వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జ‌గ‌న్‌కు మోదీ భారీ గిఫ్ట్‌...!! బీజేపీ నేత‌లే విస్తుపోయేలా: హోదా అంశంలో కీల‌క మ‌లుపు..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

జ‌గ‌న్‌కు భారీ ఉప‌శ‌మ‌నం || Central Govt Clarified That In Loksabha Request Of AP CM Jagan

ప్ర‌ధాని మోదీ కీల‌క నిర్ణ‌యం. ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు భారీ ఉప‌శ‌మ‌నం. ఏపీ ప్ర‌జల్లో త‌న‌ను దోషిగా చేసిన అంశం లో మోదీ పున‌రాలోచ‌న‌. ఏపీ ఎన్నిక‌ల్లో గెలిచి ప్ర‌మాణ స్వీకారానికి ముందే త‌న వ‌ద్ద‌కు వ‌చ్చిన జ‌గ‌న్ చేసిన తొలి విజ్క్షప్తి పైన ముఖ్య అడుగు. పార్ల‌మెంట్ సాక్షిగా వెల్ల‌డంచిన కేంద్రం. ఏపీకి సంజీవ‌నిగా చెబుతూ..మీరు 25 మంది లోక్‌స‌భ స‌భ్యుల‌ను గెలిపించండి..హోదా కోసం పోరాడుతామంటూ జ‌గ‌న్ నాడు ప్ర‌చారం చేసారు. ఫ‌లితంగా 22 మంది ఎంపీ ల‌ను ప్ర‌జ‌లు వైసీపీకి క‌ట్ట‌బెట్టారు. ఏపీలోని బీజేపీ నేత‌లు హోదా ముగిసిన అధ్యాయం అని..జ‌గ‌న్ ప్ర‌ధాని అయినా ఏపీకి హోదా రాద‌ని కాషాయ పార్టీ నేత‌లే చెబుతున్న వేళ‌..ప్ర‌ధాని తాజాగా తీసుకున్న నిర్ణ‌యం ఇప్పుడు ఏపీలో.. ప్ర‌ధానంగా ముఖ్య‌మంత్రికి భారీ ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తోంది.

ఆర్దిక సంఘానికి నివేదించిన ప్ర‌ధాని కార్యాల‌యం..

ఆర్దిక సంఘానికి నివేదించిన ప్ర‌ధాని కార్యాల‌యం..

ఏపి విభ‌జ‌న స‌మ‌యంలో రాజ్య‌స‌భ సాక్షిగా నాటి ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ ఏపీకి ప్ర‌త్యేక హోదా హామీ ఇచ్చారు. ఆ త‌రువా త దీని పైన నాటి యుపీఏ చివ‌రి కేబినెట్ స‌మావేశంలోనూ నిర్ణయం తీసుకుంది. 2014 ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా నాటి బీజేపీ ప్ర‌ధాని అభ్య‌ర్ది మోదీ ఏపీలో తాము హోదా ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. కానీ, అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత మోదీ స్వ‌రంలో మార్పు వ‌చ్చింది. 14 ఆర్దిక సంఘం కొత్త‌గా ఎవ‌రికీ కొత్త‌గా హోదా ఇవ్వ‌ద్ద‌ని చెప్పింద‌ని..దీని కార‌ణం గా కేంద్రం చెబుతూ వచ్చింది. ఇదే స‌మ‌యంలో నాటి ముఖ్య‌మంత్రి చంద్రబాబుతో జ‌రిపిన మంత్రాంగం ఫ‌లితంగా ప్యాకేజికి ఆమోద ముద్ర ప‌డింది. అయితే రాష్ట్రంలో ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ రాజ‌కీయంగా ఆ నిర్ణ‌యం పైన ముఖ్య‌మంత్రి ని ఇర‌కాటంలోకి నెట్టారు. దీంతో..ప్యాకేజీ పైన ప్ర‌త్యేకంగా ఎస్పీవి ఏర్పాటు చేయ‌మ‌ని కేంద్రం..ససేమిరా అని ఏపీ ప్ర‌భుత్వం చెప్ప‌టంతో అది నిలిచిపోయింది. ఇక‌, తాజా ఎన్నిక‌ల్లో మ‌రో సారి మోదీ అధికారంలోకి వ‌చ్చారు. ఇక్క‌డ ఏపీలో జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయ్యారు. ఈ స‌మ‌యంలో స్వ‌యంగా ప్ర‌ధాని కార్యాల‌యం ఏపీకి ప్ర‌త్యేక హోదా అంశం పైన 15వ ఆర్దిక సంఘానికి ప్ర‌తిపాద‌న అందించింది.

జ‌గ‌న్ అభ్య‌ర్ధ‌న పైన కీల‌క మ‌లుపు..

జ‌గ‌న్ అభ్య‌ర్ధ‌న పైన కీల‌క మ‌లుపు..

