ఏలూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అంబికా గ్రూప్‌ సంస్ధలపై సీబీఐ దాడులు- బ్యాంకు రుణాల్లో అక్రమాలపై

|
Google Oneindia TeluguNews

అంబికా దర్బార్‌ బత్తీ, అంబికా ప్రొడక్షన్స్‌తో వంటి పలు సంస్ధలతో కూడిన ప్రముఖ కార్పోరేట్‌ గ్రూపు అంబికా సంస్ధలపై సీబీఐ ఇవాళ దాడులు నిర్వహిస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని అంబికా గ్రూప్‌ సంస్ధలకు చెందిన ఇళ్లు, ఆఫీసుల్లో సీబీఐ సోదాలు చేస్తోంది. అంబికా సంస్ధలకు చెందిన పలువురు భాగస్వాములు వేర్వేరు పేర్లతో రుణాలు సేకరించారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

అంబికా గ్రూపు సంస్ధలకు అధినేతగా టీడీపీ నేత, ప్రముఖ వ్యాపారవేత్త అంబికా కృష్ణ వ్యవహరిస్తున్నారు. గతంలో రెండుసార్లు ఆయన ఏలూరు ఎమ్మెల్యేగా కూడా గెలుపొందారు. ఆ తర్వాత వరుస ఓటములతో ఆయన ప్రతిష్ట మసకబారింది. వైశ్య సామాజిక వర్గానికి చెందిన అంబికా కృష్ణకు టీడీపీ అధిష్టానంతో సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి.

cbi raids on ambika group assets in eluru, charges of bank loan irregularities

అగరబత్తీల వ్యాపారంతో ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగిన అంబికా గ్రూపు సంస్ధలు తెలుగు సినీ పరిశ్రమలోనూ సత్తా చూపాయి. పలువురు అగ్రనటులతో సినిమాలు నిర్మించిన అంబికా కృష్ణ గ్రూపును భారీ స్ధాయిలో విస్తరించారు. టీడీపీ హయాంలో ఆయన ఏపీఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. టీడీపీ అధికారం కోల్పోయాక ఆయన బీజేపీలో చేరారు. ఏలూరుతో పాటు చెన్నై, ఇతర ప్రాంతాల్లోనూ గ్రూపు ఆస్తులున్నాయి.

cbi raids on ambika group assets in eluru, charges of bank loan irregularities

ఇవాళ ఏలూరు పవర్‌ పేటలో ఉన్న అంబికా కృష్ణ ఇంట్లోనూ సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గతంలో ఇవే ఆరోపణలపై ఏలూరు పవర్‌ పేటలోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కార్యాలయంలోనూ సీబీఐ సోదాలు చేపట్టింది. భారీ ఎత్తున రుణాలు తీసుకునేందుకు వేర్వేరు పేర్లు ఉపయోగించినట్లు అంబికా గ్రూపు సంస్ధల భాగస్వాములపై ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ వ్యవహారంపై సీబీఐ అధికారికంగా స్పందించాల్సి ఉంది.

English summary
cbi has raided properties of ambika group in eluru of west godavari district based on allegations of irregularities in bank loans.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X