నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలుగు వెలుగులు: ఏపీలో ప్రాచీన భాష అధ్యయన కేంద్రం : ఇద్దరు తెలుగు సీఎంలకూ..!!

|
Google Oneindia TeluguNews

పదేళ్లకు పైగా తెలుగు ప్రజల నిరీక్షణ ఫలించింది. ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం ఎట్టకేలకు తెలుగు గడ్డపై ఏర్పాటు కాబోతోంది. మైసూరులో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని నెల్లూరుకు తరలించాలని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2014లో రాష్ట్ర విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పాటవడంతో అధ్యయన కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలన్నది తేలక కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని పక్కనపెట్టింది. అయితే ఇప్పుడు వెంకయ్యనాయుడి చొరవతో నెల్లూరుకు దీనిని తరలించేందుకు అంగీకరించింది.

నెల్లూరులో ప్రాచీన భాష అధ్యయన కేంద్రం..
తెలుగు వారు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం ఎట్టకేలకు ఆమోదించింది. 11 ఏళ్ల క్రితం మైసూరులో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని నెల్లూరుకు తరలించాలని నిర్ణయించారు. దేశంలోని భాషల అధ్యయనం కోసం కేంద్ర ప్రభుత్వం కర్ణాటకలోని మైసూరులో 1969లో సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియన్‌ లాంగ్వేజె్‌స(సీఐఐఎ్‌స)ను ఏర్పాటు చేసింది. 2004లో తమిళ భాషకు కేంద్ర ప్రభుత్వం ప్రాచీన హోదా కల్పించింది. 2008 అక్టోబరు 31న తెలుగు, కన్నడ భాషలను కూడా ప్రాచీన భాషలుగా గుర్తించింది. ప్రాచీన హోదా కల్పించిన వెంటనే తమిళ, తెలుగు, కన్నడ భాషల అధ్యయనానికి సీఐఐఎల్‌లోనే భాషల వారీగా అధ్యయన కేంద్రాలను ఏర్పాటు చేసింది. అయితే తమిళనాడు రాష్ట్రం తమ భాష అధ్యయన కేంద్రాన్ని వెంటనే స్వరాష్ట్రానికి తరలించుకుపోగా.. కర్ణాటక కూడా తమ అధ్యయన కేంద్రాన్ని వేరే అనువైన ప్రాంతంలో ఏర్పాటు చేసుకుంది. తెలుగు భాష అధ్యయన కేంద్రం మాత్రం ఇప్పటికీ మైసూరు సీఐఐఎల్‌లోనే కొనసాగుతోంది. 2014లో రాష్ట్ర విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పాటవడంతో అధ్యయన కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలన్నది తేలక కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని పక్కనపెట్టింది. నెల్లూరుకు దీనిని తరలించేందుకు అంగీకరించింది.

Central govt given orders to accomidate acncient telugu research centre in AP

ఉప రాష్ట్రపతి చొరవ.. ప్రభుత్వ ప్రయత్నం
ప్రాచీన భాష కేంద్రాన్ని నెల్లూరుకు తరలించడంపై ఉపరాష్ట్రపతి చొరవ తీసుకున్నారు. అధికారులతోనూ సంప్రదింపులు జరిపారు. విజయదశమి నాడు ప్రాచీన భాష అధ్యయన కేంద్రం ప్రారంభోత్సవానికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్‌ జగన్‌, కేసీఆర్‌లను ఆహ్వానించేందుకు కేంద్ర మానవ వనరుల శాఖే చొరవ తీసుకోనుంది. గత ఏడాది ఈ కేంద్రానికి 35 పోస్టులను మంజూరు చేశారు. లైబ్రరీ, పరిశోధనా ప్రాజెక్టులు, వర్క్‌ షాపులు కూడా ప్రారంభమయ్యాయి. ఈ కేంద్రానికి భవనాన్ని, స్థలాన్ని కేటాయించాల్సిందిగా 2014లో హైదరాబాద్‌లోని కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని తొలుత కోరినప్పటికీ అది ఆచరణ సాధ్యం కాలేదు. అప్పటి ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి ప్రతిపాదనలు రాలేదు. దీంతో ఈ కేంద్రం మైసూరులోనే కొనసాగుతోంది. అయితే దీనిని నెల్లూరుకు తరలించడానికి వెంకయ్య చొరవ తీసుకున్నారు. రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ కూడా లేఖ రాయడంతో పాటుగా నిరంతరం ఒత్తిడి కొనసాగించటంతో ఇప్పుడు ఏపీలోని నెల్లూరులో ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం ఏర్పాటు కానుంది.

English summary
Central govt given orders to accomidate acncient telugu research centre in AP.On Vijaya dasami day it may be opened in Nellore.Both Telugu CM's attned this function.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X