ఏపీ ఎన్నిక‌ల్లో గెలిచిన త‌రువాత జ‌గ‌న్ మే 26న ప్ర‌ధానిని క‌లిసారు. ప్ర‌మాణ స్వీకారినికి ముందే ప్ర‌ధానిని క‌లిసి ఏపీకి ప్ర‌త్యేక హోదా పైన నిర్ణం తీసుకోవాల‌ని అభ్య‌ర్దించారు. అదే విధంగా అమిత్ షాను కోరారు. నీతి అయోగ్ స‌మావేశం లోనూ విజ్ఞ‌ప్తి చేసారు. ఇక‌, తాజాగా లోక్‌స‌భ‌లో వైసీపీ ఎంపీ వంగా గీత హోదా పైన అడిగిన ప్ర‌శ్న‌కు కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి కీల‌క స‌మాధానం ఇచ్చారు. ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మే 26న ప్ర‌ధాని మోదీని క‌లిసి ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాలని చేసిన విజ్ఞప్తిని 15వ ఆర్దిక సంఘానికి నివేదించిన‌ట్లు మంత్రి నిత్యానంద్ రాయ్ వెల్ల‌డించారు. దీని ద్వారా హోదా అంశం కీల‌క మ‌లుపు తీసుకున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు 14వ ఆర్దిక సంఘం నో చెప్ప‌టంతోనే ఏపీకి హోదా ఇవ్వ‌లేదంటూ కేంద్రం చెబుతూ వ‌చ్చింది. అయితే, 14వ ఆర్దిక సంఘం అలా చెప్ప‌లేద‌ని ఏపీలోని పార్టీలు వాదిస్తున్నాయి. ఈ స‌మ‌యంలో తిరిగి 15వ ఆర్దిక సంఘానికి ఇప్ప‌టికే ఏపీ ప్ర‌భుత్వం ఇచ్చిన విన‌తుల‌తో పాటుగా స్వ‌యంగా కేంద్ర ప్ర‌భుత్వమే ఏపీకి హోదా పైన నివేదించ‌టం కీల‌క మ‌లుపుగా భావిస్తున్నారు. దీని పైన రాజ‌కీయంగా మ‌రింత ఒత్తిడి పెంచితే సానుకూల నిర్ణ‌యం వ‌చ్చే అవ‌కాశం ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

2020 ఏప్రిల్ 1 నుండి అమ‌ల్లోకి కొత్త సిఫార్సులు..

2020 ఏప్రిల్ 1 నుండి అమ‌ల్లోకి కొత్త సిఫార్సులు..

ఇప్పుడు నీతి అయోగ్ ఏపికి ప్ర‌త్యేక ఆర్దిక సాయం కోసం సూచ‌న‌లు చేసింది. ఇక‌, ఇప్పుడు ఏపీ..కేంద్రం నేరుగా 15వ ఆర్దిక సంఘానికి ఏపికి ప్ర‌త్యేక హోదా కోసం నివేదించ‌టంతో ఆర్డిక సంఘం అనుకూలంగా నిర్ణ‌యం తీసుకుంటుందా లేక ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను సూచిస్తుందా అనే చ‌ర్చ మొద‌లైంది. కేంద్ర‌మే ప్ర‌తిపాద‌న చేస్తే ఖ‌చ్చితంగా అనుకూ లంగానే నిర్ణ‌యం ఉంటుంద‌ని వైసీపీ అంచ‌నా వేస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు హోదా పైన ఎన్ని విజ్ఞ‌ప్తులు వ‌చ్చినా.. ప‌క్క‌న ప‌డేసిన కేంద్రం..ఇప్పుడు స్వ‌యంగా నివేదించ‌టం ద్వారా ప్ర‌ధాని వైఖ‌రిలో మార్పు వ‌చ్చింద‌నే చ‌ర్చ సైతం మొద‌లైంది. ఇదే స‌మ‌యంలో మ‌రింత‌గా ఒప్పించేలా ప్ర‌ధానితో పాటుగా ఆర్దిక సంఘంతోనూ సంప్ర‌దింపులు మ‌రింత ఒత్తిడి పెంచేలా ఉండాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. ఇక‌, రాజ‌కీయం గా ఏపీలో బ‌లోపేతానికి ఇప్పుడున్న ప‌రిస్థితులు త‌మ‌కు అనుకూలంగా బీజేపీ భావిస్తోంది. ముందుగా ఏపీకీ హోదా ఇస్తేనే త‌మ మీద ప్ర‌జ‌ల్లో ఉన్న వ్య‌తిరేక భావం పోతుంద‌ని అంచ‌నా వేస్తోంది. ఈ కోణంలో ఆలోచ‌న చేసినా..తొలుత హోదా మీద సానుకూల నిర్ణ‌యం తీసుకొనే అవ‌కాశం క‌నిపిస్తోంది. మ‌రి..హోదా ద‌క్కేలా..రాజ‌కీయంగా బీజేపీని ఎదుర్కొంటూ నిల‌బ‌డేలా జ‌గ‌న్ ఎలా వ్య‌వ‌హ‌రిస్తార‌నేది ఇప్పుడు కీల‌కంగా మారింది.

English summary
Key turn in Special status for AP issue. Central govt clarified that in Loksabha Request of AP Cm Jagan on special status is forwarded to 15th Finance Commission. If commission recommend for Status it will be in force.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X