• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అడ్డంగా దొరికిన ఎంపీ రఘురామ - దాడులు, కేసుపై సీబీఐ కీలక ప్రకటన - ఎవరూ మిస్ కావొద్దని ట్వీట్

|

భారీ ఎత్తున బ్యాంకు రుణాలను ఎగవేసిన వ్యవహారంలో నర్సాపురం ఎంపీ, వైసీపీ రెబల్ నేత రఘురామకృష్ణంరాజు ప్రమేయం నిజమేనని తేలింది. బ్యాంకు మోసాలపై దర్యాప్తు చేస్తోన్న సీబీఐ.. గురువారం ఉదయం నుంచి హైదరాబాద్‌, ముంబైలోని ఆయన నివాసాలు, ఆఫీసుల్లో సోదాలు నిర్వహించగా.. సదరు వార్తలను ఎంపీ తోసిపుచ్చారు. తన ఇళ్లు, కంపెనీలపై దాడులు వట్టి ప్రచారమేనని చెప్పుకొచ్చారు. దీంతో కొద్ది గంటలపాటు గందరగోళం ఏర్పడింది. కానీ చివరికి సీబీఐ అధికారులు ప్రెస్ నోట్ విడుదల చేయడంతో ఎంపీ అడ్డంగా దొరికిపోయినట్లయింది.

ప్రపంచంలోనే పవర్‌ఫుల్ ఆయుధం - మన బతుకుల్ని మార్చేది అదే - స్కూల్ పిల్లాడిలా సీఎం జగన్ప్రపంచంలోనే పవర్‌ఫుల్ ఆయుధం - మన బతుకుల్ని మార్చేది అదే - స్కూల్ పిల్లాడిలా సీఎం జగన్

ఎంపీ వివరణతో గందరగోళం..

ఎంపీ వివరణతో గందరగోళం..

పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) ఆధ్వర్యంలోని బ్యాంకుల కానార్టియం నుంచి రూ.826 కోట్ల రుణం తీసుకుని, దాన్ని తిరిగి చెల్లించకుండా ఎంపీ రఘురామకృష్ణంరాజు మోసానికి పాల్పడ్డారని, రుణాల ఎగవేత వ్యవహారంలో ఎంపీకి చెందిన ఇండ్-భారత్ సంస్థ డైరెక్టర్ల ఇళ్లు, కార్యాలయాలపై గురువారం సోదాలు జరిగాయి. అయితే, తన ఇంట్లో ఎలాంటి సీబీఐ సోదాలు జరగలేదని, ఆ విషయాలను మీడియా ద్వారానే తెలుసుకున్నానని, తనిఖీలకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదని, అసలీ సోదాల విషయం బయటికి ఎలా వచ్చిందో అర్థం కావడంలేదని రఘురామ వ్యాఖ్యానించారు. కానీ ఆయనీ వ్యాఖ్యలు చేసిన కొద్ది గంటలకే దాడులు, కేసులకు సంబంధించి సీబీఐ అధికారిక ప్రకటన చేసింది.

హాత్రస్ కేసులో షాకింగ్ ట్విస్ట్ - అమ్మాయిని చంపింది తల్లీ, అన్నలే - వేలిముద్రలతో నిందితుల లేఖహాత్రస్ కేసులో షాకింగ్ ట్విస్ట్ - అమ్మాయిని చంపింది తల్లీ, అన్నలే - వేలిముద్రలతో నిందితుల లేఖ

క్లారిటీ ఇచ్చిన సీబీఐ..

క్లారిటీ ఇచ్చిన సీబీఐ..

బ్యాంకులను మోసగించిన వ్యవహారంలో ఎంపీ రఘురామకృష్ణంరాజుపై కేసు నమోదు చేశామని, మొత్తం 11 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించి కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నామని సీబీఐ అధికారులు గురువారం రాత్రి మీడియాకు ప్రెస్‌నోట్‌ విడుదల చేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు నేతృత్వంలోని కన్సార్షియం ఫిర్యాదు మేరకు ఎంపీ రఘురామపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, ఆయన కంపెనీలు రూ. 826.17 కోట్ల మోసానికి పాల్పడినట్టు ఫిర్యాదు అందిందని సీబీఐ ప్రెస్ నోట్ లో పేర్కొంది. అంతేకాదు..

