వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీబీఐ Vs ఏపీ : రెడ్‌హాండెడ్‌గా పట్టుకున్న ఐటీ అధికారిని ఏసీబీకి అప్పగించిన సీబీఐ, స‌మిసిన వివాదం..!

|
Google Oneindia TeluguNews

సీబీఐ వ‌ర్సెస్ ఏపి ప్ర‌భుత్వం అన్న‌ట్లుగా మారిన వ్య‌వ‌హారం ఇప్పుడు రాజీ మార్గంలో స‌మిసిపోయింది. ఏపిలో సీబీఐ అధికారిని ట్రాప్ చేసి సీబీఐ ప‌ట్టుకుంది. అయితే, గ‌తంలో తాము తీసుకున్న నిర్ణ‌యం మేర‌కు న‌డుచుకోవాల్సిందేన‌ని స్ప‌ష్టం చేసింది. దీంతో..తాము న‌మోదు చేసిన కేసును ఏసీబీకి అప్ప‌గించింది.

తొలుత అదుపులోకి తీసుకున్న సీబీఐ
రెండు రోజుల క్రితం సీబీఐ ఏపిలో ఓ కేంద్ర ప్ర‌భుత్వ అధికారిని అవినీతి వ్య‌వ‌హారంలో ట్రాప్ చేసి ప‌ట్టుకున్నారు. దీని పైన ఏపి అధికారులు అభ్యంత‌రం వ్య‌క్తం చేసారు. దీంతో, సీబీఐ అధికారులు తాము న‌మోదు చేసిన కేసును ఏపి ఏసీబీకి బ‌దిలీ చేసారు. తెనాలి-1 ఐటీ అధికారి అవుతు చంద్రశేఖర్‌రెడ్డి లంచం తీసుకుంటూ సీబీఐ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అయితే ఏపీలో మారిన నిబంధనల నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల అవినీతిపై ఏసీబీకే దాడులు చేసే అధికారం ఉంది. ఈ నేపథ్యంలో చంద్రశేఖరరెడ్డిని అరెస్టు చేస్తే సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవుతాయని భావించిన సీబీఐ ఆయన్ని ఏసీబీకి అప్పగించారు. అయితే ఏపీలో మారిన నిబంధనల నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల అవినీతిపై ఏసీబీకే దాడులు చేసే అధికారం ఉంది. ఈ నేపథ్యంలో చంద్రశేఖరరెడ్డిని అరెస్టు చేస్తే సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవుతాయని భావించిన సీబీఐ ఆయన్ని ఏసీబీకి అప్పగించారు.

CBI Transferred IT Officer case to AP ACB..

స‌మిసిన వివాదం..
కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల పైన సాధార‌ణంగా సీబీఐ అధికారులే అవినీతి కేసుల‌ను న‌మోదు చేస్తారు. అయితే, ఏపిలో తీసుకున్న అసాధారణ నిర్ణ‌యం కార‌ణంగా ఆ అధికారంలో ఏపీలో మాత్రం సీబీఐకు లేకుండా పోయింది. ఇక‌, తెనాలి లో ఐటి అధికారి ఏడున్నార ల‌క్ష‌ల లంచం డిమాండ్ చేసారు. ఎన్నారైకు ప‌న్ను వ్య‌వ‌హారంలో లంచం డిమాండ్ చేయ‌టంతో వారు సీబీఐను ఆశ్ర‌యించారు. ఫిర్యాదు మేర‌కు ట్రాప్ చేసి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డిని విశాఖ నుండి వ‌చ్చిన సీబీఐ అధికారులు వ‌ల ప‌న్న ప‌ట్టుకున్నారు. ఆ సమయంలో చంద్రశేఖర్‌రెడ్డి సీబీఐ అధికారులపై తిరగబడి కత్తెరతో పొడుచుకున్నారు. ఆ త‌రువాత ఏపి అధికారులు సీబీఐ అధికారుల దృష్టికి గ‌తంలో తాము తీసుకున్న నిర్ణ‌యం.. జారీ చేసిన ఉత్త‌ర్వులు సంగ‌తి పైన చ‌ర్చించారు. దీని పైన కొంత ప్ర‌తిష్ఠంబ‌న ఏర్ప‌డింది. ఉన్న‌తాధికారుల జోక్యంతో సీబీఐ అధికారులు స్థానికంగా ఉన్న నిబంధ‌న‌ల మేర‌కు లోక‌స్ ఏసీబీ అధికారుల‌కు కేసును బ‌దిలీ చేసారు.

English summary
CBI Transferred IT officer case to AP ACB. CBI Trapped IT officer who demand bribe from NRI. As per AP Govt policy CBI Transferred this case to ACB.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X