అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు..వెనక్కు నడుస్తూ: రివర్స్ పాలనపై నిరసన: తుగ్లక్ పాలన అంటూ..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

AP Assembly Winter Sessions 2019 : వెనక్కు నడుస్తూ.. చంద్రబాబు నిరసన || Oneindia Telugu

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రివర్స్ టెండరింగ్ పైన ప్రతిపక్షం టిడీపీ నిరసన వ్యక్తం చేసింది. అసెంబ్లీ ఎదుట పార్టీ అధినేత చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్సీలు..ఎమ్మెల్యేలతో కలిసి వెనక్కు నడుస్తూ నిరసన వ్యక్తం చేసారు. రివర్స్ టెండరింగ్ కాదని..ప్రభుత్వం చేస్తున్నది రిజర్వ్ టెండరింగ్ అంటూ చంద్రబాబు ఫైర్ అయ్యారు. అమరావతి ఆపేసారు..పోలవరం నిలిపి వేసారు అంటూ బ్యానర్ తో టీడీపీ నేతలు నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్ పాలనను తుగ్లక్ పాలనగా చంద్రబాబు అభివర్ణించారు. హ్యాపీనెస్ట్ లో రివర్స టెండరింగ్ కు వెళ్లటాన్ని తప్పుబట్టారు. దీని పైన తాము ప్రభుత్వాన్ని నిలదీస్తూనే..ఆందోళన కొనసాగిస్తామని చంద్రబాబు స్పష్టం చేసారు.

వెనక్కు నడుస్తూ..చంద్రబాబు నిరసన
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ఆరో రోజు సమావేశం ప్రారంభమైంది. దీనికి ముందుగా అసెంబ్లీ వద్ద ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నిరసన చేపట్టింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు పార్టీ నేతలతో కలిసి ప్రభుత్వం అమలు చేస్తున్న రివర్స్ టెండరింగ్ మీద నిరసన నిర్వహించారు. వెనక్కు నడుస్తూ పాలన రివర్స్ లో నడుస్తోందని నినదించారు.

CBN protest against Reverse tendering by walking back in front of Assembly

ప్రభుత్వం అమలు చేస్తుంది రివర్స్ టెండరింగ్ కాదని..అది రిజర్వ్ టెండరింగ్ అంటూ ఆరోపించారు. రెండు లక్షల కోట్ల విలువ చేసే రాజధానిని చంపేసారంటూ ఫైర్ అయ్యారు. బంగారు బాతు గుడ్డు పెట్టే బాతును పెంచుకోవాల్సింది పోయివ..చంపేసారని వ్యాఖ్యానించారు. అదే విధంగా ముందుగానే కంపెనీలతో ఒప్పందం చేసుకొని..రివర్స్ టెండరింగ్ పేరుతో రిజర్వ్ టెండరింగ్ కు పాల్పడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు.

రివర్స్ టెండరింగ్..ప్రభుత్వ నిర్ణయాల కారణంగా పెట్టుబడులు ఏపీకి రాని పరిస్థితి కల్పించారని టీడీపీ అధినేత మండిపడ్డారు. ఇక్కడ జరుగుతున్న పాలన తుగ్లక్... ఉన్మాది పాలన అంటూ ఫైర్ అయ్యారు. ఇక్కడికి పెట్టుబడి దారులు రావాలంటే భయపడే పరిస్థితి నెలకొని ఉందన్నారు. తాజాగా హ్యాపీనెస్ట్ పైనా రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించటాన్ని ఆయన తప్పు బట్టారు. ఇది ఖచ్చితంగా తుగ్లక్ చర్యేనంటూ వ్యాఖ్యానించారు. రివర్స్ పాలనను తాము చూస్తూ ఊరుకోమని..దీని పైన నిరసన కొనసాగిస్తూనే..ప్రభుత్వాన్ని నిలదీస్తామని చంద్రబాబు స్పష్టం చేసారు.

English summary
CBN protest on Reverse Tendering by walking back in front of Assembly along with party leaders. He says ap govt is running Tuglak administration in all key matters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X