వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం జగన్‌మోహన్ రెడ్డి కోర్టు హజరు మినహాయింపుపై సీబీఐ అభ్యంతరం

|
Google Oneindia TeluguNews

సీబీఐ కోర్టులో అక్రమాస్తుల కేసును ఎదుర్కోంటున్న ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి కోర్టులో వ్యక్తిగత హజరు నుండి మినహాయింపును ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో మినాహయింపుకు అభ్యంతరం తెలుపుతూ సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. తన కౌంటర్ పిటిషన్‌లో పలు అంశాలను పేర్కోంది. సీఎం స్థాయిలో ఉన్న జగన్ సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది.

ఈ నేపథ్యంలోనే జగన్ ఎంపీగా ఉన్న సమయంలో సాక్ష్యాలను తారుమారు చేస్తారనే కారణంతోనే ఆయన్ను అరెస్ట్ చేశామని తెలిపింది. ఇప్పుడు ప్రభుత్వాధినేతగా సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయని పేర్కోంది. ముఖ్యంగా ఆయన సీఎం తనయుడిగా జైల్లో ఉన్నప్పుడే సాక్ష్యులను ప్రభావితం చేశారని తెలిపింది. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న జగన్‌మోహన్ రెడ్డి విజయవాడ నుండి హైదరాబాద్‌కు రావడం పెద్ద కష్టమేమి కాదని పేర్కోన్నారు. ప్రజాప్రయోజనాల దృష్ట్య ఆయన పిటిషన్‌ను తిరస్కరించాలని సీబీఐ న్యాయస్థానాన్ని అభ్యర్థించింది.

cbi objection of jagan personal attendance in court,

కాగా సీఎం అయిన తర్వాత కూడ జగన్‌మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో సీబీఐ కోర్టుకు హజరవుతున్నారు. అయితే పని ఒత్తిడి ఉన్న నేపథ్యంలో కోర్టు హజరు నుండి మినహాయింపును ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే సిబిఐ న్యాయస్థానం ఎలాంటీ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

English summary
Appearing in the CBI court, AP CM Jagan Mohan Reddy has filed a petition seeking exemption from personal attendance in court, but the CBI has filed a counter with objection.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X