వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వంశీని బెదిరించారు..సరెండర్ అయితే అంతే..: ఏ పార్టీ పోరాడినా మద్దతిస్తాం: చంద్రబాబు ఫైర్..!

|
Google Oneindia TeluguNews

ఏపీలో ఏ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తే..వారికి ప్రధాన ప్రతిపక్షంగా మద్దతిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేసారు. జనసేన అధినేత పవన్ తనతో మాట్లాడి విశాఖ మార్చ్ కు మద్దతు కోరారని..పార్టీ సీనియర్లను పంపుతున్నామని చెప్పారు. వల్లభనేని వంశీ పార్టీ మారుతున్నామని ఎవరితో చెప్పారని ప్రశ్నించారు. పోరాడితే మాస్ లీడర్ మరింత మాస్ లీడర్ అవుతారని అలా కాకుండా..సరెండర్ అవుతే ఇక అంతే అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.

చింతమనేని మీద 90 కేసులు పెట్టటం ద్వారా ఆయన ఇప్పుడు రాష్ట్రంలో నెంబర్ ఒన్ మాస్ లీడర్ అయ్యారని చెప్పుకొచ్చారు. జగన్ తన మీద 11 ఛార్జ్ షీట్లు పెట్టుకొని ఎదుటి వారి మీద ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. పత్రికా స్వేచ్చకు వ్యతిరేకంగా జారీ చేసి 2430 జీవోను తక్షణమే రద్దు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేసారు. టీడీపీని విచ్ఛిన్న చేసే వక్తి ఎవరికీ లేదన్నారు చంద్రబాబు.

పవన్..టీడీపీ మధ్య పొడుస్తున్న స్నేహం..! విశాఖ ర్యాలీకీ చంద్రబాబు మద్దతు: హాజరవుతామని ప్రకటన..!పవన్..టీడీపీ మధ్య పొడుస్తున్న స్నేహం..! విశాఖ ర్యాలీకీ చంద్రబాబు మద్దతు: హాజరవుతామని ప్రకటన..!

వంశీని చంపేస్తామని బెదిరించారు..

వంశీని చంపేస్తామని బెదిరించారు..

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పైన కేసులు నమోదు చేసి భయపెట్టారని..చంపేస్తామని బెదిరిస్తున్నారని చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. వాళ్లు బెదిరిస్తే వంశీ భయపడతాడా అని ప్రశ్నించారు. మాస్ లీడర్ పోరాడితే మరింత మాస్ లీడర్ అవుతారని..సరెండర్ అవుతే ఇక అంతేనని వ్యాఖ్యానించారు. పులివెందుల రౌడీలు చంపేస్తామంటూ హెచ్చరిస్తున్నారని ఆరోపించారు. వంశీ మీద ఫోర్జరీ కేసులు పెట్టారని ఆయన..అక్కడ ఉన్న పేదలకే పొజీషన్ ఇవ్వాలని ప్రయత్నించారే కానీ, ఎవరి భూములు ఆక్రమించలేదన్నారు. వైసీపీ నేతలు చెప్పిన విధంగా ఫిర్యాదు చేసిన తహసీల్దార్ ను వెంటనే డిస్మిస్ చేయాలని చంద్రబాబు డిమాండ్ చేసారు. చింతమనేని ప్రభాకర్ మీద 90 కేసులు పెట్టారని..ఆయన ఇప్పుడు రాష్ట్రంలోనే నెంబర్ ఒన్ మాస్ లీడర్ అయ్యారని చెప్పుకొచ్చారు. పార్టీ నేతలు అనేక మంది మీద కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.

ఆ జీవోను రద్దు చేయాలి..

ఆ జీవోను రద్దు చేయాలి..

ప్రభుత్వం మీడియాను బెదిరించే విధంగా జారీ చేసిన జీవో 2430ను వెంటనే రద్దు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేసారు. దీని పైన ఎటువంటి పోరాటానికైనా సిద్దమని స్పష్టం చేసారు. గతంలో వైయస్ హాయంలో ఇటువంటి జీవో జారీ చేయగానే ఆందోళనలు చేసారని..కానీ, ఇప్పుడు మాత్రం ముందుకు రావటం లేదని అసహనం వ్యక్తం చేసారు. జగన్ కంటే రాష్ట్రంలో ఎవరూ తప్పులు చేసిన వారు లేరన్నారు. బాబాయ్ ను చంపేసారని..అదే మాదిరిగా వ్యవహరిస్తారా అని ప్రశ్నించారు. అవినీతి మచ్చ లేని సింగపూర్ కంపెనీలను పంపేసారని.. వారి మీద అవినీతి ముద్ర వేస్తున్నారని తప్పు బట్టారు. సొంత బాబాయ్ ను చంపితే దిక్కు లేదని తీవ్ర వ్యాఖ్యలు చేసారు. పార్టీ నేతలు అఖిల ప్రియ..రామయ్య..సోమిరెడ్డ వంటి వారి మీద కేసులు పెట్టి భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

 ఏ పార్టీ పోరాడినా మద్దతిస్తాం..

ఏ పార్టీ పోరాడినా మద్దతిస్తాం..

ఏపీలో ప్రజా సమస్యల మీద ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ పార్టీ పోరాడినా ప్రధాన ప్రతిపక్షంగా మద్దతిస్తామని చంద్రబాబు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ తమ మద్దతు కోరారని..అందుకే ఆయన నిర్వహిస్తున్న లాంగ్ మార్చ్ కు పార్టీ సీనియర్లను పంపుతున్నామని వెల్లడించారు. టీడీపీని విచ్ఛిన్నం చేసే శక్తి ఎవ్వరికీ లేదన్నారు. రాష్ట్రంలో ఇసుక కొరత వైసీపీ మాఫియా కారణంగా ఏర్పడిందన్నారు. ఇతర రాష్ట్రాల్లోనూ వర్షాలు ఉన్నాయని..అక్కడ లేని సమస్య ఏపీలో మాత్రమే ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు పనులు లేక ఇబ్బంది పడుతున్నారని..అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వానికి చలనం లేదని విమర్శించారు. ఆత్మహత్య చేసుకున్న కార్మికులకు 25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసారు.

English summary
TDp Chief Chandra babu serious allegations on Cm jagan. Babu says YCP leaders threatening Vamsi for joining him in YCP. if Vamsi surrender for them then he will miss his mass leader ship in his political life. CBN demanded that Govt must withdraw go no 2430.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X