వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

14వ రోజు ముగ్గురిపై ప్రశ్నల వర్షం: నల్లబ్యాగుతో విచారణకు హాజరైన వివేక కూతురు సునీత..

|
Google Oneindia TeluguNews

మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. 14వ రోజు ముగ్గురిపై ప్రశ్నల వర్షం కురిపించారు. కడప కేంద్ర కారాగారంలో గల అతిథి గృహం వద్ద వివేకానందారెడ్డి వ్యక్తిగత సహాయకుడు కృష్ణారెడ్డి, పనిమనిషి లక్ష్మీదేవి, కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఇనాయ్‌ తుల్లా విచారణకు హాజరయ్యారు.

వివేకాందరెడ్డి కూతురు సునీత సమక్షంలో ఈ ముగ్గురిని సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. వివేకా హత్య కేసులో సునీతను కూడా పలు విషయాలు అడిగి తెలుసుకుంటున్నారు. గత ఏడాది మార్చి 15న ఉదయం మొదట వివేకా ఇంటికి వ్యక్తిగత సహాయకుడు కృష్ణారెడ్డి వెళ్లారు.

cbi officials questioned pa krishna reddy, others..

తలుపు తీసి చూడగా బాత్‌రూమ్‌లో వివేకా మృతదేహం కనిపించింది. బెడ్‌రూమ్‌లో ఒక లేఖ దొరకగా.. దానిని సాయంత్రం పోలీసులకు అందజేశారు. వివేకా హత్య కేసులో సిట్.. కృష్ణారెడ్డిని అరెస్ట్ చేయగా.. బెయిల్‌పై బయటకొచ్చారు.

Recommended Video

Pawan Kalyan Welcomes New Education Policy 2020 || Oneindia Telugu

వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ స్పీడ్ పెరిగింది. రెండసారి విచారణకు వచ్చిన సునీత బరువైన నల్లబ్యాగుతో కనిపించారు. అందులో ఏముంది.. అధికారులకు ఏమైనా ఆధారాలు అందజేశారా అనే అంశాలు తెలియాల్సి ఉంది.

English summary
cbi officials questioned pa krishna reddy, others in ys vivekananda reddy murder case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X