వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్రం ఆట మొదలు పెట్టిందా: టీడీపీ నేతలు దొరుకుతారా : ర‌ంగంలోకి సీబీఐ..సోదాలు..!

|
Google Oneindia TeluguNews

ఎన్నిక‌లు పూర్త‌య్యాయి. కేంద్రంలో మ‌రోసారి మోదీ అధికారంలోకి వ‌చ్చారు. ఎన్నిక‌ల వేళ హ‌డావుడి చేసిన సీబీఐ ఇప్పుడు కేంద్రంలోమంత్రుల ప్ర‌మాణ స్వీకారం..ప్ర‌భుత్వం ఏర్పాటు..శాఖ‌ల కేటాయింపు పూర్తి కావ‌టంతో ఇక ఆట మొద‌లు పెట్టింది. కొద్ది రోజులు విరామం ఇచ్చిన సీబీఐ తిరిగి ఇప్పుడు ప‌ని ప్రారంభించింది. అందులో భాగంగా టీడీపీ ముఖ్య నేత సంస్థ‌ల పైన సోదాలు కొన‌సాగిస్తోంది.

సుజ‌నా చౌద‌రి సంస్థ‌ల్లో సోదాలు..
టీడీపీ ముఖ్య‌నేత‌..రాజ్య‌స‌భ స‌భ్యుడు..కేంద్ర మాజీ మంత్రి సుజ‌నా చౌద‌రి ఇళ్లు..కార్యాల‌యాల్లో సీబీఐ సోదాలు కొన సాగిస్తోంది. చెన్నై నుంచి వచ్చిన ఈ బృందం సోదాలు చేస్తోంది. అటు ఇళ్లు, ఇటు కార్యాలయాల్లో ఏక కాలంలో సీబీఐ, ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. కొంత కాలం క్రితం సుజ‌నా చౌద‌రికి చెందిన ఓ కంపెనీ వ్య‌వ‌హారంలో బ్యాంకును మోసం చేసార‌ని ఆయ‌న పైన ఆరోప‌ణ‌లు ఉన్నాయి. దీని పైన గ‌తంలోనే సీబీఐ అధికారులు విచార‌ణ‌కు బెంగుళూరు రావాలంటూ నోటీసులు ఇచ్చారు. అయితే, సుజ‌నా చౌద‌రి బెంగుళూరు వెళ్లినా సీబీఐ కార్యాల‌యానికి వెళ్ల‌లేదు. ఆ త‌రువాత న్యాయ‌స్థానం ఆశ్ర‌యించి వెసులుబాటు పొందారు. సుజ‌నా చౌద‌రితో పాటుగా కంపెనీ మేనేజింగ్ డైరెక్ట‌ర్ పైనా సీబీఐ అభియోగాలు న‌మోదు చేసింది.

CBI raids on Ex Central Minister Sujana Chowdary offices and in house in a bank case

త‌న‌కు సంబంధం లేదంటున్న సుజ‌నా..
ఈడీ అధికారులు పీఎంఎల్‌ఏ చట్టం ప్రకారం దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సోదాల్లో కొన్ని డాక్యుమెంట్లను, హార్డ్ డిస్క్‌లను సీజ్ చేసినట్లు సమాచారం. ఈ సోదాలపై మాత్రం సుజనా ఇప్పటి వరకు స్పందించలేదు. గతంలో మాత్రం సీబీఐ సోదాలకు పూర్తిగా సహకరిస్తానని చెబుతూనే... 2014 ముందే పదవీ బాధ్యతల నుంచి తాను తప్పుకు న్నానని సుజనా చౌదరి స్పష్టం చేశారు. గ‌తంలో నమోదైన కేసుకు సంబంధించి మరిన్ని ఆధారాల కోసం ఈ తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. ఈ తనిఖీల్లో కొన్ని కీలక ప్రతాలతో పాటు హార్డ్‌ డిస్క్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు.

English summary
CBI raids on Ex Central Minister Sujana Chowdary offices and in house. In a bank case previously CBi raided on Sujana organisations. Now gor more information CBI started raids.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X