వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిబంధ‌న‌ల‌కు విరుద్దం : టీడీపీని ప‌ట్టించుకోరా : ఎన్నిక‌ల సంఘానికి చంద్ర‌బాబు లేఖ‌..!

|
Google Oneindia TeluguNews

చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో అయిదు పోలింగ్ కేంద్రాల్లో ఎన్నిక‌ల సంఘం రీ పోలింగ్‌కు ఆదేశించ‌టం పైన ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. ఎన్నిక‌ల సంఘం నిబంధ‌న‌ల‌కు వ్య‌తిరేకంగా ప‌ని చేస్తోంద‌ని.. క‌నీసం టీడీపీ ఫిర్యాదుల‌ను ప‌ట్టించుకోవ‌టం లేద‌ని ఫైర్ అయ్యారు. త‌న ఆగ్ర‌హాన్ని..అసంతృప్తిని వ్య‌క్తం చేస్తూ కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి లేఖ రాసారు..

చంద్ర‌గిరి రీ పోలింగ్ పైన ఆగ్ర‌హం..
టీడీపీ అధినేత చంద్ర‌బాబు త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం అయిన చంద్ర‌గిరిలో కేంద్ర ఎన్నిక‌ల సంఘం అయిదు కేంద్రాల్లో రీ పోలింగ్‌కు ఆదేశించ‌టం పైన ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే ట్విట్ట‌ర్ ద్వారా అన అసంతృప్తిని వ్య‌క్తం చేసిన చంద్ర‌బాబు తాజాగా కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి లేఖ రాసారు. అందులో ఎన్నిక‌ల సంఘం నిబంధ‌న‌లు పాటించ‌టం లేద‌ని ఫైర్ అయ్యారు. టీడీపీ ఫిర్యాదు చేస్తే ప‌ట్టించుకోకుండా ఎలాంటి విచార‌ణ చేకుండా నిర్ణ‌యం తీసుకోవ‌టం దారుణ‌మ‌ని చంద్ర‌బాబు లేఖ‌లో పేర్కొన్నారు.

CEC not following Election Rules..Taking decisions one side : Chandra Babu letter to CEC..

ఎన్నిక‌ల ప్ర‌క్రియ దాదాపు చివ‌రి అంకానికి చేరుకొని.. ఫ‌లితాల కోసం ఏర్పాట్లు జ‌రుగుతున్న వేళ‌..ఇటువంటి నిర్ణ‌యం తీసుకోవ‌టం పైన టీడీపీ నుండి అసంతృప్తి క‌నిపిస్తోంది. చంద్ర‌బాబు త‌న లేఖ‌లో ఎన్నిక‌ల సంఘ తీరును త‌ప్పు బట్టారు. అస‌లు ఏ ఫిర్యాదు మేర‌కు చంద్ర‌గిరి లో రీ పోలింగ్ నిర్వ‌హిస్తున్నార‌ని ప్ర‌శ్నించారు.

టీడీపీ నేత‌ల వ‌రుస ఫిర్యాదులు..
చంద్ర‌గిరి అయిదు కేంద్రాల్లో రీ పోలింగ్‌కు నిర్ణ‌యం తీసుకోవటం టీడీపీ అధినేత చంద్ర‌బాబు మొద‌లు పార్టీ నేత‌ల వ‌ర‌కూ అంద‌రూ వ‌రుస‌గా ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదులు చేసారు. టీడీపీ నేత‌లు కంభంపాటి రామ్మోహ‌న్‌, సీఎం ర‌మేష్ కేంద్ర ఎన్నిక‌ల సంఘాన్ని క‌లిసి ఈ నిర్ణ‌యం పైన అసంతృప్తి వ్య‌క్తం చేసారు. టీడీపీ ఫిర్యాదు చేస్తే క‌నీసం ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేద‌ని వివ‌రించారు. వైసీపీ ఫిర్యాదు చేయ‌గానే ఏక‌ప‌క్షంగా రీ పోలింగ్‌కు ఆదేశించార‌ని వివ‌రించారు.

CEC not following Election Rules..Taking decisions one side : Chandra Babu letter to CEC..

అస‌లు ఈ అయిదు కేంద్రాల్లో రీ పోలింగ్ నిర్వ‌హించాల్సిన అవ‌స‌రం ఏంట‌ని టీడీపీ ప్ర‌శ్నిస్తోంది. ఈ నెల 19న రీపోలింగ్‌కు ముహూర్తంగా ఖ‌రారు చేసారు. ఇక‌, ఇప్పుడు నేరుగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఎన్నిక‌ల సంఘానికి త‌న అసంతృప్తి వ్య‌క్తం చేస్తూ లేఖ రాయ‌టంతో..దీని పైన ఎన్నిక‌ల సంఘం ఎలా రియాక్ట్ అవుతుందో.. రీ పోలింగ్ కార‌ణాలు ఏం చెబుతుందో చూడాలి.

English summary
TDP Chief Chandra babu letter to Central Election Commission on Chandragiri re polling decision. Chandra Babu mentioned in letter that CEC not following rules and taking decision one side.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X