YS Viveka case:కడపలో సీబీఐ అధికారులకు బెదిరింపులు?
వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసును విచారిస్తున్న సీబీఐ అధికారులను కడపలో కొందరు వ్యక్తులు బెదిరించారు. కడప కేంద్ర కారాగారం నుంచి గెస్ట్‌హౌస్‌కు వస్తున్న సమయంలో వాహనాన్ని అడ్డగించి కడప నుంచి వెళ్లిపోవాలంటూ డ్రైవర్‌తోపాటు కారులో అధికారులను కూడా బెదిరించారంటూ సీబీఐ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సీసీటీవీ ఫుటేజ్‌ల పరిశీలన
కేసు
నమోదు
చేసుకున్న
పోలీసులు
బెదిరింపులకు
పాల్పడిన
వ్యక్తులను
గుర్తించేందుకు
సీసీటీవీ
ఫుటేజ్‌ను
పరిశీలిస్తున్నారు.
వైఎస్
వివేకా
హత్యకేసు
విచారణ
కోసం
కొంతకాలం
నుంచి
సీబీఐ
అధికారులు
కడపలోనే
ఉంటున్న
సంగతి
తెలిసిందే.
గతంలో
కూడా
అధికారులు
ఇటువంటి
అనుభవాలు
ఎదురయ్యాయి.
వీరు
ఉంటున్న
గెస్ట్‌హౌస్
ప్రభుత్వానిది
కావడంతో
ఖాళీచేయాలంటూ
ఆదేశాలు
జారీచేశారు.
మరోసారి
సీబీఐ
అధికారులు
తనను
బెదిరించాంటూ
ఒక
వ్యక్తి
పోలీసులకు
ఫిర్యాదు
చేయగా
వారు
కోర్టు
నుంచి
స్టే
తెచ్చుకోవాల్సి
వచ్చింది.

వివేకా హత్యకేసులో ప్రమేయం ఉన్నవారేనా?
కేంద్ర
ప్రభుత్వానికి
సంబంధించిన
అధికారులనే
బెదిరిస్తున్నారంటే
వారెవరై
ఉంటారనేది
ఎవరికీ
అంతుపట్టకుండా
ఉందని
పోలీసులు
అంటున్నారు.
వివేకానందరెడ్డి
హత్యకేసులో
ప్రమేయం
ఉన్నవారే
ఈ
తరహా
చర్యలకు
పాల్పడవచ్చనే
కోణంలో
కూడా
దర్యాప్తు
చేస్తున్నారు.
తాజాగా
ఈ
అంశం
ఇప్పుడు
కడప,
పులివెందులలో
కలకలం
రేపుతోంది.
గతంలో
వివేకా
కుమార్తె
సునీత
ఇంటివద్ద
రెక్కీ
నిర్వహించిన
అంశం
కూడా
కలకలం
రేకెత్తించిన
సంగతి
తెలిసిందే.

కేసు ముగించే యోచనలో సీబీఐ
వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ నత్తనడకను తలపిస్తోందంటూ ఆరోపణలు రావడంతో అధికారులు వేగం పెంచారు. కొద్దిరోజుల క్రితం కీలక అరెస్ట్‌లు జరుగుతాయనే ప్రచారం నడిచింది. ఆ సమయంలో ఢిల్లీ నుంచి సీబీఐ డీఐజీ కూడా పులివెందులకు వచ్చారు. తర్వాత ఏమైందో ఎవరికీ తెలియదుకానీ అరెస్ట్లేవీ జరగలేదు. సీబీఐ దర్యాప్తు నివేదిక గతంలో వెలుగు చూడగా అందులో కొందరు పార్టీనేతల పేర్లు కూడా చోటుచేసుకున్నాయి. వాహనానికి అడ్డు వచ్చి బెదిరించిన అంశాన్ని సీబీఐ అధికారులు కూడా సీరియస్‌గా తీసుకున్నారని, ఎట్టి పరిస్థితుల్లోను నిందితులను పట్టుకోవడమే కాకుండా సాధ్యమైనంత త్వరగా వివేకా కేసుకు ముగింపు పలకాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.