వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీపై కేంద్రం దృష్టి పెట్టకుంటే ప్రజల ప్రాణాలు గాల్లోనే : మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ దేశంలో తీవ్రంగా మారుతున్న నేపధ్యంలో దేశం షట్ డౌన్ అయ్యింది . ఇక కరోనా ప్రబలుతున్న దృష్ట్యా దానిని కంట్రోల్ చెయ్యటం కోసం తెలుగు రాష్ట్రాల్లోనూ సీఎంలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇప్పుడు జగన్ తీసుకున్న నిర్ణయంపై టీడీపీ నేతల నుండి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇక టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు కరోనా విషయంలో జగన్ సర్కార్ తీరును తప్పు పట్టారు.

కరోనా భయం ... ఎటైనా వెళ్లి వచ్చారా .. అయితే గ్రామాల్లో నో ఎంట్రీ కరోనా భయం ... ఎటైనా వెళ్లి వచ్చారా .. అయితే గ్రామాల్లో నో ఎంట్రీ

జగన్ గారిది క్రూరమైన మనస్తత్వం అని అయ్యన్న పాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు . కావాలనే ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి అడ్డదారిలో స్థానిక సంస్థలు కైవసం చేసుకోవడానికి జగన్ ప్రయత్నం చేశారని చెప్పారు. ఇక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన జగన్ కరోనా ప్రభావం ఏపీ పై లేదని తప్పు దారి పట్టించే యత్నం చేశారని మండిపడ్డారు.కరోనా ప్రభావం లేదు అని సుప్రీంకోర్టుని కూడా తప్పుదోవ పట్టించాలని చూశారని విమర్శలు గుప్పించారు.

Center need to focus on the lives of ap people : former Minister ayyanna pathrudu

ఇక కరోనా ప్రభావంతో ఎన్నికలను వాయిదా వేస్తే ఆఖరికి సీఎస్ ని బెదిరించి బలవంతంగా కరోనా లేదు అంటూ లేఖ రాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో మొట్టికాయి పడ్డాక నిజాలు బయటపెట్టారని వ్యాఖ్యానించారు అయ్యన్న పాత్రుడు . ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా ని అరికట్టే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని పేర్కొన్నారు. ఇప్పుడు పరిస్థితి ఇలా ఉంటె కరోనా ఎఫెక్ట్ లేదని జగన్ వ్యాఖ్యానించటం దారుణం అని పేర్కొన్నారు. ఇక కేంద్రం ఏపీలో జరుగుతున్న పరిణామాలపై దృష్టి పెట్టక పోతే ప్రజల ప్రాణాలు జగన్ గాల్లో కలిపేయడం ఖాయం అని అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యానించారు.

English summary
tdp leader former minister ayyanna pathrudu said the Andhra Pradesh government had acted negligently to curb corona. Now Jagan has said that it is not going to effect on AP. If the center does not focus on what is happening in the AP, people's lives are in the air.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X