వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అత్యాచారంపై సీఎం స్పందించరా: నిందితుడు రెడ్డి వర్గం వాడనా..! చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..!

|
Google Oneindia TeluguNews

టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ఒక వర్గానికి ప్రాధాన్యత ఇస్తోందని..కార్నర్ చేస్తున్న ప్రతిపక్షం...టీడీపీ హాయంలో ఏ వర్గానికి ప్రాధాన్యత ఇచ్చారంటూ వైసీపీ..ఇలా అసెంబ్లీలో వాగ్వాదం సాగుతోంది. ఇదే సమయంలో అసెంబ్లీలో ప్రతిపక్ష నేత చంద్రబాబు గుంటూరులో అయిదేళ్ల చిన్నారిపైన జరిగిన అత్యాచారం ఘటనపైన తీవ్రంగా స్పందించారు. దిశ చట్టం తెచ్చిన రోజునే అత్యాచారం జరిగితే ముఖ్యమంత్రి ఎందుకు స్పందించలేదని నిలదీసారు. ఆ తరువాత గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని చంద్రబాబు పరామర్శించారు. సీఎం స్పందించకపోవటానికి కారణం..బాధితురాలు దళిత కుటుంబానికి చెందిందనా..లేక అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి రెడ్డి వర్గానికి చెందిన వాడనా ప్రశ్నించారు.

జగన్.. ఎన్టీఆర్ కాదు! తాగుబోతుల సంఘం అధ్యక్షుడిలా చంద్రబాబు: పొరపాటుకు రోజా 'సారీ’జగన్.. ఎన్టీఆర్ కాదు! తాగుబోతుల సంఘం అధ్యక్షుడిలా చంద్రబాబు: పొరపాటుకు రోజా 'సారీ’

బాలికపై ఘోరం జరిగితే పరామర్శిచరా..

బాలికపై ఘోరం జరిగితే పరామర్శిచరా..

గుంటూరులో అయిదేళ్ల బాలికపైన అత్యాచార ఘటన పైన ఇప్పుడు రాజకీయంగా విమర్శలు మొదలయ్యాయి. ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధిత బాలికను టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. ఐదేళ్ల బాలికపై ఘోరం జరిగితే ముఖ్యమంత్రి పరామర్శించరా అని చంద్రబాబు నిలదీసారు. దిశ ఘటనలో త్యాచారం చేసిన నలుగురిని పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేస్తే తెలంగాణ సీఎం కేసీఆర్‌ను తెగ పొగిడిన సీఎం జగన్మోహన్‌ రెడ్డి, గుంటూరులో ఐదేళ్ల పాపపై జరిగిన అత్యాచారం ఘటనపై ఎందుకు స్పందించలేదని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. ఇందుకు కారణం.. బాధితురాలు దళిత కుటుంబానికి చెందిందనా.. లేక అత్యాచారానికి పాల్పడిన వాడు రెడ్డి వర్గానికి చెందిన వాడనా.. అంటూ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేసారు.

దిశ ఘటన జరిగిన రోజునే..

దిశ ఘటన జరిగిన రోజునే..

జగన్మోహన్‌ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయని.. మాటలు మాత్రం గడప దాటడం లేదని.. ఆయనది స్ప్లిట్‌ పర్సనాలిటీ అని.. మాట మీద నిలబడే స్వభావం ఆయనకు లేదని చంద్రబాబు విమర్శించారు. ఆడ పిల్లల రక్షణకు దిశ చట్టం తెచ్చిన రోజే గుంటూరులో ఐదేళ్ల పసిపాపపై అత్యాచారం జరిగిందని.. ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆ పాపను పరామర్శించే తీరిక సీఎంకు, మంత్రులకు లేదని మండిపడ్డారు. అంతకు ముందు మాజీ మంత్రి లోకేశ్ సైతం ఇదే అంశం మీద స్పందించారు. ఇక, చికిత్స పొందుతున్న బాధితురాలిని పరామర్శించేందుకు వెళ్లిన మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ ను బాధిత కుటుంబ సభ్యులు నిరసనతో అడ్డుకునే ప్రయత్నం చేసారు. ఇక, తాజాగా హోం మంత్రి సుచరిత బాధిత బాలికను ఆస్పత్రిలో పరామర్శించి..ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.

చంద్రబాబు వ్యాఖ్యలపైన రోజా రియాక్షన్

చంద్రబాబు వ్యాఖ్యలపైన రోజా రియాక్షన్

పరామర్శకు ముందు సభలో చంద్రబాబు ఇదే అంశాన్ని లేవనెత్తారు. బాధితురాలిపైన ఘోరానికి పాల్పడిన వ్యక్తిపై చర్యలు తీసుకోకపోవటం పైన నిలదీసారు. అయితే, దీనిపైన సభలోనే రోజా స్పందించారు. చంద్రబాబు బాధితురాలి గురించి ప్రస్తావించారని..అయితే నిందితుడు కులం పేరును మాత్రం నొక్కి ప్రస్తావించారని వ్యాఖ్యానించారు. ఇక, బాలికను పరామర్శించిన చంద్రబాబు ఆమెకు అందిస్తున్న చికిత్సలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు టీడీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. దళిత బాలికపై అత్యాచారానికి పాల్పడిన లక్ష్మారెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లక్షలు డిపాజిట్‌ చేయాలని.. ఇల్లు, మూడెకరాల పొలం, తల్లికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, బాలికను ప్రభుత్వమే చదివించాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ తరఫున బాధిత కుటుంబానికి రూ. 50వేలు సాయం ప్రకటించారు.

English summary
CBN serious comments on CM jagan on Gutur girl rape case. CBN console girl in hospital and annouonced rs 50,000 as financial assistance for her family.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X