వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డ్వాక్రా చెక్కులు..ఓట్ల తొలిగింపు పై నిఘా : డిజిపి పై లిఖిత‌పూర్వ‌క ఫిర్యాదు రాలేదు: ఎన్నిక‌ల సంఘం..

|
Google Oneindia TeluguNews

ఏపిలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల పై ఎన్నిక‌ల సంఘం దృష్టి సారించింది. విప‌క్ష నేత జ‌గ‌న్ నేరుగా ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి ని క‌లిసి ఏపిలోని ప‌రిస్థితుల పై ఫిర్యాదు చేసారు. ఏపికి వ‌చ్చిన సీఈసి ఇక్క‌డి ప‌రిస్థితుల పై వాక‌బు చేసారు. అందు లో ప్ర‌ధానంగా ఓట్ల తొలిగింపు పై నిశితంగా అధ్య‌య‌నం చేయాల‌ని నిజ‌మైతే..బాధ్యుల పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదే శించారు. డ్వాక్రా సంఘాల‌కు ఇస్తున్న చెక్కుల మీదా దృష్టి పెట్టారు.

ఓట్ల తొలిగింపు పై త‌నిఖీలు..
ఏపిలో విప‌క్ష నేత జ‌గ‌న్ చేసిన ఫిర్యాదు పై ఎన్నిక‌ల సంఘం నిజ నిర్ధార‌ణ ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్‌లో 21 లక్ష ల ఓట్లు తొలగించారంటూ వచ్చిన ఫిర్యాదులపై త్వరలో బృందాలను పంపి తనిఖీలు చేయి స్తామని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోడా ప్రకటించారు. దురుద్దేశపూర్వకంగా వ్యవహారాలు ఉంటే ఎన్నికల సంఘం కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పారు.

వీవీ ప్యాట్‌లను ఎంత మేరకు లెక్కించాలనే విషయంపై ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టి ట్యూట్‌, నేషనల్‌ శాంపిల్‌ ఆర్గనైజేషన్‌ల నిపుణులతో నియమించిన కమిటీ నివేదిక సమర్పించిందని అరోడా వెల్లడిం చారు. దీని ఆధారంగా త్వరలోనే వీవీ ప్యాట్ల్‌ లెక్కింపుపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నిక ల ఏర్పాట్లపై రాజకీయ పార్టీలు, కలెక్టర్లు, ఎస్పీలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ తదితరులతో రెండు రోజుల పాటు సమావేశాలు నిర్వహించా రు. రాజకీయపార్టీల నుంచి అనేక విన్నపాలు ఫిర్యాదులు అందాయని, వాటిపైనా సమగ్ర దృష్టి సారించామన్నారు.

CEC ordered for enquiry on votes deletion : not written complaint on DGP

డ్వాక్రా చెక్కేల పైనా ఫిర్యాదులు
ఏపిలో డ్వాక్రా గ్రూపు మహిళలకు ముందస్తు తేదీ వేసి చెక్కులు జారీ చేస్తున్న వైనంపై రాజకీయపార్టీల నుంచి ఫిర్యా దులు అందాయన్నారు. వాటిపై రాష్ట్ర ప్రభుత్వ వివరణ తీసుకున్నామని చెప్పారు. దీనిపై మరింత లోతైన దర్యాప్తు చేయనున్నామని వెల్ల‌డించారు. వివిధ సంస్థలతో సర్వేలు చేయిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అభిప్రాయం చెప్పిన వారి ఓట్లు తొలగిస్తున్నారనే ఆరోపణల పై తమ బృందాలు జరిపే తనిఖీల్లో వాస్తవాలు బయటకు వస్తాయన్నారు.

ఇక‌ డీజీపీ పనితీరుపై ఏ రాజకీయ పార్టీ కూడా తమకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయలేదని ఎన్నికల ప్రధాన అధికారి స్పష్టం చేశారు. ఫిబ్రవరి 20 లోపు బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని గడువు నిర్దేశించామన్నారు. తెలంగాణ, ఆంధ్రప్ర దేశ్‌లలో రెండు చోట్లా ఓట్లు ఉంటే తొలగిస్తామని చెప్పారు. ఆర్టీజీఎస్‌ ద్వారా ప్రభుత్వం చేయించే సర్వేపై రాష్ట్ర ఎన్ని కల అధికారి నుంచి నివేదిక తీసుకుంటామని సీఈసి వెల్ల‌డించారు.

English summary
CEC respond on YCP Chief complaint on votes deletion in AP. CEC Sunil Arora clarified that special teams will inspect voters list in ground level then take action. CEC also look into the Post date Cheques for DWACRA members.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X