• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఇకముందు రాష్ట్రాలు చేసే అప్పులపై...కేంద్రం నజర్:ఆర్బీఐ అధికారానికి కత్తెర..

By Suvarnaraju
|

న్యూఢిల్లీ:ఇన్నాళ్లూ రిజర్వ్‌బ్యాంకు అధ్వర్యంలో జరిగే మార్కెట్‌ బారోయింగ్స్‌పై ఇకనుంచి కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షణ ఉండనుంది. ఆ మేరకు ఆర్బిఐ అధికారాలపై కత్తెర వేసి తాను ఆధిపత్యం చెలాయించేలా కేంద్రం కొత్త విధానాలకు రూపకల్పన చేస్తోంది.

ఆ క్రమంలో ఇక నుంచి రాష్ట్రాలు ప్రతి ఏటా తీసుకునే బహిరంగ మార్కెట్‌ రుణాలపై ముందుగానే ప్రణాళిక సిద్ధంచేసుకోవాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకు సూచిస్తున్నట్లు తెలిసింది. ఇదే విషయమై అన్ని రాష్ట్రాల ఆర్థిక శాఖ అధికారులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో చర్చించినట్లు సమాచారం.

అయితే ఈ ప్రక్రియ ద్వారా రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం మరింత పెరుగడం ఖాయమని రాష్ట్రాల అధికారులు భావిస్తున్నారు.

Central Government will monitor states market borrowings now onwards...

తాజాగా చేసిన ఒక అధ్యయనంలో గత ఆరేళ్ల కాలంలో రాష్ట్రాల ద్రవ్యలోటు రెట్టింపు అయిందని వెల్లడి అయింది. 2013-14లో సగటున రూ. 2.47 లక్షల కోట్లు ద్రవ్యలోటు ఉండగా...తాజాగా ఆ లోటు ఇప్పుడు ఏకంగా రూ. 4.86 లక్షల కోట్లకు చేరిందని కేంద్ర ఆర్ధికశాఖ లెక్కలు చెబుతోంది. అలాగే మార్కెట్‌ రుణాలు కూడా 2013-14లో రూ. 1.64 లక్షల కోట్లుండగా, ఇప్పుడది రూ. 4.40 లక్షల కోట్లకు చేరినట్లు గుర్తించారు.

అలాగే కేంద్రం చేసిన అప్పులు రూ. 3.90 లక్షల కోట్లుండగా, ద్రవ్యలోటు రూ. 6.24 లక్షల కోట్లుగా లెక్క తేల్చారు. అంటే ద్రవ్య లోటు విషయమొస్తే రాష్ట్రాల లోటు కన్నా కేంద్రం లోటు ఎక్కువగా ఉండగా, అప్పుల విషయానికొస్తే కేంద్ర అప్పుల కన్నా రాష్ట్రాలవే ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. ఇదిలావుంటే అన్ని రాష్ట్రాలు సెక్యూరిటీలను తనఖా పెట్టడం ద్వారా తీసుకునే రుణాలపై ఎక్కువ మొగ్గు చూపిస్తున్నాయి. దీనివల్ల ఏటా మార్కెట్‌ రుణాల మొత్తం పెరిగిపోవడంతో పాటు ప్రభుత్వ ఆస్తులు ఆ మేరకు తనఖాల్లోకి వెళ్లిపోతున్నాయి.

ఎఫ్‌ఆర్‌బిఎం చట్టం ప్రకారం జిఎస్‌డిపిలో 3 శాతానికి మించి అప్పులు తీసుకోరాదన్న నిబంధన ఉన్నప్పటికీ ఆ రూల్ ను రాష్ట్రాలు తెలివిగా ఉల్లంఘిస్తున్నాయి. తమకు లభించే అన్ని అవకాశాలను వాడుకుంటూ ఎక్కువ మొత్తాల్లో రుణాలు తీసుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తూ ముందుకుసాగుతున్నాయి. అలాగే జిఎస్‌డిపిలో 3 శాతానికి మించి అప్పులు తీసుకోరాదన్న నిబంధనను సవరించి కనీసం దీన్ని మరో అర శాతమైనా పెంచాలని రాష్ట్రాల నుంచి డిమాండ్లు వస్తున్నట్లు తెలిసింది. ఒకవేళ రాష్ట్రాల ఒత్తిడికి కేంద్రం తలొగ్గి అదే జరిగితే మార్కెట్‌ రుణాల మొత్తం మరింతగా పెరుగుతుందనేది విదితమే.

అందువల్ల ఇకపై మార్కెట్ రుణాలను క్రమబద్ధీకరించేందుకు ప్రత్యేకంగా ఒక క్యాలండర్‌ను కూడా నిర్వహించాలని కేంద్రం సూచిస్తోంది. ఏడాది మొత్తంపై కావాల్సిన మార్కెట్‌ బారోయింగ్స్‌ను త్రైమాసికాల వారీగా ముందే అన్ని రాష్ట్రాలూ వెల్లడించాల్సి ఉంటుందని కేంద్రం ఆదేశించనుంది. ఈ ప్రక్రియ ద్వారా రుణాలను క్రమబద్ధీకరించాలనేదే తమ ఉద్దేశ్యమని కేంద్రం సమర్ధించుకుంటోంది.

ఈ క్రమంలో మార్కెట్‌ బారోయింగ్స్‌ను కేంద్రం నిర్ణయిస్తుందని, వాటి మంజూరు, నిర్వహణా బాధ్యతలను మాత్రం రిజర్వ్‌బాంకు పరిధిలోనే ఉంచాలని కేంద్రం ప్రతిపాదిస్తోంది. అయితే మార్కెట్ బారోయింగ్స్ పై కేంద్రం జోక్యం రాష్ట్రాలపై పెత్తనాన్ని మరింత పెంచడం ఖాయమని రాష్ట్రాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ పరిణామం కేంద్ర రాష్ట్ర సంబంధబాంధవ్యాలను అనేక రకాలుగా ప్రభావితం చేస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
New Delhi: The central government will be monitor the market borrowing of State Governments instead of RBI. The Center is designing new policies to scrape the powers of the RBI and supervisory authority has to be gone in its hands.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more