వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు ఆ ఉద్యోగిని బాస్టర్డ్..ఒరేయ్ అంటారా: క్షమాపణ కై ప్రభుత్వం డిమాండ్: లోకేశ్ పై మంత్రి అనిల్

|
Google Oneindia TeluguNews

Recommended Video

AP Assembly Winter Sessions 2019 : బాస్టర్డ్ అంటూ చంద్రబాబు .. అర్ధం తెలుసా ? || Oneinda Telugu

అసెంబ్లీ ఆవరణలో ప్రతిపక్ష నేత చంద్రబాబు మార్షల్స్ పైన చేసిన వ్యాఖ్యలు శాసనసభలో దుమారానికి కారణమయ్యాయి. ముఖ్యమంత్రి మీద చేసిన వ్యాఖ్యలు..అదే విధంగా మార్షల్స్ మీద చేసిన దూషణల గురించి చంద్రబాబు సమాధానం ఇవ్వాలని ప్రభుత్వం డిమాండ్ చేసింది. చంద్రబాబు..లోకేశ్ మార్షల్స్ ను దుర్భాషలాడారని.. దౌర్జన్య్ చేసారని..వారు క్షమాపణ చెప్పాలని వైసీపీ డిమాండ్ చేసింది. దీని పైన చంద్రబాబు వివరణ ఇవ్వాలని ప్రభుత్వం కోరింది. ముఖ్యమంత్రి జగన్ నుడి మంత్రులు వరుసగా చంద్రబాబును కార్నర్ చేసారు. చంద్రబాబు ఎట్టిపరిస్థితుల్లోనూ క్షమాపణ చెప్పాలని..లేకుంటా సభ పరంగా నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

బాస్టర్డ్ అంటూ చంద్రబాబు గారు...

బాస్టర్డ్ అంటూ చంద్రబాబు గారు...

మార్షల్స్ తో వాగ్వాదం సమయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు వాడిన పదజాలం పైన ముఖ్యమంత్రి జగన్ సీరియస్ అయ్యారు. ఒక ప్రభుత్వ అధికారిని పట్టుకొని బాస్టర్డ్ అంటారా అని నిలదీసారు. సభలోకి రెండో గేటు నుండి చంద్రబాబు రావాల్సి ఉన్నా..ప్రదర్శనగా పార్టీ నేతలు..కార్యకర్తలతో కలిసి సభలోకి ప్రవేశిస్తుంటే..మార్షల్స్ ఒక్కొక్కరిని పరిశీలించే పంపే ప్రయత్నం చేసారని వివరించారు. ఈ రకంగా ఉధ్దేశ పూర్వకంగా చంద్రబాబు గొడవ చేసేందుకే ఇలా వ్యవహరించారని..వారి పైన దూషణలకు దిగారని దుయ్యబట్టారు. చంద్రబాబు దారుణంగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేసారు. మంత్రి అనిల్ సైతం తీవ్రంగా స్పందించారు. రాష్ట్రం అంతా యైస్ లెస్ ఫెలో అనుకుంటున్న వ్యక్తి..అధికారిని యూజ్ లెస్ ఫెలో అంటారా అని ప్రశ్నించారు. సభా వేదికగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు.

ఏంటీ అసభ్య పదజాలం.. సీరియస్ గా ఉన్నాం

ఏంటీ అసభ్య పదజాలం.. సీరియస్ గా ఉన్నాం

మార్షల్స్ పైన చంద్రబాబు..లోకేశ్ వ్యవహరించిన తీరు పైన సభ సీరియస్ గా ఉందని మంత్రి బుగ్గన స్పష్టం చేసారు. ఏది ఏమైనా ఈ తీరు పైన చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేసారు. ఈ దాడి రాష్ట్రం పైనే జరిగినట్లుగా పేర్కొన్నారు. బాస్టర్డ్..ఎవడ్రా..యూజ్ లెస్ ఫెలో అంటూ..గొంతు పట్టుకొని ఏంటిది..గట్టిగా చర్యలు తప్పవని వ్యాఖ్యానించారు. సభ మర్యాద..గౌరవం కాపాడేలా..భవిష్యత్ లో ఎవరు ఇటువంటి వాటికి కనీసం ఆలోచన కూడా చేయలేని విధంగా..చర్యలు తీసుకోవాలని సభ తీర్మానం చేస్తుందని స్పష్టం చేసారు. దీని పైన స్పీకర్ చర్యలు తీసుకోవాలని కోరారు. దీని పైన మీడియాలో టీడీపీ సభ్యుల మీద మార్షల్స్ దాడి చేసారంటూ కధనాలు ఇచ్చారని..కానీ, వాస్తవం మాత్రం జరిగింది వేరని వివరించారు.

లోకేశ్ గురించి మండలిలో మాట్లాడండి..

లోకేశ్ గురించి మండలిలో మాట్లాడండి..

శాసన మండలి సభ్యుడి గురించి శాసన మండలిలో మాట్లాడాలని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సూచించారు. సభలోకి వస్తుంటే అసలు చంద్రబాబు..సభ్యులను మార్షల్స్ ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. ఆ సమయంలో బయటి వారెవరూ లేరని..ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు మాత్రమే ఉన్నారని చెప్పుకొచ్చారు. కేవలం లోకేశ్ గొంతు పట్టుకున్నారనే వీడియోనే చూపించారని..తరువాత జరిగింది కూడా చూపించాలని కోరారు. చంద్రబాబు అనని మాటలను అన్నారంటూ ఆపాదిస్తున్నారని ఆరోపించారు. తాను సభలోకి వచ్చే ప్రయత్నం చేస్తుంటే తనను కూడా మార్షల్స్ అడ్డుకున్నారంటూ చెప్పుకొచ్చారు. ఉద్యోగుల మనోభావాలను చంద్రబాబు దెబ్బతీసారని.. వారికి క్షమాపణ చెప్పాలని మంత్రులు కన్నబాబు..కొడాలి నాని డిమాండ్ చేసారు.

సినిమా ట్రైలర్ చూపించారు..

సినిమా ట్రైలర్ చూపించారు..

మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో ట్రయిలర్ చూపించారని..ఇది రాష్ట్రమంతా చూపించాలని సూచించారు. అనని మాటలను అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. మంత్రి అవంతి ైతం స్పందించారు. దీని పైన చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. మరోసారి మంత్రి బుగ్గన జోక్యం చేసుకొని..ఇంత జరిగిన తరువాత కూడా చంద్రబాబులో ఎటువంటి పశ్చాత్తాపం లేదని..ఎదురు దాడి చేస్తున్నారని మంత్రి బుగ్గన చెప్పుకొచ్చారు.

English summary
CBN serious comments on Assembly marshals created political heat in Assembly. CM cornered CBN on his comments against marshals.YCP demanded for action against TDP leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X