వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మే 4న ఏపీకి కేంద్ర బృందం రాక- కరోనా పరిష్కారాల సూచన...

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో పరిస్ధితిని తక్కువ సమయంలో అంచనా వేయడంతో పాటు తగిన పరిష్కారాలు సూచించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక బృందాలను పంపుతోంది. ఇప్పటికే మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమబెంగాల్ వంటి కరోనా కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు వెళ్లిన కేంద్ర బృందాలు వచ్చే నెల 4న ఏపీలోనూ పర్యటించనున్నాయి. ఏపీలో కరోనా కేసులు అధికంగా ఉన్న కర్నూలు, గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఈ బృందాలు పర్యటిస్తాయి.

central govt team to visit andhra pradesh on 4th to know ground reality

Recommended Video

Indian Railways Plan To Operate 400 Special Trains Per Day With 1,000 Passengers

ఏపీకి రానున్న కేంద్ర బృందాలు స్ధానికంగా కరోనా కేసుల పెరుగుదలకు దారితీస్తున్న కారణాలు, వాటి నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై స్ధానిక అధికారులకు తగు సూచనలు, సలహాలు అందజేస్తాయి. అలాగే వైద్యులు, ఇతర పారా మెడికల్ సిబ్బంది రక్షణకు తీసుకుంటున్న చర్యలను తెలుసుకున్నాక, అవసరమైతే సూచనలు చేస్తారు. అనంతరం స్ధానికంగా తమకు అందిన సమాచారం మేరకు ఓ నివేదికను కేంద్రానికి అందించనున్నాయి. వీటిని కరోనా ప్రభావిత రాష్ట్రాలకు తక్కువ సమయంలో పరిష్కారాలు కనుగొనేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. అందుకే కేంద్ర బృందాల రాకపై పలు రాష్ట్రాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

English summary
central govt is sending a team to andhra pradesh to know the ground reality in wake of coronavirus crisis. central team to visit the state on 4th may and give suggestions to the state for controlling the spread of coronavirus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X