వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జోక్యం చేసుకోం.. పన్నీర్-శశికళ 'వార్'లో బీజేపీ ప్రమేయం లేదు: వెంకయ్య

శశికళ, పన్నీర్‌సెల్వం మధ్య తలెత్తిన వివాదంలో కేంద్రం పాత్ర లేదని వెంకయ్య తేల్చి చెప్పారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తమిళ పాలిటిక్స్ రాజకీయ సంక్షోభం దిశగా సాగుతోన్న నేపథ్యంలో కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు దీనిపై స్పందించారు. ముఖ్యంగా ఈ మొత్తం సంక్షోభానికి బీజేపీయే కారణమన్న వాదనలు వినిపిస్తున్న తరుణంలో.. శశికళ, పన్నీర్‌సెల్వం మధ్య తలెత్తిన వివాదంలో కేంద్రం పాత్ర లేదని వెంకయ్య తేల్చి చెప్పారు.

తమిళనాడులో పరిస్థితులను ఆ రాష్ట్ర గవర్నర్ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని అన్నారు.
మీడియా కథనాలను, అధికారుల సమాచారాన్ని బేరీజు వేసుకుని వాస్తవ పరిస్థితులను సమీక్షిస్తున్నామని వెంకయ్య చెప్పారు. గవర్నర్ ఏ నిర్ణయం తీసుకున్నా.. రాజ్యాంగానికి లోబడి మాత్రమే జరుగుతుందని స్పష్టం చేశారు.

Center is not intevening in tamilnadu issues says venkaiah naidu

తమిళనాడు రాజకీయ సంక్షోభంలో ఎవరిని కించపరచాలనేది తమ ఉద్దేశ్యం కాదని, అన్నాడీఎంకె అంతర్గత వ్యవహారాలపై తాను స్పందించాలనుకోవడం లేదని తెలిపారు. న్యాయ నిపుణుల సలహా తీసుకుని రాజ్యాంగానుసారమే గవర్నర్ విద్యాసాగర్ రావు నిర్ణయం తీసుకుంటారని వెంకయ్య పేర్కొన్నారు.

గవర్నర్ మీద కొంతమంది తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, సరైన సమయంలో ఆయన సరైన నిర్ణయం తీసుకుంటారని, మొత్తం వ్యవహారంలో కేంద్రం జోక్యం చేసుకోబోదని వెంకయ్య య మీడియాకు వివరించారు.

గవర్నర్‌పై ఒత్తిడేమి లేదు:రాజ్‌నాథ్

తమిళనాడు రాజకీయ సంక్షోభంలో కేంద్రం పాత్ర ఏమి లేదని కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. తమిళనాట సంక్షోభానికి సంబంధించి గవర్నరే అంతిమ నిర్ణయం తీసుకుంటారని, ఆయనపై తాము ఎలాంటి ఒత్తిడి తీసుకురావడం లేదని చెప్పారు.

English summary
Central Minister Venkaiah Naidu responded on Tamilnadu Political crisis. He condemned the allegation on BJP for this crisis
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X