వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీకి కొత్త గ‌వ‌ర్న‌ర్‌: జ‌గ‌న్‌కు స‌మాచారం ఇచ్చిన పీఎంఓ: స‌హ‌కారం అందేనా..!

|
Google Oneindia TeluguNews

ఏపీలో కొత్త గ‌వ‌ర్న‌ర్ నియ‌మితులు కానున్నారు. ఈ మేర‌కు ప్ర‌ధాని కార్యాల‌యం నుండి ముఖ్య‌మంత్రికి స‌మాచారం అందిన‌ట్లు స‌మాచారం. 2009 నుండి ఉమ్మ‌డి రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌గా న‌ర‌సింహ‌న్ కొన‌సాగుతున్నారు. రాష్ట్ర విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం ప‌దేళ్ల పాటు అంటే 2024 వ‌ర‌కు ఏపీ- తెలంగాణ‌కు ఉమ్మ‌డి గ‌వ‌ర్న‌ర్ ఉండాలి. అయితే, ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి త‌ర‌లి వెళ్ల‌టం.. రెండు ప్ర‌భుత్వాల మ‌ధ్య ఇప్పుడు స‌ఖ్య‌త వాతావ‌ర‌ణం ఉండ‌టంతో గ‌వ‌ర్న‌ర్ మార్పు దిశ‌గా కేంద్రం నిర్ణ‌యం తీసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది.

ఏపీ కొత్త గ‌వ‌ర్న‌ర్‌గా సుష్మా స్వ‌రాజ్‌...

ఏపీ కొత్త గ‌వ‌ర్న‌ర్‌గా సుష్మా స్వ‌రాజ్‌...

ఏపీ నూత‌న గ‌వ‌ర్న‌ర్‌గా సుష్మా స్వ‌రాజ్ నియామ‌కం ఖ‌రారైన‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. ప‌దేళ్ల కాలంలో న‌ర‌సింహ‌న్ గ‌వ‌ర్న‌ర్‌గా ఉన్నారు. అయితే, ఇప్పుడు రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగి అయిదేళ్లు పూర్త‌యింది. తెలంగాణ‌లో రెండో విడ‌త టీఆర్‌య‌స్ ప్ర‌భుత్వం..ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం ఏర్పాట‌య్యాయి. ఈ రెండు ప్ర‌భుత్వాల మ‌ధ్య స‌ఖ్య‌త ఏర్ప‌డింది. దీంతో పాటుగా ప‌దేళ్ల పాటు హైద‌రాబాద్ ఉమ్మ‌డి రాజ‌ధానిగా ఉన్న‌ప్ప‌టికీ..ఏపీలో కొత్త రాజ‌ధాని నిర్మాణం..అధికారిక కార్య‌క్ర‌మాలు అమ‌రావ‌తి నుండే నిర్వ‌హిస్తున్నారు. ఇక‌, కొత్త గ‌వ‌ర్న‌ర్ నియ‌మాకం పైన ఇద్ద‌రు ముఖ్య‌మంత్రుల‌తోనూ కేంద్ర ప్ర‌భుత్వం సంప్ర‌దింపులు జ‌ర‌ప‌గా..ఇద్ద‌రూ అంగీక‌రించినట్లు తెలుస్తోంది. దీంతో..కేంద్రంలో రెండో సారి అధికారంలోకి వ‌చ్చిన ప్ర‌ధాని మోదీ..బీజేపీ ముఖ్యుల‌ను ఇక్క‌డ గ‌వ‌ర్న‌ర్‌గా పంపాల‌ని నిర్ణ‌యించినట్లు స‌మాచారం. దీంతో..త్వ‌రలోనే కొత్త గ‌వ‌ర్న‌ర్ నియ‌మాకం పైన నిర్ణ‌యం జ‌ర‌గ‌నుంది

గ‌వ‌ర్న‌ర్‌గా స‌ష్మాస్వ‌రాజ్..జ‌గ‌న్‌కు స‌హ‌కారం అందేనా..

గ‌వ‌ర్న‌ర్‌గా స‌ష్మాస్వ‌రాజ్..జ‌గ‌న్‌కు స‌హ‌కారం అందేనా..

ఏపీ నూత‌న గ‌వ‌ర్న‌ర్‌గా సుష్మా స్వ‌రాజ్‌ను ఎంపిక చేసిన‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. బీజేపీలో సీనియ‌ర్ మ‌హిళా నేత గా ఉన్న సుష్మా స్వ‌రాజ్ తాజా ప్ర‌భుత్వంలో చేరలేదు. గ‌తంలో ఢిల్లీ ముఖ్య‌మంత్రిగా..సుదీర్ఘ కాలం కేంద్ర మంత్రిగా .. లోక్‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నేత‌గా.. గ‌త ప్ర‌భుత్వంలో విదేశాంగా మంత్రిగా సేవ‌లందించారు. ఇక‌, సుష్మా స్వరాజ్ లోక్‌స‌భ‌లో విప‌క్ష నేత‌గా ఉన్న స‌మ‌యంలోనే ఏపీ విభ‌జ‌న ప్ర‌క్రియ జ‌రిగింది. ఇక‌, ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ 2009లో ఎంపీగా ఎన్నికైన స‌మ‌యం నుండి సుష్మా స్వ‌రాజ్‌తో జ‌గ‌న్‌కు స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇక‌, ఇప్పుడు ఏపీ అభివృద్దికి ప్ర‌ధాని మోదీ ప‌దే ప‌దే హామీ ఇస్తున్నారు. ప్ర‌ధాని మోదీ..సీఎం జ‌గ‌న్ సైతం ప‌ర‌స్ప‌ర స‌హ‌క‌రాంతోనే ముందుకు వెళ్తామ‌ని స్ప‌ష్టం చేసారు. దీంతో వ్యూహాత్మ‌కంగానే ఈ ఎంపిక జ‌రిగినట్లు భావిస్తున్నారు.

న‌ర‌సింహ‌న్ ఎక్క‌డ‌కు..

న‌ర‌సింహ‌న్ ఎక్క‌డ‌కు..

ప్ర‌స్తుత గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో స‌మావేశం స‌మ‌యంలో గ‌వ‌ర్న‌ర్ మార్పు గురించి స్ప‌ష్ట‌త ఇచ్చిన‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. అయితే, ప్ర‌స్తుత గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ సేవ‌ల‌ను ఏ ర‌కంగా వినియోగిం చుకుంటార‌నేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దీంతో..ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు విడివిడిగా గ‌వ‌ర్న‌ర్ల‌ను నియ‌మిస్తా రా లేక ఇప్పుడున్న గవర్నర్ నరసింహన్‌ను తెలంగాణకు ప‌రిమితం చేస్తారా.. లేకుంటే ఇద్దర్నీ కొత్తవారినే కేంద్రం నియమిస్తుందా...అనేది తేలాల్సి ఉంది.

English summary
Central government decided to nominate new governor Andhra Pradesh. Communication received by AP CMO. Shortly Sushma Swaraj may appoint as Governor of AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X