరెడ్డి ఆయనకు వైద్యం చేస్తున్నారు. డాక్టర్ రామిరెడ్డిపై సుధాకర్ తల్లి ఆరోపణలు చేశారు. రామిరెడ్డి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడని, తన కుమారుడికి స్లో పాయిజన్ ఎక్కిస్తున్నారంటూ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకున్న సీబీఐ అధికారులు డాక్టర్ రామిరెడ్డిని తప్పించారు.

 నాణ్యమైన వైద్యం అందట్లేదంటూ

నాణ్యమైన వైద్యం అందట్లేదంటూ


తనకు నాణ్యమైన వైద్య సేవలను అందజేయట్లేదంటూ నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ ఇటీవలే హైకోర్టుకు లేఖ రాశారు. సైతం దాఖలు చేశారు. తనకు సరైన వైద్యం అందించట్లేదని, పొంతన లేని మెడిసిన్‌‌ను ఇస్తున్నారంటూ డాక్టర్ సుధాకర్ ఆరోపించారు. తన ఆరోగ్యం మరింత దిగజారేలా ట్రీట్‌మెంట్ చేస్తున్నారని ఆయన ఈ లేఖలో పేర్కొన్నారు. డాక్టర్ తన పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారని, తనను ఇబ్బంది పెడుతున్నారంటూ ఫిర్యాదు చేశారు.

అదే సమయంలో డాక్టర్‌పై వేటు..

అదే సమయంలో డాక్టర్‌పై వేటు..


డాక్టర్ సుధాకర్ హైకోర్టుకు లేఖ రాసిన రెండురోజుల్లోనే సీబీఐ అధికారులు డాక్టర్ రామిరెడ్డిని తప్పించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ విషయంలో వారు మొదట ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాధారాణిని విచారించారు. అనంతరం రామిరెడ్డిని తప్పించి డాక్టర్ మాధవీలతకు సుధాకర్‌కు వైద్యాన్ని అందించే బాధ్యతలను అప్పగించారు. సీబీఐ అధికారులు డాక్టర్ రామిరెడ్డిని కూడా విచారించారు. ఈ సందర్భంగా ఆయన సంతృప్తికరమైన సమాధానాలను ఇవ్వలేదని తెలుస్తోంది. దీనితో ఆయనను తప్పించి మాధవీలతకు ఈ బాధ్యతలను అప్పగించారని అంటున్నారు.

English summary
CBI has issues the order for change the Doctor who treats Narsipatnam Dr Sudhakar in Vizag mental hospital on Sunday. CBI appoints Dr Madhavi Latha instead of Dr Rami Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X