వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబుకు షాక్ ఇచ్చిన కేంద్రం ... రాజధాని వ్యవహారంలో జోక్యం కష్టమే.. తేల్చేసిందిలా !!

|
Google Oneindia TeluguNews

టీడీపీ అధినేత చంద్రబాబుకు కేంద్రం షాక్ ఇచ్చిందా ? రాజధాని వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పిందా ? రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోనిదని హైకోర్టులో కేంద్రం కౌంటర్ వేయడంతో రాజధాని విషయంలో జోక్యం చేసుకోలేమని,చేతులు దులుపుకున్నట్టే అని తేల్చేసిందా ? అంటే అవును అనే సమాధానమే వస్తుంది.

బాబు బాటలో వైసీపీ సోషల్ మీడియా ఉద్యమం .. చంద్రబాబు త్వరగా కోలుకోవాలని ... ట్వీట్స్ వైరల్బాబు బాటలో వైసీపీ సోషల్ మీడియా ఉద్యమం .. చంద్రబాబు త్వరగా కోలుకోవాలని ... ట్వీట్స్ వైరల్

రాజధాని వ్యవహారంలో కేంద్రం షాకింగ్ ట్విస్ట్ .. బాబుకు షాక్

రాజధాని వ్యవహారంలో కేంద్రం షాకింగ్ ట్విస్ట్ .. బాబుకు షాక్

మొదటి నుంచి రాజధాని వ్యవహారంలో బిజెపి రాష్ట్ర నాయకత్వం పోరాటం సాగిస్తున్నా,కేంద్ర నాయకత్వం మాత్రం సైలెంట్ గా చూస్తోంది. ఇక తాజాగా రాజధాని అంశం తమ పరిధిలోది కాదని ఏకంగా కోర్టులోనే కౌంటర్ వేసింది. చంద్రబాబు నాయుడు రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరిన 24 గంటలు ముగియకముందే కేంద్రం తన వైఖరిని స్పష్టం చేసింది.

కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరిన బాబు .. 24 గంటల్లోనే

కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరిన బాబు .. 24 గంటల్లోనే

మూడు రాజధానుల విషయంలో వైసిపి ఎమ్మెల్యేలు రాజీనామా చేసి, అసెంబ్లీని రద్దు చేసి, ఎన్నికలకు వెళ్లాలని, ప్రజల మద్దతు వారికి లభిస్తే రాజధాని విషయంలో తామేమీ మాట్లాడమని టిడిపి అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. 48 గంటల టైం కూడా ఇచ్చారు. అయినప్పటికీ వైసిపి దీనిపై స్పందించలేదు. దీంతో 48 గంటల తర్వాత ద్రోహులను నడిరోడ్డుపై నిలబెడతానన్న చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టి మరి కేంద్రం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 24 గంటలు కాకముందే కేంద్రం నుండి సమాధానం వచ్చింది.

ఆ అఫిడవిట్ తో కేంద్రం వైఖరి స్పష్టం

ఆ అఫిడవిట్ తో కేంద్రం వైఖరి స్పష్టం

అమరావతి శంకుస్థాపన కు నీళ్లు,మట్టి అందించిన కేంద్ర ప్రభుత్వం, అమరావతి నిర్మాణానికి నిధులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం, రాజధాని అమరావతి తరలిపోకుండా కాపాడవలసిన బాధ్యత ఉంది అని చంద్రబాబు పేర్కొన్నారు. రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకో బోమని పదేపదే చెబుతున్నా, ఈ విషయంలో కేంద్రమే చొరవ చూపాలని ,ఇది ఒక ప్రత్యేకమైన ఈ సందర్భంగా భావించాలని చంద్రబాబు పదేపదే డిమాండ్ చేస్తూ వచ్చారు. కానీ కేంద్రం రాజధాని అంశంపై ఏపీ హైకోర్టు లో గురువారం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. తన వైఖరిని స్పష్టం చేసింది.

Recommended Video

Pydikondala Manikyala Rao: కరోనాతో మృతి చెందిన Former Minister & BJP Leader Manikyala Rao
 చంద్రబాబు డిమాండ్ కు గట్టిగానే 'కౌంటర్' ఇచ్చిన కేంద్రం

చంద్రబాబు డిమాండ్ కు గట్టిగానే 'కౌంటర్' ఇచ్చిన కేంద్రం

రాజధాని తుది నిర్ణయం రాష్ట్ర పరిధిలోకి వస్తుందని తేల్చిచెప్పింది. రాజధాని నిర్ణయంతో ఎలాంటి పాత్ర లేదని చట్టసభల్లో సభ్యుల మధ్య జరిగిన చర్చ కోర్టులో న్యాయ సమీక్ష పరిధిలోకి రాదని కేంద్రహోంశాఖ దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్లో స్పష్టంగా చెప్పింది. ప్రస్తుతం ఈ కౌంటర్ అఫిడవిట్ ఏపీలో అధికార పార్టీకి బలాన్ని ఇవ్వగా, ప్రతిపక్ష పార్టీ టీడీపీకి, అలాగే రాజధాని అమరావతి కోసం పోరాటం చేస్తున్న బిజెపి, జనసేన వంటి పార్టీలకు షాకింగ్ అనే చెప్పాలి. మొత్తానికి కేంద్రం జోక్యం చేసుకోవాలని చంద్రబాబు కేంద్రాన్ని కోరిన 24 గంటల్లోనే చంద్రబాబు డిమాండ్ కు కేంద్రం నుండి సమాధానం రానే వచ్చింది. చంద్రబాబు కు గట్టి షాక్ ఇచ్చింది.

English summary
Within 24 hours of Chandrababu Naidu 's request for the Center to intervene in the matter of the capital, the Center clarified its position and Gave a strong shock to Chandrababu. The counter affidavit filed by the Union Home Ministry made it clear it is purely under the state government , that the discussion between the members of the legislature would not come under the purview of judicial review in court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X