వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు ఆశలు నెరవేరనట్లేనా: రెండు రాష్ట్రాల ఎన్నికల ఎఫెక్ట్: కేంద్రంలో ఏం జరుగుతోంది..!

|
Google Oneindia TeluguNews

మహారాష్ట్ర..హర్యానా ఎన్నికల ఫలితాలు జాతీయ పార్టీలకు మిశ్రమంగా కనిపిస్తున్నాయి. కానీ, టీడీపీ అధినేత చంద్రబాబు ఆశల మీద నీళ్లు చల్లినట్లు స్పష్టమవుతోంది. ఆర్టికల్ 370 రద్దు ద్వారా దేశం మొత్తం తమకే మద్దతుగా ఉందని ప్రధాని మోదీ..బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఆ రెండు రాష్ట్రాల ఎన్నికల్లోనూ అదే ప్రధాన ప్రచారాస్త్రంగా మలచుకున్నారు. మహారాష్ట్రలో శివసేనతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నా..హర్యానా లో కుస్తీ పడుతున్నా.. కాంగ్రెస్ అధినాయకత్వం సైతం అంచనా వేయని విధంగా హస్తం పార్టీ పుంజుకోవటం ఇప్పుడు ఆ ఇద్దరిలో కొత్త ఆలోచనలకు కారణం అవుతోంది.

రెండో సారి అధికారంలోకి వచ్చిన తరువాత తమకు తిరుగు లేదని భావించిన ఆ ఇద్దరు నేతలకు ఇది సమీక్షించుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. ఇక, మోదీ..షా ఒక లక్ష్యం దిశగా ప్రయత్నాలు చేస్తోంది. అది సక్సెస్ అయితే తనకు కలిసి వస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు అంచనాల్లో ఉన్నారు. కానీ, ఇప్పుడు ఆ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తరువాత సమీకరణాలు మారుతున్నాయి. దీంతో..చంద్రబాబు ఆశలు సైతం నెరవేరుతాయా లేదా అనేది సందేహమే.

CBN hope on early eletions in AP with one nation one election..with latest results it may not happen

మోదీ..షా లక్ష్యం జమిలి ఎన్నికలు..
అయిదు నెలల క్రితం రెండో సారి భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన బీజేపీ అగ్ర నేతలు భవిష్యత్ కార్యాచరణ సైతం సిద్దం చేసుకున్నారు. అందులో వారు కొన్ని ప్రధాన లక్ష్యాలను నిర్దేశించుకున్నారు.
అందులో కీలకమైన ట్రిపుల్ తలాక్ బిల్లు..ఆర్టికల్ 370 రద్దు వంటి వాటిని ఇప్పటికే పూర్తి చేసారు. ఇక, జమిలి ఎన్నికలు మరో ప్రధాన లక్ష్యం. అందులో భాగంగా ఇప్పటికే ప్రధాని స్వయంగా అన్ని పార్టీల అధినేతలతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసారు. మెజార్టీ పార్టీలు మద్దతు ప్రకటించాయి. అయితే, తమ ప్రాభవానికి పోటీ లేదని భావిస్తన్న సమయంలో మహారాష్ట్ర..హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకోవటంతో బీజేపీ నేతలు పునరాలోచనలో పడ్డారు. వాస్తవంగా 2022 చివర్లో లేదా 2023 తొలి మూడు నెలల్లో జమిలి ఎన్నికల దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. కానీ, ఇప్పుడు వచ్చిన ఫలితాలతో వారు జమిలి ఎన్నికల విషయంలో ముందుకె వెళ్లేది అనుమానమే.

జమిలి మీద చంద్రబాబు ఆశలు..
ఏపీలో ఊహించని విధంగా సార్వ్రతిక ఎన్నికల్లో ఓటమి చవి చూసిన టీడీపీ అధినేత చంద్రబాబు..ఈ మధ్య కాలంలో పదే పదే జమిలి ఎన్నికల అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. అయిదేళ్ల పాటు వైసీపీ ప్రభుత్వం కొనసాగటం కష్టమని..జమిలి ఎన్నికలకు అవకాశం ఉందని చెబుతూ వస్తున్నారు. ఆ దిశగానే పార్టీ కేడర్ లో ఆశలు పెంచుతున్నారు. ప్రజలు తన పాలనే కోరుకుంటున్నారని చెబుతున్నారు. మరో వైపు ఏపీలో అయిదు నెలల కాలంలోనే వైసీపీ ప్రభుత్వ పాలనపైన ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని..దీనిని అనుకూలంగా మలచుకోవాలని చంద్రబాబు చెప్పుకొస్తున్నారు. 2024 వరకు ఆగాల్సిన అవసరం లేదని.. 2022 చివర్లోనే ఎన్నికల హడావుడి మొదలవుతుందని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు. అయితే, ఇప్పుడు కేంద్రంలో తాజా ఎన్నికల ఫలితాల తరువాత ఆలోచన మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. జమిలి ఎన్నికల పైనా కేంద్రం ఆలోచన మార్చుకుంటే టీడీపీ అధినేత అంచనాలు తప్పే అవకాశం ఉంది. అదే విధంగా ముఖ్యమంత్రి జగన్ కు సైతం మరి కొంత సమయం దొరుకుతుంది. ఇదే సమయంలో ఏపీలో త్వరలో స్థానిక సంస్థలు..మున్సిపల్ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు తమ సత్తా చాటుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

English summary
After Maharashtra and Haryana Relusts BJP key leader may re think about one nation one election. TDP cheif Chandra babu repeatedly saying about early elections in AP. But, now it seem to be not possible.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X