వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ కేబినెట్‌కు ఈసీ ఆమోదం : మ‌ధ్నాహ్నానికి స‌మావేశం ఖ‌రారు: అజెండాకే ప‌రిమితం..!

|
Google Oneindia TeluguNews

ఎట్ట‌కేల‌కు మంత్రివ‌ర్గ స‌మావేశానికి కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఆమోదం తెలిపింది. కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అయితే, రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎల్వీ సుబ్ర‌మ‌ణ్యం అధ్య‌క్ష‌త‌న స్క్రీనింగ్ క‌మిటీ ఆమోదించిన అంశాలకే ప‌రిమితం కావాల‌ని స్ప‌ష్టం చేసింది. నాలుగు అంశాల పైన మాత్ర‌మే ఈ స‌మావేశంలో చ‌ర్చ‌కు లోబ‌డి ఉండాలి. ఇత‌ర‌త్రా నిర్ణ‌యాలు..స‌మీక్ష‌లు చేయ‌టానికి వీలు లేదు.

సీఎం..సీఎస్ క‌లిసిన త‌రువాతే..
ముఖ్య‌మంత్రి ప‌ది రోజుల క్రితం ఎట్టి ప‌రిస్థితుల్లోనూ మంత్రి వ‌ర్గ స‌మావేశం నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. ఈ మేర‌కు ముఖ్య‌మంత్రి కార్యాల‌యం నుండి రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వ‌ద్ద‌కు నోట్ వెళ్లింది. కోడ్ అమ‌ల్లో ఉండ‌టంతో ముందుగానే అజెండా ఫిక్స్ చేసి ఎన్నిక‌ల సంఘానికి పంపాల్సి ఉంటుంద‌నే విషయాన్ని సీఎస్ స్ప‌ష్టం చేయ‌టంతో అజెండా ఖ‌రారు చేసారు. అందులో నాలుగు అంశాల‌ను ప్ర‌తిపాదించారు. ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి కేబినెట్ నిర్వ‌హ‌ణ‌కు అనుమ‌తి ఇవ్వాల‌ని అభ్య‌ర్దించారు. ఉద‌యం సీఎస్‌..సీఎం భేటీ త‌రువాత కేబినెట్ స‌మావేశానికి సంబంధించి కేంద్ర ఎన్నిక‌ల సంఘంతో సంప్ర‌దింపులు ప్రారంభ‌మ‌య్యాయి. ఫ‌లితంగా సాయంత్రానికి కేంద్ర ఎన్నిక‌ల సంఘం నుండి ఎట్ట‌కేల‌కు ఆమోదం తెలుపుతూ రాష్ట్ర ప్ర‌భుత్వానికి స‌మాచారం పంపింది.

CEC permitted AP Cabinet meet with conditions to follow in code time

మ‌ధ్నాహ్నం మూడు గంట‌ల‌కు భేటీ
కేబినెట్ స‌మావేశానికి ఆల‌స్యంగా అనుమ‌తి రావ‌టంతో తొలుత 14వ తేదీ ఉద‌యం 10.30 గంట‌ల‌కు నిర్వ‌హించాల్సిన స‌మావేశాన్ని మ‌ధ్నాహ్నం 3 గంట‌ల‌కు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. స‌మావేశం నిర్వ‌హ‌ణ‌కు అనుమ‌తి ఇస్తూనే ఎన్నిక‌ల సంఘం నిబంధ‌న‌లను స్ప‌ష్టం చేసింది. తాగునీటి ఎద్ద‌డి, వాతావ‌ర‌ణ స‌మస్య‌లు, ఫొనీ తుఫాను ప్ర‌భావం, ఉపాధి హామీ వంటి అంశాల పైనే మాత్ర‌మే చ‌ర్చ‌కు ప‌రిమితం కావాల‌ని కేబినెట్ స‌మావేశానికి అనుమ‌తి ఇస్తూ కేంద్ర ఎన్నిక‌ల సంఘం స్పష్టం చేసింది. ఈ నాలుగు శాఖ‌ల‌కు చెందిన అధికారులు మాత్ర‌మే ఈ స‌మావేశానికి మంత్రుల‌తో పాటుగా హాజ‌ర‌వుతారు. ఇత‌ర అంశాల పైన మంత్రులు చ‌ర్చించుకున్నా..అధికారులు మాత్రం హాజ‌ర‌వవ్వ‌రు. విధాన ప‌ర‌మైన నిర్ణ‌యాలకు అవ‌కాశం లేదు. ఇక‌, అధికారుల‌తో ఏర్ప‌డిన వివాదం పైన బిజిన‌స్ రూల్స్ పైనా చ‌ర్చించే ఛాన్స్ ఉంది. కేబినెట్ స‌మావేశానికి హాజ‌రు కావాల‌ని మంత్రులంద‌రికీ ప్ర‌భుత్వం నుండి స‌మాచారం అందించారు. ఇది ఈ ప్ర‌భుత్వ చివ‌రి కేబినెట్ స‌మావేశం.

English summary
Central Election Commission cleared permission for AP Cabinet meet. CEC says conditions apply when cabinet meet taken place in code time. AP Cabinet meet decided at conduct on 14th may at 3 pm.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X