• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఏపీలో ఇప్పట్లో కొత్త జిల్లాలు లేనట్టే.. కేంద్రం ఆ నిర్ణయంతో జాప్యం

|

ఇటీవల వరుస ఢిల్లీ పర్యటనలు చేసిన జగన్ కు కేంద్రం ఒక విషయంలో క్లారిటీ ఇచ్చింది. సీఎం జగన్ ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదన పోస్ట్ పోన్ చేసుకోవాలని చెప్పినట్టు విశ్వసనీయ సమాచారం . సీఎం జగన్ ఏపీలో ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా మార్చి అభివృద్ధి పథంలో నడిపించాలని భావించారు. అయితే ఆయన ఆలోచనకు కేంద్రం బ్రేకులు వేసింది.

సీఎం జగన్ కు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం ... స్టీఫెన్ రవీంద్రకు లైన్ క్లియర్

 ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై కేంద్రం నిర్ణయం

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై కేంద్రం నిర్ణయం

ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తే, ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా ఏర్పాటు చేస్తానని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు . ఇక ఎన్నికల్లో అధికారం హస్తగతం చేసుకున్న జగన్ హామీ నెరవేర్చేందుకు నిర్ణయం తీసుకుని ఈ నేపథ్యంలో ఇప్పటికే ఉన్న 13 జిల్లాలను 25 జిల్లాలుగా మార్చేందుకు అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేసి కేంద్రానికి సైతం పంపారు. కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్ వస్తే కొత్త జిల్లాల ఏర్పాటు జరుగుతుంది. అయితే ఈ విషయంలో కేంద్రం తొందరపడవద్దని చెప్పినట్టు సమాచారం .

 ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలతో పాటు మరో 12 కొత్త జిల్లాలు

ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలతో పాటు మరో 12 కొత్త జిల్లాలు

ఏపీలో ఇప్పటి వరకు ఉన్న 13 జిల్లాలతో పాటు కొత్తగా 12 జిల్లాలు ఏర్పాటు చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు . అనకాపల్లి (విశాఖ జిల్లా), అరకు (విశాఖ జిల్లా), అమలాపురం (తూర్పు గోదావరి), రాజమండ్రి (తూర్పు గోదావరి), నరసాపురం (పశ్చిమగోదావరి), విజయవాడ (కృష్ణా జిల్లా), నర్సరావుపేట (గుంటూరు జిల్లా), బాపట్ల (గుంటూరు జిల్లా), తిరుపతి (చిత్తూరు జిల్లా), రాజంపేట (కడప జిల్లా),నంద్యాల (కర్నూలు జిల్లా), హిందూపురం (అనంతపురం జిల్లా) లను అదే విధంగా అరకుతో పాటు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను కలుపుతూ మరో గిరిజన జిల్లాను ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో కూడా జగన్ ఉన్నట్టు తెలుస్తోంది.

కొత్త జిల్లాల ఏర్పాటుకు ఏడాది ఆగాలన్న కేంద్రం

కొత్త జిల్లాల ఏర్పాటుకు ఏడాది ఆగాలన్న కేంద్రం

పరిపాలనా సౌలభ్యం కోసమే జగన్ తెలంగాణా రాష్ట్రం తరహా చిన్న జిల్లాల వైపు మొగ్గు చూపారు. అయితే 2021 మార్చి 31వ తేదీ వరకు రాష్ట్రంలో ఎలాంటి మార్పులు చేయరాదని స్పష్టం చేసింది కేంద్రం . దేశవ్యాప్తంగా జాతీయ పౌర పట్టిక (ఎన్పీఆర్) చేపడుతుండడం తో మీరు చేపట్టాల్సిన కొత్త జిల్లాలను ఇప్పుడే వద్దని పరోక్షంగా తెలిపినట్లు సమాచారం.ఈ జనవరి 1వ తేదీ నుంచే దేశ వ్యాప్తంగా ఎన్పీఆర్ అమలు చేస్తుండడంతో ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాలు ఏర్పాటుచేస్తే వివరాల సేకరణ కు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో కేంద్రం ఆ విధంగా చెప్పినట్టు తెలుస్తోంది.

  BJP Kanna Lakshminarayana Press Meet About YS Jagan Delhi Tour | Oneindia Telugu
  దేశవ్యాప్తంగా ఎన్పీఆర్ చేపట్టటమే కారణం

  దేశవ్యాప్తంగా ఎన్పీఆర్ చేపట్టటమే కారణం

  2021 జనాభా లెక్కల్లో భాగంగా హౌసింగ్ లిస్ట్ ఆపరేషన్ తో పాటు ఎన్పీఆర్ ను అప్ డేట్ చేస్తున్న నేపధ్యంలోనే కేంద్రం ఈ విధంగా చెప్పినట్టు తెలుస్తుంది. దీంతో జగన్ ఎన్నికల హామీలలో ఒకటైన కొత్త జిల్లాల ఏర్పాటుకు మరికొంత కాలం పట్టే అవకాశం కనిపిస్తుంది. అంటే 2021 మార్చి 31వ తర్వాత కొత్త జిల్లాలను ఏర్పాటు చేసుకోవచ్చని చెప్పినట్టు సమాచారం . సాధ్యమైనంత త్వరగా కొత్త జిల్లాలను ఏర్పాటు చెయ్యాలని జగన్ ప్రయత్నం చేస్తుంటే కేంద్రం జగన్ ఆలోచనకు బ్రేక్ వేసిందని తెలుస్తుంది.

  English summary
  The Center has made it clear that no changes will be made in the state till March 31, 2021. With the implementation of the National Citizen's Charter (NPR) across the country, the new districts that you have undertaken are to postpone for now indirectly informed..
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more