ఎంపీ భార్యపైనా చీటింగ్ కేసు

ఎంపీ భార్యపైనా చీటింగ్ కేసు

ఎంపీ రఘురామకు చెందిన ఇండ్-భారత్ కంపెనీ.. బ్యాంకుల నుంచి నిధులు పొంది.. వాటిని దారిమళ్లించి దుర్వినియోగానికి పాల్పడ్డట్టు కూడా సీబీఐ అభియోగాలు మోపింది. దర్యాప్తులో భాగంగానే హైదరాబాద్, ముంబై, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని 11 ప్రదేశాల్లో గురువారం సోదాలు నిర్వహించామని, కంపెనీ కార్యాలయాలు, యజమాని నివాసాలు, ఇతర ప్రదేశాలపై సోదాలు జరిపినట్లు ప్రెస్‌నోట్‌లో సీబీఐ పేర్కొంది. ఈ వ్యవహారానికి సంబంధించి ఎంపీ రఘురామతోపాటు ఆయన భార్య రమాదేవి, కూతురు కోటగిరి ఇందిరా ప్రియదర్శిని, బొప్పన సౌజన్య, వడ్లమాని సత్యనారాయణరావు, విస్రాప్రగడ పేర్రాజు, గోపాలన్ మనోహరన్‌, కె.సీతారామ, భాగవతుల ప్రసాద్‌, నంబూరి కుమారస్వామిలపై సీబీఐ సీబీఐ చీటింగ్‌ కేసు నమోదు చేసింది.

  CBI Raids : ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో DK శివకుమార్..CBI సోదాలు!
  సీబీఐ దాడులు తొలిసారి కాదు..

  సీబీఐ దాడులు తొలిసారి కాదు..


  2019 ఏప్రిల్‌ 30న బ్యాంక్‌ లోన్‌ బకాయిలు పడిన కేసులో సైతం హైదరాబాద్‌, భీమవరంలోని రఘురామకృష్ణంరాజు కంపెనీల్లో సోదాలు చేపట్టారు. వివిధ ప్రాజెక్ట్‌లకు సంబంధించి రూ.600 కోట్ల మేర ఆయన రుణాలు తీసుకున్నారు. ఇక ఇండ్‌-భారత్‌ పవర్‌ లిమిటెడ్‌కు సంబంధించి రూ.947 కోట్ల మేర బ్యాంకులకు రుణాలు ఎగ్గవేయగా, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ ఇనిస్టిట్యూట్ల నుంచి రూ.2655 కోట్ల మేర రఘురామ రుణం తీసుకున్నారు. ఈ సోదాల్లో 11 నుంచి 14 సీబీఐ బృందాలు పాల్గొన్నట్టు సమాచారం. బ్యాంకులకు ఎగవేతపై రఘురామకృష్ణంరాజుపై సీబీఐ దాడులు చేయడం ఇదే తొలిసారి కాదు. గతేడాది కూడా సీబీఐ కేసు నమోదు చేసి సోదాలు నిర్వహించింది. ఇదిలా ఉంటే..

  ఎవరూ మిస్ కావొద్దన్న రఘురామ

  ఎవరూ మిస్ కావొద్దన్న రఘురామ


  ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలిసొచ్చిన రెండో రోజే వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కంపెనీలు, ఇళ్లపై సీబీఐ దాడులు జరగడం రాజకీయంగానూ చర్చనీయాంశమైంది. కేసుల భయంతోనే బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నించినా, కమలదళం నుంచి పాజిటివ్ సంకేతాలు రాకపోవడంతో ఢిల్లీకి పరిమితైపోయిన ఎంపీ.. ‘రాజధాని రచ్చబడ్డ' పేరుతో ప్రతిరోజూ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు. తాజాగా సీబీఐ దాడుల నేపథ్యంలో ఆయన ఆసక్తికర ట్వీట్ చేశారు. "శుక్రవారం మధ్యాహ్నం 1 గంటకు నేను రాజధాని రచ్చబండ లైవ్ కార్యక్రమంలో పాల్గొంటున్నాను. రేపు చాలా ఆసక్తికర అంశాలు వెల్లడించబోతున్నాను.. ఎవరూ మిస్ కావొద్దు'' అని రఘురామ పేర్కొన్నారు.

  English summary
  CBI has registered a case against MP raghu Ramakrishna Raju for defrauding banks. The CBI on Thursday released an official press release on the details. before cbi clarification, YSRCP rebel MP denied cbi raids. ''Tomorrow(friday) at 1pm I will be participating in the Capital Rachchabanda Live event. I'm going to reveal a lot of interesting things tomorrow.. no one will miss'' mp tweets.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X