విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేంద్రం గ్రీన్ సిగ్నల్: దుర్గగుడి ప్లైఓవర్‌కు రూపు రేఖలు ఖరారు, 300 కోట్లని అంచనా

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఎప్పటినుంచో మోక్షం లభిస్తుందని చూస్తున్న విజయవాడ దుర్గగుడి ప్లైఓవర్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ప్లైఓవర్ మార్గానికి సంబంధించిన రెండో అలైన్‌మెంట్‌ ప్రతిపాదనను ఆమోదిస్తూ ఆర్‌ అండ్‌ బీ ప్రిన్సిపల్‌ సెక్రటరీకి గురువారం లేఖ రాసింది.

ప్లైఓవర్ నిర్మాణానికి కేంద్ర ఉపరితల రవాణా శాఖ రూపురేఖలను ఖరారు చేసింది. ఈ వంతెన నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాన్ని సమగ్ర ప్రాజెక్టు నివేదిక కోరింది. దీనికి సంబంధించిన వివరాలను విజయవాడ ఎంపీ కేశినేని నాని వెల్లడించారు.

 Central govt given clearance for vijayawada kanaka durga temple flyover

ప్రతిపాదిత ప్లైఓవర్‌ను కుమ్మరిపాలెం నుంచి కార్పొరేషన్‌ కార్యాలయం వెనకవైపు వరకు 2.3 కిలోమీటర్ల పొడవున నాలుగు లైన్ల ఫ్లైఓవర్‌ నిర్మించనున్నారు. దీనికి సుమారు రూ. 300 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు.

డీపీఆర్‌ అంగీకరిస్తే వెంటనే నిధులు విడుదల చేస్తామని కేంద్రం ప్రభుత్వం ఆ లేఖలో స్పష్టం చేసింది. త్వరలోనే దుర్గగుడి ప్లైఓవర్ పనులకు శంకుస్ధాపన చేయనున్నట్లు ఎంపీ కేశినేని నాని వెల్లడించారు.

English summary
Central govt given clearance for vijayawada kanaka durga temple flyover.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X