అశోక్బాబులో రౌడీని చూశాం: ఓకే గుడ్.. బాగా చేశారు: చంద్రబాబు..టీడీపీ ఎమ్మెల్సీలు (వీడియో)
శాసనమండలిలో మూడు రాజధానులు..సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లు పైన గందరగోళం ఉద్రిక్తతకు దారి తీసింది. అయితే, బిల్లుల ప్రతిపాదన సమయం నుండి సెలెక్ట్ కమిటీకి పంపే వరకు టీడీపీ సభలో తమ పట్టు కొనసాగించేందుకు ప్రయత్నం చేస్తూనే ఉంది. మంత్రులు..టీడీపీ ఎమ్మెల్సీల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. సభలో జరిగిన పరిణామాల పైన టీడీపీ ఎమ్మెల్సీలు పార్టీ అధినేతను అసెంబ్లీ ప్రాంగణం లో ఆయనను కలిసారు. ఆ సమయంలో సభలో ఎమ్మెల్సీ అశోక్ బాబు మంత్రులను ఏ రకంగా ప్రతిఘటించారో సభ్యులు ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు సైతం అధికారపక్షాన్ని ఎదుర్కొన్న సభ్యలను అభినందించారు. ఆ సమయంలో జరిగిన చర్చ..ఆ వ్యాఖ్యల వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
టీడీపీ ఎమ్మెల్సీల వ్యాఖ్యల కలకలం..
ప్రభుత్వ బిల్లుల పైన శాసన మండలిలో మంత్రులు..టీడీపీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఒక దశలో పరిస్థితి చేయి దాటిపోయింది. ఒకరిని ఒకరు తోసుకొనేందుకు వెళ్లారు. రెండు పార్టీల నుండి వారికి సద్ది చెప్పారు. ఇక, ఈ అంశం పైన టీడీపీ ఎమ్మెల్సీలు సభా ప్రాంగణంలోని తన ఛాంబర్ లో ఉన్న చంద్రబాబును కలిసారు.

ఆ సమయంలో వారు వారు చేసిన వ్యాఖ్యల వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. అసెంబ్లీ ఆమోదించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లును మండలిలో ప్రవేశపెట్టనివ్వకుండా తాము ఏ విధంగా రౌడీయిజం ప్రదర్శించామో ఆ పార్టీ సభ్యులే స్వయంగా చంద్రబాబుకు వివరించారు. వారిని చంద్రబాబు సైతం ఓకే గుడ్. బాగా చేశారు అంటూ ప్రశంసించటం వీడియోలో కనిపిస్తోంది. అంతేకాక.. ఎమ్మెల్సీలతో చంద్రబాబు మాట్లాడుతూ.. 'మీరు లోపల కూర్చున్నారు. నేను టీవీ దగ్గర కూర్చుని మండలిలో జరిగే చర్చ చూశాను. మాధ్యమాల్లో స్క్రోలింగ్ చూస్తున్నా.
అశోక్బాబులో రౌడీని చూశాం: ఓకే గుడ్.. బాగా చేశారు: చంద్రబాబు#TDP #ChandrababuNaidu #Amaravati pic.twitter.com/o8pRjZ5xnZ
— Oneindia Telugu (@oneindiatelugu) January 23, 2020
అశోక్ బాబులో రౌడీని చూశాం..
సభలో అశోక్ బాబులో రౌడీని చూసామంటూ టీడీపీ ఎమ్మెల్సీలు చంద్రబాబుతో వ్యాఖ్యానించారు. అశోక్బాబులో రౌడీని చూశాం.. మంత్రులు వచ్చినప్పుడు ఆయన ఏయ్.. ఏయ్ అని బాగా అరిచారు.. కొంచెం ఉంటే కొట్టేవాడు.. బెజవాడ రౌడీయిజం చూపెట్టారు అంటూ చంద్రబాబుకు వివరించారు. చంద్రబాబు సైతం తాను సభలో జరిగిన పరిణామాలను చూస్తూనే ఉన్నానని.. వాళ్ల మంత్రులు రావటం.. మనవాళ్లు గొడవకు దిగడం అంతా చూశానని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ వీడియో హల్ చల్ చేస్తోంది.