వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దిశా చట్టం 2019 బిల్లును వెనక్కు పంపి ట్విస్ట్ ఇచ్చిన కేంద్రం..రీజన్ ఇదే

|
Google Oneindia TeluguNews

Recommended Video

Day Light Report : 3 Minutes 10 Headlines | Shaheen Bagh Issue | Delhi polls | Nirbhaya case

ఏపీ సీఎం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన చట్టం దిశ చట్టం 2019. తెలంగాణలో వెటర్నరీ డాక్టర్ దిశ సామూహిక అత్యాచారం, హత్య ఘటన తర్వాత ఇలాంటి ఘాతుకాలకు చెక్ పెట్టాలని ముందుగా స్పందించింది ఏపీ ప్రభుత్వం . అందుకే దిశా చట్టాన్ని తెచ్చి అత్యాచారాలకు పాల్పడి, హత్యలు చేసేవారికి కఠిన శిక్షలు అమలు చేసేలా నిర్ణయం తీసుకుంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి మహిళల రక్షణ కోసం తీసుకున్న ఈ నిర్ణయం , చేసిన ఈ చట్టం పలువురి ప్రశంసలు పొందింది.

దిశా చట్టం తెచ్చిన ఏపీ సర్కార్ కు కేంద్రం ట్విస్ట్

దిశా చట్టం తెచ్చిన ఏపీ సర్కార్ కు కేంద్రం ట్విస్ట్

రోజురోజుకీ పెరిగిపోతున్న అత్యాచారాలకు అడ్డుకట్ట వేసే పనిలో ఏపీ సర్కార్ దిశా చట్టాన్ని తీసుకువచ్చింది . మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడిన నిందితులకు 21 రోజుల్లోనే కఠిన శిక్ష పడేలా ఈ చట్టాన్ని రూపొందించిన నేపధ్యంలో చట్టం అమలుకు చర్యలు కూడా మొదలు పెట్టిన సర్కార్ కు కేంద్రం ట్విస్ట్ ఇచ్చింది . ఇక ఆంధప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దిశ బిల్లు-2019ని కేంద్రానికి పంపిన విషయం తెలిసిందే .

బిల్లు వెనక్కు పంపిన కేంద్రం

బిల్లు వెనక్కు పంపిన కేంద్రం

అయితే ఈ బిల్లును కేంద్రం వెనక్కు పంపింది. ఈ బిల్లులో కొన్ని సాంకేతిక లోపాలు ఉన్నాయని వాటిని సరిచేసి తిరిగి పంపాలని కేంద్రం సూచించింది. ఈ దిశ బిల్లులో పొందుపరచిన 7వ షెడ్యూల్‌లో ఎంట్రీలు సరిగాలేవని, వాటిని సరిచేసి పంపాలని కేంద్రం సూచనలు చేసినట్లు తెలుస్తోంది. కేంద్రం చెప్పిన సవరణల్ని సరిచేసే పనిలో ఏపీ అధికారులు నిమగ్నమయ్యారు .

ప్రస్తుతం ప్రభుత్వ అధికారులు ఈ బిల్లులో కేంద్రం సూచించిన సవరణలు చేస్తున్నారు.

సవరణలు చేసి తిరిగి కేంద్రానికి పంపనున్న ఏపీ ప్రభుత్వం

సవరణలు చేసి తిరిగి కేంద్రానికి పంపనున్న ఏపీ ప్రభుత్వం

కేంద్రం సూచించిన సమస్యను పరిష్కరించి తిరిగి బిల్లును కేంద్రానికి పంపుతారు. కేంద్రం ఆమోదం పొందిన తరువాత బిల్లును రాష్ట్రపతి కార్యాలయానికి పంపుతారు. అక్కడ రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత దిశ యాక్ట్ అమలులోకి వస్తుంది. ఇక ఈనెల 7 వ తేదీన జగన్ రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్, వన్ స్టాప్ సెంటర్ లను ప్రారంభించబోతున్నారు సీఎం జగన్ . నిర్భయ కంటే పటిష్టమైన చట్టంగా ఏపీ సర్కార్ చెప్తున్న ఈ చట్టం ఆమోదం పొందే సరికి ఎంత కాలం పడుతుందో వేచి చూడాలి.

English summary
The Disha Act bill back to the ap government from the the center. The Center has suggested that there are some technical flaws in the bill and that they should be rectified. It seems that the Center has indicated that the entries in the 7th Schedule of this Bill are incorrect and that they should be corrected. AP officials are engaged in the amendments outlined by the Center.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X