అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబు ఫోన్ ట్యాపింగ్ ఫిర్యాదుపై స్పందించిన కేంద్రం: విచారణకు ఆదేశం

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఓటుకు నోటు వ్యవహారంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంభాణషలు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న సీఎం చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వంపై బుధవారం ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

ఈ ఫిర్యాదుపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. అంతేకాదు ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంపై శాఖాపరమైన విచారణకు కేంద్రం ఆదేశించింది. బుధవారం రాత్రి ప్రధాని కార్యాలయం నుంచి ఈ మేరకు ఆదేశాలు వెలువడినట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ అంశంపై ఏ శాఖ విచారణ చేపట్టాలనేది కూడా త్వరలో స్పష్టత రానుంది.

Center take action on Ap Cm Chandrababu phone tapping

ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంపై విచారణ కేంద్ర హోం శాఖ లేదా టెలికమ్యూనికేషన్లశాఖ చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ పెద్ద నేరమని ప్రధాని మోడీ, హోంశాఖ మంత్రి, రాష్ట్రపతితో ఏపీ చంద్రబాబు నాయుడు భేటీ అయి చర్చించిన సంగతి తెలిసిందే.

ఈ భేటీలో ఏపీ సీఎంతో సహా 120 మంది ప్రముఖుల ఫోన్లను తెలంగాణ ప్రభుత్వం ట్యాప్‌ చేసిందని, దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని దీనిపై విచారణ జరపాలని ప్రధాని మోడీని కోరారు. ఏపీ సీఎం చంద్రబాబు ఫిర్యాదు మేరకు, ఫోన్‌ట్యాపింగ్‌పై అంతర్గత విచారణ జరిపి, నివేదిక ఇవ్వాలని ప్రధాని కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ చేసింది.

English summary
Center take action on Ap Cm Chandrababu phone tapping.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X