వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలవరం నిర్మాణంపై ఏపీ సర్కార్ కు కేంద్రం షాక్ .. ఆ నిబంధనల ఉల్లంఘనపై షోకాజ్ నోటీసులు

|
Google Oneindia TeluguNews

పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి మరోసారి బ్రేకులు పడనున్నాయా ? కేంద్రం జగన్ సర్కార్ కు షాక్ ఇస్తోందా ? పర్యావరణ అనుమతులు ఉల్లంఘనపై ఏపీ సర్కార్ కు షోకాజ్ నోటీసులు అందాయా? దీంతో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం మరింత జాప్యం అయ్యే అవకాశం ఉందా ? అంటే అవును అని చెప్పక తప్పని పరిస్థితి .

<strong>రుణమాఫీపై కోర్టుకెళ్తా ... రైతులు రుణమాఫీ కోసం జగన్ ను నిలదీయండి అన్న చంద్రబాబు</strong>రుణమాఫీపై కోర్టుకెళ్తా ... రైతులు రుణమాఫీ కోసం జగన్ ను నిలదీయండి అన్న చంద్రబాబు

అగమ్య గోచరంగా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం .. కమ్ముకున్న నీలినీడలు

అగమ్య గోచరంగా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం .. కమ్ముకున్న నీలినీడలు

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి పోలవరం ప్రాజెక్టుపై నీలి నీడలు కమ్ముకున్నాయి. మొదట పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ నిపుణుల కమిటీవేసి నిజానిజాలు నిగ్గు తేల్చాలని భావించిన ఏపీ సర్కార్ పోలవరానికి సంబంధించి నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు కీలక నిర్ణయాలు తీసుకుంది. పోలవరం పనులను నిర్వహిస్తున్న నవయుగ, బెకం కంపెనీలకు టెండర్లను రద్దు చేస్తున్నట్టు నోటీసులు జారీ చేసింది. దీంతో పోలవరం పనులు ఎక్కడివక్కడే ఆగిపోయాయి. ఇక ఇప్పుడు తాజాగా వస్తున్న వరదలతో పోలవరం ప్రాజెక్టు వద్ద పరిస్థితి చాలా దారుణంగా తయారయింది.
నిర్మాణ సంస్థలు పనులను నిర్వహిస్తున్నా వరద సమయంలో నిర్మాణానికి ఎలాంటి ఎఫెక్ట్ లేకుండా జాగ్రత్తలు తీసుకునే వీలుండేది. కానీ జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు పోలవరం పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

కేంద్రం తాజా షాక్ ... పర్యావరణ అనుమతుల నిబంధనల ఉల్లంఘనపై షోకాజ్ నోటీసులు

కేంద్రం తాజా షాక్ ... పర్యావరణ అనుమతుల నిబంధనల ఉల్లంఘనపై షోకాజ్ నోటీసులు

మొన్నటికి మొన్న ఏపీ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై కేంద్ర జన శక్తి వనరుల మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ విషయంలో సమయంతో పాటు, డబ్బు కూడా వృథా అవుతుందని కేంద్రమంత్రి లోక్ సభ వేదికగా పేర్కొన్నారు. ఇక ఇప్పుడు తాజాగా కేంద్రం మరో షాక్ ఇచ్చింది. ఏపీకి చెందిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పోలవరానికి మళ్లీ బ్రేకులు పడే పరిస్థితి నెలకొంది. పోలవరం నిర్మాణంపై ఏపీ సర్కార్ కు కేంద్రంషోకాజ్ నోటీసులు జారీ చేసింది. పర్యవరణ నింబంధనలనుప్రస్తావిస్తూ దానిపై వివరణ కోరింది. ఈ ప్రాజెక్టు విషయంలో పర్యావరణ అనుమతులు ఎందుకు రద్దు చేయకూడదో ఏపీ సర్కార్ కు వివరణ ఇవ్వాలని పేర్కొంది. పురుషోత్తపట్నం ప్రాజెక్టుపై కూడా కేంద్రం వివరణ కోరింది.
పోలవరంతో పాటు దాని అనుబంధ ప్రాజెక్టులపైతనిఖీలు జరిపించిన పర్యావరణ శాఖ అధికారులు ప్రాజక్టు నిర్మాణం విషయంలో పర్యావరణ అనుమతుల నిబంధనల్లో ఉల్లంఘనలు జరిగాయని తేల్చారు. ఇలా తనిఖీల తర్వాత కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు అధికారులు సమగ్ర నివేదిక అందజేశారు.

జాతీయ హరిత ట్రైబ్యునల్‌లో అఫిడవిట్‌ దాఖలు... ఏపీ సర్కార్ వివరణను బట్టి ప్రాజెక్టు భవితవ్యం

జాతీయ హరిత ట్రైబ్యునల్‌లో అఫిడవిట్‌ దాఖలు... ఏపీ సర్కార్ వివరణను బట్టి ప్రాజెక్టు భవితవ్యం

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో పర్యావరణ అనుమతులను నిబంధనల ఉల్లంఘన చేసినట్లుగా ఇచ్చిన రిపోర్టుఆధారంగాగత జులై నెలలో జాతీయ హరిత ట్రైబ్యునల్‌లో అఫిడవిట్‌ దాఖలు చేశారు. ఇక దీంతో ఏపీ సర్కార్ కు నోటీసులు నోటీసులు జారీ అయ్యాయి. ఈ ప్రాజెక్టు విషయంలో పర్యావరణ అనుమతులు ఎందుకు రద్దు చేయకూడో వివరణ ఇవ్వాలని పేర్కొంది కేంద్రం.
పోలవరానికి ఇటీవలే స్టాప్‌ వర్క్‌ ఆర్డర్‌ను రెండేళ్ల పాటు పొడిగించిన కేంద్రం.. మళ్లీ అనూహ్యంగా షోకాజ్‌ నోటీసులు జారీచేసింది. తాజా పరిణామం ఏపీ సర్కార్ కు ఏమాత్రం మింగుపడటం లేదు. అయితే దీనిపై ఏపీ సర్కార్ వివరణను బట్టి ఈ ప్రాజెక్టు భవితవ్యం ఆధారపడి ఉంది. ఒకపక్క టిడిపిని టార్గెట్ చేస్తూ జగన్ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలు, మరోపక్క కేంద్ర సర్కార్ జగన్ ప్రభుత్వానికి ఇస్తున్న షాక్ లు వెరసి పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై సందిగ్ధత నెలకొంది.

English summary
Ap's Prestigious project was again in problems . The Center has issued showcause notices to AP government on the construction of Polavaram. Referring to environment restrictions and seeking clarification on it. AP government has to explain why environmental permits should not be revoked in this regard. The Center is also seeking clarification on the Purushottapatnam project.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X