హానీ ట్రాప్: 'అనుష్క' ట్రాప్‌లో ఇతనే, 10లక్షల డిపాజిట్
హైదరాబాద్: పాకిస్తాన్ గర్ల్ హానీ ట్రాప్‌లో సుబేదార్ పతన్ కుమార్ పొద్దార్ పడిన విషయం తెలిసిందే. అనుష్క పేరుతో పాకిస్తాన్ యువతి పతన్‌ను ట్రాప్‌లో పడేసింది! పసిగట్టిన ఇంటెలిజెన్స్ అతనిని బుధవారం అరెస్టు చేసింది. అయితే, విచారణలో పలు అంశాలు తెలిశాయని తెలుస్తోంది.
సమాచారం మేరకు.. పాక్ మహిళ అనుష్క అగర్వాల్‌తో అతను నెలలుగా చాటింగ్ చేస్తున్నట్లు పతన్ వెల్లడించాడు. అలాగే అనుష్క తన అకౌంటులో పది లక్షల రూపాయలు డిపాజిట్ చేసినట్లు చెప్పాడు. భారత్ - పాక్ సరిహద్దుల్లోని పూంఛ్ సెక్టారులో ఆర్మీ కదలికల పైన అనుష్క సమాచారం అడిగిందని చెప్పాడు. అనుష్క ఫేస్బుక్ అకౌంట్ రాజస్థాన్ రాజధాని జైపూర్ అడ్రస్‌తో ఉంది.
అనుష్క ఫేస్బుక్ అకౌంట్, కాల్ డాటాను సీసీఎస్ పోలీసులు తెప్పించుకున్నారు. సీసీఎస్ పోలీసులు నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ వేయనున్నారు. ఎన్ఐఏ, ఐబీ, ఆర్మీ, ఇంటెలిజెన్స్, సీఐఎస్ఎఫ్లు పతన్ కుమార్‌ను తమకు అప్పగించాలని ఇప్పటికే కోరుతున్నాయి.