వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు పోరాటం చేసినా రాని ప్రత్యేక హోదా జగన్ అడిగితే వస్తుందా ? ఇవ్వమని కేంద్రం తేల్చేసిందిగా !!

|
Google Oneindia TeluguNews

Recommended Video

జగన్ ప్రత్యేక హోదా అడగడానికి రీజన్ అదేనా..?? || Why AP CM Jagan Thoroughly Asking For Special Status

ఏపీకి ప్రత్యేక హోదా ఒక ముగిసిన అధ్యాయం అని, ప్రత్యేక హోదా మినహాయించి ఏపీ అభివృద్ధి చేయడానికి కేంద్రం సుముఖంగా ఉందని ఇప్పటికే పలుమార్లు కేంద్ర సర్కార్ కరాఖండిగా తేల్చి చెప్పింది. అయినప్పటికీ ప్రత్యేక హోదా సాధిస్తాం అన్న నినాదంతో ఏపీలో అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కేంద్ర సర్కార్ ను అభ్యర్థిస్తోంది. విన్నపాలు వినవలె అంటూ ప్రత్యేక హోదాపై విన్నపాలు చేస్తోంది.

<strong>జ‌గ‌న్‌లా నేను అడ్డంగా దొర‌క‌ను:పాలిచ్చే ఆవును వ‌ద‌లి..త‌న్నే..తెచ్చిపెట్టుకున్నారు: బాబు పైర్‌..!</strong>జ‌గ‌న్‌లా నేను అడ్డంగా దొర‌క‌ను:పాలిచ్చే ఆవును వ‌ద‌లి..త‌న్నే..తెచ్చిపెట్టుకున్నారు: బాబు పైర్‌..!

జగన్ ఢిల్లీ పర్యటనలో ప్రత్యేక హోదా కావాలని మోడీకి విన్నపం

జగన్ ఢిల్లీ పర్యటనలో ప్రత్యేక హోదా కావాలని మోడీకి విన్నపం

ఢిల్లీ పర్యటనకు వెళ్లిన జగన్ తన పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీని, అమిత్ షా ను కలిసారు. అంతేకాకుండా కేంద్రంలోని కీలక మంత్రులను సైతం కలిసిన జగన్ అక్కడ ప్రత్యేక హోదా పాట పాడుతున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వండి. ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా రాష్ట్రాన్ని విభజించారు కాబట్టి రాష్ట్ర ఆర్థిక, పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేక హోదా ఎంతో అవసరం. రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతగానో నష్టపోయింది. విభజన కారణంగా రాష్ట్ర ఆదాయానికి గండిపడింది. 2014-15 నాటికి రూ.97వేల కోట్లు ఉన్న అప్పులు 2018-19 నాటికి రూ.2.58లక్షల కోట్లుకు చేరాయి. అప్పుల రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తయారైంది. వెనుకబడిన 7 జిల్లాలకు ఆరేళ్ల కాలానికి యాభై కోట్ల చొప్పున ఇప్పటికి రూ.2100 కోట్లు అందాల్సి ఉండగా, రూ.1050 కోట్లు మాత్రమే విడుదలచేశారు.వెనుకబడిన జిల్లాల అభివృద్ధికోసం కేబీకే తరహాలో నిధులు ఇవ్వండి అంటూ ఒకటి కాదు రెండు కాదు వివిధ అంశాలలో కేంద్ర సహాయంపై తన అభ్యర్ధనల చిట్టా ప్రధాని నరేంద్ర మోడి ముందు అలాగే కేంద్ర పెద్దల ముందు పెట్టారు.

