వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలవరంపై జగన్ సర్కార్ కు కేంద్రం షాక్ .. నిర్మాణానికే నిధులు , పునరావాసానికి కాదు

|
Google Oneindia TeluguNews

పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం ఏపీ ప్రభుత్వానికి షాక్ ఇస్తోంది. పోలవరం ప్రాజెక్టు పై ఆర్టీఐ ద్వారా సమాచారం కోరగా పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలవరం డ్యామ్ నిర్మాణానికి మాత్రమే నిధులు ఇస్తామని, అది కూడా 2013 -14 లో పేర్కొన్న అంచనాల మేరకే చెల్లిస్తామని కేంద్రం పేర్కొంది. ఇక పోలవరం భూ నిర్వాసితులకు పునరావాసం విషయంలో తమకు ఎలాంటి సంబంధం లేదని కేంద్రం తేల్చి చెప్పింది. దీంతో ఏపీ సర్కార్ దిక్కుతోచని పరిస్థితిలో పడింది.

బాబు ప్రభుత్వ తప్పిదాల వల్లే పోలవరం ప్రాజెక్ట్ నిధులకు కేంద్రం కొర్రీలు: మంత్రి అనిల్ కుమార్ యాదవ్బాబు ప్రభుత్వ తప్పిదాల వల్లే పోలవరం ప్రాజెక్ట్ నిధులకు కేంద్రం కొర్రీలు: మంత్రి అనిల్ కుమార్ యాదవ్

పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కీలక నేతలతో సీఎం భేటీ

పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కీలక నేతలతో సీఎం భేటీ

ఎలాగైనా పోలవరం ప్రాజెక్టు నిధుల విషయంలో కేంద్రం తో ఏం మాట్లాడాలి ? ఎలా మాట్లాడాలి ? ఏ విధంగా నిధులు తీసుకోవాలి అనే అంశంపై నేడు సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. 2015 నుంచి ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నిమిత్తం నాబార్డ్ నుండి 8614.16 కోట్ల నిధులు వచ్చాయి. అందులో కేంద్ర ప్రభుత్వ నిధులు 950 కోట్లు కాగా, నాబార్డు నిధులు 7664.16 కోట్లు . కేంద్రం నుంచి పోలవరం ప్రాజెక్టుకు రావాల్సిన నిధులలో ప్రస్తుతానికి ఇంకా రూ. 2234.77 కోట్లు పెండింగ్‌ లో ఉన్నాయి.

పునరావాసంతో మాకు సంబంధం లేదంటున్న కేంద్రం ..

పునరావాసంతో మాకు సంబంధం లేదంటున్న కేంద్రం ..

ఇదిలా ఉంటే పోలవరం ప్రాజెక్టు కింద ముంపుకు గురవుతున్న గ్రామాల పునరావాసానికి 33 వేల కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేశారు . ఇప్పటివరకు పునరావాసం కోసం 19.85శాతం మాత్రమే పనులు పూర్తయ్యాయి. నిర్మాణానికి మాత్రమే నిధులు ఇస్తాం, పునరావాసం తో మాకు సంబంధం లేదు కేంద్రం స్పష్టంగా చెప్పడంతో ప్రస్తుతం పోలవరం నిర్మాణం క్వశ్చన్ మార్క్ గా మారింది. ఇప్పటివరకు పునరావాసానికి 3500 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారు. ఇంకా 29 వేల కోట్లకు పైగా పునరావాసం కోసం ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది.

 పునరావాసం కోసం 29 వేల కోట్ల ఆర్థిక భారాన్ని మోసే పరిస్థితిలో ఏపీ లేదు

పునరావాసం కోసం 29 వేల కోట్ల ఆర్థిక భారాన్ని మోసే పరిస్థితిలో ఏపీ లేదు

ఈ నేపథ్యంలో కేంద్రం చెప్పిన విషయం ఏపీ సర్కార్ కు ఏమాత్రం రుచించడం లేదు. 29 వేల కోట్ల ఆర్థిక భారాన్ని మోసే పరిస్థితిలో ఏపీ ప్రస్తుతం లేదు. దీంతో పోలవరం ప్రాజెక్టు పూర్తి నిర్మాణం ఖర్చును కేంద్రమే భరించాలని ఏపీ సర్కార్ డిమాండ్ చేస్తుంది . పోలవరం ప్రాజెక్ట్ మొత్తం ఖర్చును కేంద్రమే భరిస్తుందని పునర్విభజన చట్టంలో పేర్కొంది నాటి యూపీఏ ప్రభుత్వం. అంతేకాదు తదనంతర పునరావాస ఖర్చులు కూడా కేంద్రమే భరిస్తుందని పేర్కొంది.

Recommended Video

Polavaram Project Works Speedup | Godavari Water Flow Doing Its Bit
 యూపీఏ చెప్పిందొకటి .. ఎన్డీయే చేస్తుందొకటి

యూపీఏ చెప్పిందొకటి .. ఎన్డీయే చేస్తుందొకటి


రాష్ట్ర పునర్విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ సర్కార్ అది సాధ్యం కాదని, పోలవరం నిర్మాణానికి మాత్రమే నిధులు ఇస్తామని, పునరావాసం తో సంబంధం లేదంటూ ఏపీ ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. నిధుల ప్రస్తావన వచ్చిన ప్రతీసారి ఏదో ఒక కొర్రీలు పెడుతున్న పరిస్థితి ఉంది . ఇక ఈ నేపధ్యంలో పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ఏపీ సర్కార్ ఏం చెయ్యనుంది అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

English summary
The Center is giving a shock to the AP government over the Polavaram project. A number of key issues came to light with the RTI information on the Polavaram project. The Center has said that it will only fund the construction of the Polavaram Dam and that it will also pay as per the estimates quoted in 2013-14. The Center has stated that it has nothing to do with the resettlement of Polavaram flood affected villages rehabilitation. With this, the AP government fell into a dilemma.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X