వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో అణు విద్యుత్ కేంద్రం .. శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలో ఏర్పాటు పనులపై కేంద్రం వివరణ

|
Google Oneindia TeluguNews

ఏపీలో అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటుపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా పార్లమెంట్ వేదికగా ఈ ప్రకటన చేసిన కేంద్రం అణు విద్యుత్ కేంద్ర ఏర్పాటుకు సంబంధించిన వివరాలను పేర్కొంది.

ఏపీలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు .. శరవేగంగా నిర్ణయాలు .. కేంద్రం వద్ద పావులు కదపనున్న జగన్ సర్కార్ఏపీలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు .. శరవేగంగా నిర్ణయాలు .. కేంద్రం వద్ద పావులు కదపనున్న జగన్ సర్కార్

కొవ్వాడలో అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు

కొవ్వాడలో అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు

శ్రీకాకుళం జిల్లా కొవ్వాడ వద్ద అణు విద్యుత్ కేంద్ర ఏర్పాటు చేయనున్నట్లుగా కేంద్రం తెలిపింది. దీనికోసం అమెరికాకు చెందిన వెస్టింగ్ హౌస్ ఎలక్ట్రిక్ కంపెనీతో చర్చలు జరుపుతున్నట్లు గా కేంద్రం పేర్కొంది. అణు విద్యుత్ కేంద్ర ఏర్పాటులో భాగంగా 1,208 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఆరు అణు రియాక్టర్లను ఏర్పాటుచేయనున్నట్లుగా పేర్కొంది. అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయడానికి కావలసిన అన్ని రకాల అధ్యయనాల తర్వాతనే కొవ్వాడ ప్రాంతాన్ని ఎంపిక చేసినట్లుగా కేంద్రం తెలిపింది.

అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు సూచించిన అర్హతల ప్రకారమే

అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు సూచించిన అర్హతల ప్రకారమే

అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు సూచించిన అర్హతల ప్రకారమే శ్రీకాకుళం జిల్లాలోని కొవ్వాడ ప్రాంతాన్ని ఎంపిక చేశామని కేంద్రం చెప్పింది. ఇప్పటికే భూసేకరణ పూర్తి చేసింది . గతంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మన దేశ పర్యటనకు వచ్చిన సందర్భంలో కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటుకు సంబంధించిన అంశం చర్చకు వచ్చినట్లుగా సమాచారం. ఈ క్రమంలోనే ప్లాంట్ నిర్మాణానికి త్వరలో చర్యలు ప్రారంభించడానికి ఉభయ దేశాలకు చెందిన ప్రతినిధుల మధ్య అంగీకారం కుదిరిందని, ఈ సంవత్సరం శంకుస్థాపన జరిగే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి.

Recommended Video

Intra-Afghan Talks : ఇంట్రా-ఆఫ్ఘన్ చర్చల ప్రారంభానికి హాజరైన భారత విదేశాంగ మంత్రి S Jaishankar
61 వేల కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు .. త్వరలో ఏర్పాటు

61 వేల కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు .. త్వరలో ఏర్పాటు

అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు శంకుస్థాపనకు ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే అవకాశం ఉందని కూడా ఉన్నతాధికారులు చెప్పినట్టు సమాచారం . అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయడానికి ఇప్పటికే 2,700 ఎకరాలను సేకరించారు. నిర్మాణంలో భాగంగా ఆరు అణు రియాక్టర్లను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కొక్క అణురియాక్టర్ 1208 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంటుందని , ఒక మెగావాట్ కు పది కోట్ల రూపాయల చొప్పున, మొత్తంగా 61 వేల కోట్ల అంచనాలతో ప్రతిపాదనలను రూపొందించారు. ఈ సంవత్సరం శంకుస్థాపన జరిగితే వచ్చే ఐదేళ్లలో అణు విద్యుత్ కేంద్రం నిర్మాణం జరుగుతుందని సమాచారం.

English summary
The central government has announced that a Kovvada Atomic Power Project will be set up in AP. The statement was made by TDP MP Kanakamedala Ravindra Kumar in response to a question on setting up of Atomic Power Project. The Center has said that a Kovvada Atomic Power Project plant works are in progress .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X