ప్రత్యేక హోదా సాధిస్తారనే జగన్ కు పట్టం కట్టిన ఏపీ ప్రజలు

ప్రత్యేక హోదా సాధిస్తారనే జగన్ కు పట్టం కట్టిన ఏపీ ప్రజలు

ప్రత్యేక హోదా అంశం పట్టించుకునే పరిస్థితి లేదు అనే విషయం ఇప్పటికే కేంద్రం అందరికీ అర్థమయ్యేలా చెప్పింది. ఇప్పుడు జగన్ పదే పదే అడిగినప్పటికీ ప్రత్యేక హోదా ఇస్తారని గ్యారంటీ మాత్రం లేదు.
జగన్ పదే పదే ప్రత్యేక హోదా కావాలని ఎందుకు అడుగుతున్నారు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విభజన తర్వాత ఏపీ ప్రజలు ప్రధాన డిమాండ్ ప్రత్యేక హోదా. తాము అధికారంలోకి వస్తే కచ్చితంగా ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పిన జగన్ కు ఏపీ ప్రజలు పట్టం కట్టారు. జగన్ కార్యసాధకుడు అని నమ్మారు. ఇక జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం రెండు సార్లు ప్రత్యేక హోదా ఇవ్వమని తేల్చి చెప్పింది. లిఖితపూర్వకంగా కూడా ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని ప్రకటించింది. ఇక ఈ సమయంలో ప్రజలందరు జగన్ తీసుకునే నిర్ణయం పైన ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయినప్పటికీ జగన్ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలగకుండా కేంద్రంతో సయోధ్య తో మెలుగుతూనే ప్రత్యేక హోదా సాధించాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది సాధ్యం కాదనే విషయం జగన్ కు కూడా తెలుసని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రత్యేక హోదా ఇవ్వమని తేల్చేసిన కేంద్రం .. అయినా ఈ కారణంతోనే జగన్ ప్రయత్నం

ప్రత్యేక హోదా ఇవ్వమని తేల్చేసిన కేంద్రం .. అయినా ఈ కారణంతోనే జగన్ ప్రయత్నం

ఇప్పటికే లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ ప్రత్యేక హోదా రాదన్న విషయం ఎన్నికలకు ముందే జగన్ కు తెలుసని కేవలం రాజకీయం కోసమే ప్రత్యేక హోదా అంశాన్ని రాజకీయ పార్టీలు వాడుకుంటున్నారని పేర్కొన్నారు. ఇక జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా సాధించాలంటే ప్రజా ఉద్యమమే మార్గమని, ప్రజల్లో ఉన్న భావోద్వేగాలే ప్రత్యేక హోదా సాధించడానికి ఆయుధమని ఇప్పటికే పలుమార్లు పేర్కొన్నారు. ఇక గతంలో అధికారంలో ఉన్న టీడీపీ ని జగన్ పలుమార్లు ప్రత్యేక హోదా విషయంలో ఇరకాటంలో పెట్టారు. ఇదే సమయంలో ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా అంశాన్ని విస్మరిస్తే ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది కాబట్టి కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వదు అని తెలిసినప్పటికీ జగన్ పదేపదే ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నారు.

టీడీపీ బీజేపీకి మధ్య వైరుధ్యం ప్రత్యేక హోదా కోసమే .. ప్రయత్న లోపం లేదని తెలిపేందుకే జగన్ ప్రత్యేక హోదా విన్నపం

టీడీపీ బీజేపీకి మధ్య వైరుధ్యం ప్రత్యేక హోదా కోసమే .. ప్రయత్న లోపం లేదని తెలిపేందుకే జగన్ ప్రత్యేక హోదా విన్నపం

అడిగిన వెంటనే ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం ఉంటే గత ప్రభుత్వంలో ఉన్న టిడిపి, బిజెపితో స్నేహ సంబంధాలు నెరపింది. చాలాసార్లు ప్రత్యేక హోదా కావాలని కేంద్రానికి అర్థమయ్యేలా చంద్రబాబు విన్నపాలు చేశారు. అయినప్పటికీ కేంద్రం స్పందించలేదు. కేవలం ప్రత్యేక హోదా ఇవ్వలేదు అన్న కారణంతోనే చంద్రబాబు బీజేపీతో దోస్తీకి కటీఫ్ చెప్పి పోరు బాట పట్టారు. చంద్రబాబు అంత ప్రయత్నం చేసిన సాధ్యం కాని ప్రత్యేక హోదా, పోరాడినా ప్రకటించని ప్రత్యేక హోదా ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డి అడిగితేనే కేంద్రం ఇస్తుందా అంటే ఇవ్వటం సాధ్యం కాదని కచ్చితంగా చెప్పొచ్చు. అయినా జగన్ ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా ప్రత్యేక హోదా ఇవ్వండి మహాప్రభో అంటూ కేంద్రాన్ని కోరుతున్నారు. కారణం ప్రత్యేక హోదా కోసం ఏపీ సీఎం జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు అన్న సంకేతాలు ప్రజల్లోకి వెళితే ప్రజల్లో జగన్ సర్కార్ పై వ్యతిరేకత రాకుండా ఉంటుంది. అందుకే రాదని తెలిసినా జగన్ ప్రత్యేక హోదా కావాలని కేంద్రాన్ని పదేపదే కోరుతున్నారు అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం .

English summary
The Central government has already stated that the special status of the AP is a closed chapter and the Center is willing to develop the AP apart from the special status. However, Jagan government, who came to power in the AP with the slogan of 'special status', is requesting the central government to grant special status. He Appeals on special status in his delhi tour.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X