వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీబీఐ అస్త్రానికి కేంద్రం సిద్దం?: బాబులో అలజడి, కర్ణాటక ఎన్నికల తర్వాత జరగబోయేది అదే?

|
Google Oneindia TeluguNews

Recommended Video

కర్ణాటక ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని తెలుగుదేశం నాయకుల పిలుపు

హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబుకు బీజేపీ భయం పట్టుకుందన్న ప్రచారం జరుగుతోంది. హోదాపై కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడుతున్న నేపథ్యంలో.. తనపై కక్ష సాధింపు చర్యలు ఖాయమని ఆయన భావిస్తున్నారట.

కర్ణాటక ఎన్నికల తర్వాత ఆ దిశగా కేంద్రం అడుగులు వేయవచ్చునని ఇప్పటికే టీడీపీ ప్రభుత్వానికి సమాచారం అందినట్టు తెలుస్తోంది. అందుకే కర్ణాటక ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని తెలుగుదేశం నాయకులు సైతం పిలుపునిస్తున్నారని పరిశీలకులు అంటున్నారు.

ముందే పసిగట్టిన బాబు

ముందే పసిగట్టిన బాబు

సీఎం చంద్రబాబు సైతం కేంద్రం తనపై కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని స్వయంగా పేర్కొన్న సంగతి తెలిసిందే. జనసేన అధినేత పవన్ కల్యాణ్, వైసీపీ బీజేపీతో కలిసి తనపై కుట్ర పన్నాయని ఆరోపించారు. తాను 'నిప్పు' లాంటి వాడిని అని ఆ సమయంలో మరోసారి స్పష్టం చేశారు.

బాబును ఉపేక్షించవద్దని..

బాబును ఉపేక్షించవద్దని..

మరోవైపు మంత్రి నారా లోకేష్, టీడీపీ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ చేసిన అవినీతి ఆరోపణలను రాష్ట్ర బీజేపీ నేతలు సైతం సమర్థించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పార్టీని దోషిగా నిలబెట్టేందుకు చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని, దీన్ని ఉపేక్షిస్తే మరింత డ్యామేజ్ తప్పదని బీజేపీ నేతలు కేంద్రానికి చెప్పినట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

 'పట్టిసీమ'పై సీబీఐ

'పట్టిసీమ'పై సీబీఐ

రాష్ట్ర బీజేపీ నేతల ఫిర్యాదులు, కేంద్రంపై టీడీపీ విమర్శల దాడి పెరిగిపోతున్న నేపథ్యంలో ఇక చంద్రబాబు పట్ల కఠినంగా వ్యవహరించడానికే కేంద్రం సిద్దపడిందని తెలుస్తోంది. ఇందులో భాగంగా పట్టిసీమ ప్రాజెక్టుపై సీబీఐ విచారణ కోసం పావులు కదుపుతున్నట్టుగా జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

పట్టిసీమ అవినీతిపై కాగ్ రిపోర్ట్

పట్టిసీమ అవినీతిపై కాగ్ రిపోర్ట్

పట్టిసీమ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని గతంలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సైతం అసెంబ్లీ సాక్షిగా ఆరోపణలు చేశారు. కేవలం మట్టి తవ్వకాలకే రూ.192కోట్లు వృథా చేశారని ఆరోపించారు.

దీనికి తోడు కాగ్(కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌) నివేదిక సైతం పట్టిసీమలో రూ.371కోట్లు దుర్వినియోగం అయినట్టు తెలిపింది. ఇక కాంట్రాక్టర్ల కోసమే పట్టిసీమ ప్రాజెక్టు నిర్మించారని వైసీపీ చేస్తున్న ఆరోపణల సంగతి తెలిసిందే.

కేబినెట్ మంత్రే చెప్పారు?

కేబినెట్ మంత్రే చెప్పారు?

మొత్తం మీద కర్ణాటక ఎన్నికల తర్వాత చంద్రబాబుపై కేంద్రం సీబీఐ అస్త్రాన్ని సంధించబోతుందన్న సంకేతాలు టీడీపీలో అలజడి రేపుతున్నాయి. చంద్రబాబు కేబినెట్ లోని ఓ సీనియర్ మంత్రే స్వయంగా ఈ విషయం చెప్పినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.

కేంద్రానికి ఆ హక్కు లేదు: ఓ ఐఏఎస్

కేంద్రానికి ఆ హక్కు లేదు: ఓ ఐఏఎస్


ఇదంతా ఇలా ఉంటే, రాష్ట్రాల పరిధిలో సీబీఐ విచారణకు ఆదేశించే అధికారం కేంద్రానికి లేదని ఓ ఐఏఎస్ ఆఫీసర్ అభిప్రాయపడ్డారు. కోర్టు లేదా రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల మేరకే కేంద్రం రాష్ట్ర పరిధిలోని అవినీతి లేదా ఇతరత్రా కేసులపై సీబీఐ విచారణకు ఆదేశించే ఆస్కారం ఉందని చెప్పారు. అంతే తప్ప కేంద్రం నేరుగా జోక్యం చేసుకునే హక్కు లేదని స్పష్టం చేశారు.

English summary
A senior Minister in the Naidu Cabinet said that the Central government is preparing ground for a CBI enquiry on the Pattiseema project as a part of its witch-hunt against Mr Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X